News
News
వీడియోలు ఆటలు
X

Gruhalakshmi May 17th: నందు స్త్రీలోలుడని లాస్య పుకార్లు- పంతులు తిక్క కుదుర్చి మాస్టర్ ప్లాన్ వేసిన దివ్య

రాజ్యలక్ష్మి నిజస్వరూపం దివ్యకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

పిల్లలకి పేరెంట్స్ గా తప్పితే మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని తులసి కోర్టులో చెప్తుంది. లాస్య మాయలో పడి నందగోపాల్ మీకు విడాకులు ఇచ్చారా అని మాధవ్ అడుగుతాడు. అవునని అంటుంది. అది లాస్య క్యారెక్టర్ ఒక స్త్రీ అయి ఉంది  మరొక స్త్రీ భర్తని లాక్కుంది. తులసి ఎక్కడ తన భర్తని లాక్కుంటుందేమోనని ఇన్ సెక్యూరిటీతో భయపడుతుంది, ఇంట్లో వాళ్ళని టార్చర్ చేసింది అది తట్టుకోలేక తిరగబడ్డాడని మాధవ్ చెప్తాడు. అసలు లాస్యకి నందుతో గొడవ ఎందుకు పడిందో చెప్పమని నిలదీస్తాడు.

లాస్య లాయర్: ఈ నందగోపాల్ కి ఆడవాళ్ళ పిచ్చి ఉంది

లాస్య: నందునే నాకు దగ్గర అయ్యాడు. అతని వీక్ నెస్ తెలిసి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా

మంగమ్మ: లాస్యకి మొగుడంటే ప్రాణం కానీ అయ్యగారిది వంకర బుద్ధి ఎన్నో సార్లు నా కొంగు కూడా లాగాడు. ఏంటి ఇదని అడిగితే లాస్యని కొట్టారు ఎన్నో దెబ్బలు భరించింది

Also Read: ఆదర్శ్ రాకపోతే తనే కోడలికి రెండో పెళ్లి చేస్తానన్న భవానీ- తండ్రి నిర్ణయంతో షాక్లో ముకుంద

నందుకి సపోర్ట్ గా సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి అడిగితే గడువు కావాలని మాధవ్ కోరతాడు. మూడు రోజుల గడువు ఇస్తానని రుజువు చేయలేకపోతే శిక్ష పడుతుందని జడ్జి చెప్పేస్తాడు. విక్రమ్, దివ్య కలిసి అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. అగ్నిసాక్షిగా మన మధ్య యుద్దం మొదలైనట్టే అత్తయ్య అని దివ్య మనసులో అనుకుంటుంది. ఈరోజు నుంచి నీకు నరకం చూపిస్తానని రాజ్యలక్ష్మి అనుకుంటుంది.

తులసి మంగమ్మ దగ్గరకి వచ్చి ఇలాగేనా కొంగు పట్టుకుని లాగిందని అరుస్తుంది. పాతికేళ్లు కాపురం చేశావు నీకు తెలియదా అని లాస్య నీచంగా మాట్లాడుతుంది. గొడవ మొదలుపెట్టింది మీ అబ్బాయి నేను కంటిన్యూ చేస్తున్నానని లాస్య అంటుంది. తులసి, లాస్య మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. నందు వచ్చేసరికి మళ్ళీ లాస్యతో గొడవకు దిగుతాడు. టాపు చేశానని తెలుసుకుని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనని వదిలేశాను. నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తుంటే ఏ నమ్మకంతో భార్య స్థానం ఇవ్వమంటావని నందు అడుగుతాడు. ఇవ్వకపోతే నష్టపోయేది నీ కుటుంబమేనని లాస్య బెదిరిస్తుంది. పంతులు పూజ పూర్తయిన తర్వాత అన్నీ సర్దుకుంటుంటే దివ్య వస్తుంది. మీరు దొంగపంతులని నాకు తెలుసని దివ్య అంటుంది.

దివ్య: ఆచారాలు, సాంప్రదాయాలు అని చెప్పి మా అత్త చెప్పినట్టు పూజలు చేస్తూ నటిస్తున్నారా దొంగపంతులు

పంతులు: మీరు నన్ను అనుమానిస్తున్నారని పెద్దమ్మగారికి చెప్తాను

దివ్య: పంతులు మొదటి భార్యకి తెలియకుండా రెండో భార్యకి నగలు ఇచ్చిన వీడియో చూపించి బెదిరిస్తుంది. దొంతి కాళ్ళ బేరానికి వస్తాడు. పంతులు రాజ్యలక్ష్మి గురించి చెప్పిన మాటలు కూడ రికార్డు చేస్తుంది. అబద్ధాలు ఆడు అయితే నేను చెప్పినట్టు ఆడాలి. లేదంటే వీడియో మొదటి భార్యకి, ఆడియో అత్తయ్యకి పంపిస్తా

Also Read: పెళ్ళాన్ని చూసి ఫ్లాట్ అయిపోయిన రాజ్- కావ్య మన పెళ్లి జరగనివ్వదని స్వప్నని నమ్మించిన రాహుల్

నందుని కేసు నుంచి బయటపడేసేందుకు తులసి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. దొంగ సాక్ష్యం పుట్టించి అయినా సరే నందుని విడిపించమని అనసూయ సలహా ఇస్తుంటే వద్దని అంటాడు.  

Published at : 17 May 2023 10:12 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial May 17th Update

సంబంధిత కథనాలు

Karate kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?