News
News
వీడియోలు ఆటలు
X

Gruhalakshmi May 5th: నిజం తెలుసుకున్న తులసి - సంజయ్ మెడలు వంచిన దివ్య- నందుని జైలుకి పంపించిన లాస్య

లాస్య వల్ల దివ్య జీవితం నాశనం అయ్యిందని తెలియడంతో తులసి ఉగ్రరూపం దాలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

తన కూతురి జీవితం నాశనం చేసినందుకు లాస్యని నందు ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడు. ఈ ఇంట్లో నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్తుంది. రాజ్యాలక్ష్మీ మళ్ళీ డ్రామా మొదలుపెడుతుంది. మెట్లు దిగుతూ విక్రమ్ ని చూసి కింద పడబోతున్నట్టు కలరింగ్ ఇస్తుంది. దివ్యని పిలిచి మీ సంతోషానికి అడ్డం వస్తున్నా మీ ఫస్ట్ నైట్ జరగకుండా చేశానని ఏడుస్తుంది. నువ్వు ఎంతో నాకు దివ్యకి తెలుసు ఇంక ఎందుకు ఇలా బాధపడటడమని విక్రమ్ సర్ది చెప్తాడు. ఇక బసవయ్య, ప్రసన్న మరింతగా రాజ్యలక్ష్మిని మునగ చెట్టు ఎక్కిస్తారు. పంతులని రమ్మని కబురు పెట్టాను మీకు మళ్ళీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తానని చెప్తుంది. అప్పుడే పంతులు వస్తాడు. ఈరోజు సాయంత్రం దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు చెప్పేసరికి విక్రమ్ వాళ్ళు నవ్వుతూ సిగ్గు పడతారు. ఖాయం చేయండి ఈ రాత్రికి కార్యం జరిగి తీరాలని దొంగ మాటలు చెప్తుంది.

Also Read: ముకుంద ప్లాన్ అట్టర్ ప్లాప్- కృష్ణ మనసులో మోగిన ప్రేమ గంటలు, ఇక రసవత్తరమే

నందు, తులసి వాళ్ళు దివ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. లాస్య తెచ్చిన సంబంధం వద్దని చెప్పా కానీ మీరు వినలేదు తన వంకర బుద్ధి చూపించలేదు ఇప్పటికైనా తన నుంచి విముక్తి దొరికిందని అంటాడు. లాస్యని క్షమిస్తావా అని పరంధామయ్య అంటే చచ్చినా క్షమించను మా మధ్య బంధం తెగిపోయిందని తెగేసి చెప్తాడు. దివ్య జీవితం నాలా కాకూడదని కష్టపడి డాక్టర్ చదివించాను కానీ పెళ్లి విషయంలో బోల్తా పడ్డానని తులసి బాధపడుతుంది. దివ్య బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు ఎదిరించి పోరాడుతుందని అనసూయ సర్ది చెప్పడానికి చూస్తుంది.

నందు: ఆ ఇంట్లో ప్రియ పరిస్థితి బాగోలేదు

తులసి: మీకు ఎలా తెలుసు

నందు: దివ్య విషయం హెచ్చరించడానికి వచ్చినప్పుడు తన పరిస్థితి చెప్పింది. రాజ్యలక్ష్మి పగ బట్టి దివ్యని కోడల్ని చేసుకుంటుందని పెళ్లి రోజు ప్రియ వచ్చి హెచ్చరించింది

తులసి: పెళ్లి రోజే తెలిస్తే పెళ్లి ఎందుకు జరగనిచ్చారు

నందు: నిజం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను అప్పటికే తాళి కట్టడం పూర్తయింది ఇక ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను

తులసి: నా కూతురికి నా పరిస్థితి దాపురించింది

నందు: నీ పరిస్థితి దివ్యకి రాలేదు తన భర్త తనని బాగా చూసుకుంటున్నాడు

తులసి: పగ పట్టిన అత్త ఆ ప్రేమ ఎన్ని రోజులు ఉండనిస్తుంది

Also Read: భార్యని చూసి డిసప్పాయింట్ అయిన యష్- మాళవికకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వేద

సంజయ్ బయటకి వెళ్తుంటే ప్రియ ఎదురుపడుతుంది. పేడ మొహం వేసుకుని ఎదురు వచ్చావాని తిడుతుంటే ప్రియ ఎదురు మాట్లాడుతుంది. నాకోసం హాస్పిటల్ లో తిరిగి ఇప్పుడు మొహం నచ్చడం లేదని అంటారా అని అడుగుతుంది. లాగిపెట్టి కొడతానని సంజయ్ అనడం అప్పుడే అటుగా వచ్చిన దివ్య చూసి ఎందుకు ప్రియ మీద చెయ్యి లేపావని నిలదీస్తుంది. అది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయమని ప్రియ ఏడుస్తుంది. ఎందుకు ప్రియని కొట్టడానికి చెయ్యి లేపావని మళ్ళీ అడిగేటప్పటికి విక్రమ్, రాజ్యలక్ష్మి వస్తారు. సంజయ్ ని ఉతికి ఆరేస్తుంది. ఇంట్లో వదిన పిలవమని ఆర్డర్ వేస్తుంది. ప్రియ ఏం తప్పు చేసిందని విక్రమ్ కూడా నిలదీస్తాడు. హాస్పిటల్ కి వెళ్తుంటే చిరాకు తెప్పించిందని చెప్తాడు. చేసిన తప్పుకి ప్రియకి సోరి చెప్పమని రాజ్యలక్ష్మి చెప్తుంది. సోరి అని విసురుగా చెప్పేసి వెళ్తుంటే అలా కాదు చేప్పేదని మళ్ళీ ఆర్డర్ వేస్తుంది. దీంతో చేసేది లేక దివ్య చెప్పినట్టు వింటాడు. లాస్య భాగ్య దగ్గరకి వస్తుంది. నందుని ఎలాగైనా తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటానని చెప్తుంది. 

Published at : 05 May 2023 10:04 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial May 5th Update

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి