Brahmamudi May 5th: కోడలి హోదాలో భోగాలు అనుభవించమన్న అపర్ణ- అత్తకి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చిన కావ్య
కావ్య, రాజ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య, రాజ్ ని ఒక్కటి చేసేందుకు ఇంద్రాదేవి పూజ చేయిస్తుంది. ఈ తంతు పుణ్యమా అని రాజ్ గదిలోకి కావ్య భార్యగా అడుగుపెడుతుంది. ఇద్దరికీ బ్రహ్మముడి వేసి కలిసి ఉండేలా చేస్తుంది. దీంతో కావ్య నేల మీద పడుకుంటే రాజ్ బెడ్ మీద పడుకుని నిద్రపోతు పొరపాటున జారి తన మీద పడతాడు. దీంతో కావ్య గావు కేక పెట్టి అరిచి గోల చేసేసరికి అందరూ గది దగ్గరకి వచ్చేస్తారు. వాళ్ళ ముందు రాజ్ అడ్డంగా బుక్కవుతాడు. మొరటోడా, విలన్, దుశ్యాసనుదా, బండోడా అని తలా ఒక మాట అనేసి నవ్వుతూ వెళ్లిపోతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమో లో ఏం జరిగిందంటే..
అపర్ణ చీర తీసుకుని కావ్య దగ్గరకి వస్తుంది. మేడమ్ మీరు నాకు చీర తీసుకొచ్చారా అని కావ్య సంతోషంగా, ఆశ్చర్యంగా అడుగుతుంది. జరిగిన దాంట్లో తప్పు నీది అని అందరికీ తెలిసొచ్చి ఇక్కడ నుంచి వెళ్లిపోతావు. అప్పటి వరకు ఈ ఇంటి కోడలిగా రాజ భోగాలు అనుభవించమని అపర్ణ అంటుంది. అంటే నేను తప్పు కాదని నిరూపణ అయితే ఈ ఇంట్లో దుగ్గిరాల ఇంటి కోడలిగా శాశ్వతంగా ఉండిపోతాను కదా మేడమ్ అని కావ్య సంతోషంగా అనేసరికి అపర్ణకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదంతా చూసి రుద్రాణి సంబరపడుతుంది.
Also Read: నిజం తెలుసుకున్న తులసి - సంజయ్ మెడలు వంచిన దివ్య- నందుని జైలుకి పంపించిన లాస్య
గురువారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్ బెడ్ రూమ్ లో జరిగిన గోడవకు అందరూ వచ్చి తల ఒక మాట అనేసి తిట్టేసి వెళ్లిపోతారు. మీలో ఒక ప్రతి నాయకుడు ఉన్నాడని కావ్య రాజ్ ని అంటుంది. ఇక స్వప్న నిద్రలేచి పెద్దమ్మ కాఫీ ఇవ్వమని అంటుంది. బ్రష్ చేయకుండా కాఫీ ఎందుకు గోరు వెచ్చని నీళ్ళు తాగమని కనకం అక్క చెప్తుంది. దీంతో స్వప్న కోపంగా కనకం అక్కని నోటికొచ్చినట్టు తిడుతుంది. మన ఇంట్లో పడి మూడు పూటలా తింటుంది ఆ మాత్రం కాఫీ కూడా ఇవ్వలేదా, తను మంచిది కాదు కాబట్టే కొడుకు కూడా ఇంట్లో నుంచి తరిమేశాడని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాటలకు కృష్ణమూర్తి స్వప్న మీద విరుచుకుపడతాడు. ఈ ఇంట్లో ఉండాలంటే అందరితో ప్రేమగా కలిసి మెలిసి ఉండాలని లేదంటే రోడ్డు మీదకు వెళ్లాల్సి వస్తుందని కృష్ణమూర్తి దంపతులు స్వప్నకి వార్నింగ్ ఇస్తారు.
Also Read: ముకుంద ప్లాన్ అట్టర్ ప్లాప్- కృష్ణ మనసులో మోగిన ప్రేమ గంటలు, ఇక రసవత్తరమే
ఇక పూజ చేసిన రాజ్, కావ్య దంపతులకు మంగళ స్నానం చేయిస్తారు. స్నానం చేసిన తర్వాత కావ్య తులసి కోట ముందు దీపం పెట్టి హారతి ఇస్తానంటే అపర్ణ ఒప్పుకోదు. కానీ ఇంద్రాదేవి అడ్డం పడి కావ్యతోనే దీపం పెట్టిస్తుంది.
View this post on Instagram