News
News
వీడియోలు ఆటలు
X

Gruhalakshmi May 6th: దివ్య గురించి విక్రమ్ మనసులో విషబీజం నాటిన రాజ్యలక్ష్మి- మళ్ళీ ఫస్ట్ నైట్ గోవింద

లాస్య చేసిన కుట్ర తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

ప్రియ దిగులుగా ఉండటం చూసి ఏమైందని ఎందుకు అలా ఉంటున్నావాని దివ్య వచ్చి అడుగుతుంది. కానీ ప్రియ మాత్రం తన సమస్య చెప్పదు. చాలా సార్లు నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నావ్ కానీ చెప్పలేకపోతున్నావ్ ఎందుకని అలా అంటుంది. నేను నీలా చదువుకోలేదు ఒక్కసారిగా ఈ పెద్ద ఇంట్లో వచ్చి పడ్డానని ఇన్ డైరెక్ట్ గా ఇంట్లో జరుగుతున్న వాటిని చెప్తుంది. నీ ప్రాబ్లం ఎవరితో సంజయ్ తోనా అత్తయ్యకి చెప్పి మాట్లాడతానని అనేసరికి ప్రియ నవ్వుతుంది. లాస్య ఫోన్ ఏమైనా చేసిందా అని అనసూయ నందుని అడుగుతుంది. తులసి వచ్చి దివ్య దగ్గరకి వెళ్ళి చూసి వస్తానని చెప్తుంది. వెళ్లొద్దని నందు అంటాడు. నీకు రాజ్యలక్ష్మి గురించి తెలిసిపోయింది అన్నీ అనుమానంగా చూస్తావ్ మనసు కష్టపెట్టుకుంటావ్ మళ్ళీ వెళ్ళడం అవసరమా అంటుంది. దివ్యని చూడాలని మాట్లాడాలని ఉందని అందుకే వెళ్తానని చెప్తుంది. సరే నేను నీతో వస్తానని నందు అంటాడు.

Also Read: జానకికి డెడ్ లైన్ పెట్టిన మనోహర్- రామ కోసం ఉద్యోగానికి రిజైన్ చేస్తుందా?

ఇంట్లో జరిగిన గొడవ మొత్తం లాస్య చెప్పేస్తుంది ఇక రాజ్యలక్ష్మికి మనకి నిజం తెలిసిపోయిందని అర్థం అవుతుందని నందు చెప్తాడు. సరే అని ఇద్దరూ బయల్దేరుతూ ఉండగా పోలీసులు వస్తారు. లాస్య మీ భార్య కదా మెడ పట్టి బయటకి గెంటేశారంట కదా గృహహింస కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తాడు. మేము తనని హింసించడం కాదు తనే మమ్మల్ని హింసిస్తుంది అది భరించలేక బయటకి పంపించేశానని అంటాడు. నందు అరెస్ట్ చేస్తున్నారని ఏదో ఒకటి చేయమని అనసూయ తులసిని అడిగితే అది వాళ్ళ భార్యాభర్తల విషయం జోక్యం చేసుకోలేనని తప్పుకుంటుంది. దివ్యని మళ్ళీ ఫస్ట్ నైట్ కోసం రెడీ చేస్తూ ఉంటారు. ప్రసన్న రాజ్యలక్ష్మి భజన మొదలు పెడుతుంది. గదిలో విక్రమ్ తాతయ్య బెడ్ ని రెడీ చేస్తుంటే విక్రమ్ దివ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

తులసి మోహన్ కి ఫోన్ చేసి నందు అరెస్ట్ చేసిన విషయం చెప్తుంది. వెంటనే వెళ్ళి బెయిల్ మీద నందుని బయటకి తీసుకురమ్మని అంటుంది. ఈసారి ఫస్ట్ నైట్ జరుగుతుందో లేదోనని ప్రసన్న తుమ్ముతుంది. ఇలాంటి అపశకునాలు ఎన్ని ఎదురైన ఫస్ట్ నైట్ జరిగి తీరాల్సిందేనని దివ్య ముందు చెప్తుంది. బయటకి వచ్చిన తర్వాత ప్రియని పిలిచి మీ ఇద్దరి మధ్య స్నేహం ముదురుతుంది తప్పు ఎవరిదైనా వేటు నీ మీద పడుతుందని బెదిరిస్తుంది. ఫస్ట్ నైట్ ఎలా ఆపించబోతున్నావ్ బసవయ్య ఆత్రంగా అడుగుతాడు. అప్పుడే దివ్య కి లాస్య ఫోన్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు మొగుడి ఒడిలో ఉందామా అని ఎదురుచూస్తున్నావ్ అని నాకు తెలుసు కానీ ఆ మూడ్ పాడుచేయడానికి చేశాను. మీ నాన్న జైల్లో ఉన్నాడని చెప్తుంది. అది విని షాక్ అవుతుంది.

Also Read: కోడలి హోదాలో భోగాలు అనుభవించమన్న అపర్ణ- అత్తకి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చిన కావ్య

దివ్యకి విషయం చెప్పావా అని పరంధామయ్య అడుగుతాడు. ఇంకా చెప్పలేదని అంటుండగా దివ్య పరుగున వచ్చి నాన్నని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది. తులసి అవునని చెప్పేసరికి దివ్య బాధపడుతుంది. నాన్న అరెస్ట్ అయితే నువ్వు ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నావని అంటుంది. నేను ఆయన భార్యని కాదని చెప్తుంది. మరి అలాంటప్పుడు కన్యాదానం ఎందుకు చేశావాని దివ్య నిలదీస్తుంది.

Published at : 06 May 2023 08:41 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial May 6th Update

సంబంధిత కథనాలు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!