Gruhalakshmi October 12th: సామ్రాట్ పగలైనా, రాత్రైనా వస్తాడు మర్యాద చేసి తీరుతా- తులసి ఉగ్రరూపం
తులసి దగ్గరకి సామ్రాట్ రావడంతో అనసూయ కొప్పడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దారి తప్పి తిరిగే వాళ్ళకి ఇక్కడ చోటు లేదు, కాలనీలో ఉండాలంటే నీ కోడలిని పద్ధతిగా ఉండమని అమ్మలక్కలు అంటారు. వాళ్ళ మాటలకి అనసూయ ఆగ్రహంతో ఊగిపోతుంది. వాళ్ళ మీదకి చేయి ఎత్తితే తులసి ఆపుతుంది. నీ వల్లే ఇలా జరిగింది, సామ్రాట్ కి దూరంగా ఉండమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా నా మాట. నీకు ఏమవుతాడాని అతనితో కలిసి దాండియా ఆడావ్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్ బాబు, నీ వల్ల మా కుటుంబంలో రోజు సమస్యలే రోజు తల నొప్పులే. అయిపోయింది కదా ఆట పాట బహుమతి కూడా వచ్చింది కదా ఇక వెళ్ళు. పొరపాటున కూడా మా కాలనీ వైపు రావొద్ధు. అందుకే చెప్పాను నీకు తులసికి దూరంగా ఉండమని తనని ఉద్యోగంలో నుంచి తీసేయమని. మాట విన్నావ్ కానీ ఏం లాభం మళ్ళీ వెంటపడుతున్నావ్’ అని అనసూయ అరుస్తుంది.
తులసి ఉద్యోగం పోవడానికి కారణం నేనే, ఇలాంటి తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా బతుకుదామని ఇలాంటి నిర్ణయం తీసుకున్నా ఏంటి అందులో తప్పని అనసూయ అంటుంది.
తులసి: తప్పే అత్తయ్య
అనసూయ: ఏంటి తప్పు, నిన్ను కోడలిగా తెచ్చుకున్నా, కూతురిలా చూసుకున్నా.. నిన్ను ఏ విషయంలోని అడ్డు పడలేదు. నిన్ను గడపదాటి వెళ్ళడానికి అనుమటించా కానీ ఇంత మర్యాద లేకుండా ప్రవర్తించడానికి కాదు
సామ్రాట్: ఇక ఆపుతారా మీ తమాషా.. తులసిగారు ఇది మీ సొంత విషయం అయినా నేను ఇప్పుడు నోరు విప్పాలని అనుకుంటున్నా, మీరు అనుమతిస్తే మాట్లాడతాను
అనసూయ: ఈ ఇంటి పెద్దని నేను ఎవరికైనా అనుమతి ఇవ్వాలసింది నేను. జరిగింది చాలు
తులసి: మాట్లాడి వెళ్ళండి సామ్రాట్ గారు మీరు మా ఇంట్లో భాగం కాకపోవచ్చు కానీ నా మీద పడిన నిందలో మీకు భాగం ఉంది
సామ్రాట్: ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. కానీ మిమ్మల్ని చూశాక అది నిజమని అనిపిస్తుంది. మా మనసుల్లో, మా స్నేహంలో ఎలాంటి దోషం కల్మషం లేదు. ఉన్న కల్మషం అంతా మీ ఆలోచనల్లోనే ఉంది
అనసూయ: కబుర్లు చెప్పొద్దు ఆడ మగ ఇలాంటి స్నేహాలు అమెరికా లాంటి చోట సాగుతాయి కానీ ఇక్కడ కాదు
Also Read: ఆదిత్య, రుక్మిణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సత్య- మాధవ్ కన్నింగ్ ప్లాన్
తులసి: ఒకప్పుడు ఈ లాస్య నందగోపాల్ గారితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది, అప్పుడు మీకు పరువు గుర్తుకు రాలేదా ఇప్పుడు జ్ఞానోదయం అయిందా. ఆడదానికి ఒక మగాడు స్నేహంగా ఉండకూడదా. విడాకులు తీసుకుంటే మగాడికి బాధ్యత ఉండడా, ఆడదాని మీదే మచ్చ పడుతుందా. ఇలా మాట్లాడినందుకు మిమ్మల్ని కాలనీ చివరి వరకి తరిమి కొట్టేదాన్ని
అమ్మలక్కలు: ఇలాంటి దురుసుదాన్ని కోడలిగా ఎలా చేసుకున్నావ్ అనసూయ
తులసి: నీ చరిత్ర నాకు తెలియదా, ప్రతి పండగకి పుట్టింటి నుంచి కోడలితో అన్నీ తెప్పించుకుంటున్నావ్. ఇంకొక్క మాట నీ నోటి నుంచి వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు
సామ్రాట్: ఈ గొడవ అంతా నేను ఈరోజు ఇక్కడికి రావడం వల్లే జరిగింది
తులసి: లేదు సామ్రాట్ గారు మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు మీ వల్ల ఈరోజు ఎవరి మనసులో ఏముందో అర్థం అయ్యింది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సామ్రాట్ గారు నాకు మంచి స్నేహితులు, వ్యాపార భాగస్వామి, అంతక మించి మంచి మనిషి. ఈరోజు నుంచి ఎవరైనా సామ్రాట్ గారి గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోను. ఇక నుంచి సామ్రాట్ గారు పగలు, రాత్రి, పని ఉన్నా లేకపోయినా వస్తాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. ఎప్పుడు వచ్చినా నేను మర్యాదలు చేస్తాను, ఆయనకి అవమానం జరిగితే మాత్రం ఊరుకునేదే లేదు
Also Read: సులోచనలో కదలిక తెచ్చేందుకు మాలిని సూపర్ ప్లాన్- అభికి వార్నింగ్ ఇచ్చిన యష్, వేద
ఆ మాటకి అందరూ చప్పట్లు కొట్టి తులసిని అభినందిస్తారు. కోపంగా తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సామ్రాట్ చాలా సనతోషంగా ఇంటికి వస్తాడు. తులసి గారు తన మనసులో ఏముందో అందరి ముందు చెప్పిందని సామ్రాట్ చాలా సంతోషిస్తాడు. ఎట్టి పరిస్థితులలోనూ తులసి గారి స్నేహం వదులుకోను అని అంటాడు.