Krishna Mukunda Murari May 17th: ఆదర్శ్ రాకపోతే తనే కోడలికి రెండో పెళ్లి చేస్తానన్న భవానీ- తండ్రి నిర్ణయంతో షాక్లో ముకుంద
మురారీ మీద కృష్ణకి ప్రేమ పుట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పొద్దుటి నుంచి మురారీ డల్ గా ఉన్నాడని కృష్ణ తనకి దిష్టి తీస్తుంది. అది చూసి రేవతి, భవానీ వాళ్ళు నవ్వుకుంటారు. ముకుంద మాత్రం బాధగా మొహం పెడుతుంది. దిష్టి తీయడంలో కూడా తింగరితనమేనని భవానీ అంటుంది. ముకుంద వాళ్ళ నాన్న ఇంటికి తన తమ్ముడు వస్తాడు. కూతురి పెళ్లి అని అందరూ తప్పకుండా రావాలని పిలుస్తాడు. తమ్ముడి భార్య నోటికొచ్చినట్టు దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంది. భర్త లేకపోయినా ముకుంద సుఖంగానే ఉందని సూటిపోటి మాటలు అంటుంది. మీకు ఈ జీవితమలో మనవడిని ఎత్తుకునే యోగం లేదని, మళ్ళీ పెళ్లి చేయాలంటే మీకు డబ్బులు అయిపోతాయని అనుకుంటున్నారా నాలుగు చీవాట్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. భవానీ ఆశ్రమానికి బయల్దేరుతుంటే అందరూ బాధగా ఉంటారు.
Also Read: పెళ్ళాన్ని చూసి ఫ్లాట్ అయిపోయిన రాజ్- కావ్య మన పెళ్లి జరగనివ్వదని స్వప్నని నమ్మించిన రాహుల్
నందు పెళ్లి విషయంలో నీ వల్ల నేను బాధపడ్డాను కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు బాధపడ్డావు. నీ భార్య కూడా చాలా కష్టపడింది. ఏయ్ తింగరి పిల్ల మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని కృష్ణకి చెప్తుంది. ముకుంద ఈ ఇంట్లో నీ గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది అందరితో కలిసి గడిపితే బాధ ఉండదని అంటుంది. అప్పుడే ముకుంద నాన్న ఎంట్రీ ఇచ్చి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలని నిలదీస్తాడు. నిన్ను శాశ్వతంగా మన ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చానని ముకుంద తండ్రి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. భర్త లేకపోయిన రాకపోయినా అత్తారింట్లో గౌరవంగానే ఉంది కదా అని భవానీ అడుగుతుంది.
ముకుంద తండ్రి: తనని ఇంకా ఇక్కడే ఉంచితే దాని జీవితం ఎటూ కాకుండా పోతుంది. కోర్టులో పిటిషన్ వేస్తాను ఆదర్శ్ లేడు కాబట్టి త్వరగానే విడాకులు వస్తాయి. తీసుకెళ్ళి ఇంకొక పెళ్లి జరిపిస్తాను. అందరికీ అందరూ ఉన్నారు నా కూతురికి తోడు నీడ ఉండాలి కదా. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. నా ఆస్తి మొత్తం ఇచ్చి అయినా సరే దీనికి రెండో పెళ్లి చేస్తాను
భవానీ: కన్యాదానం చేసినప్పుడే మీ కూతురి మీద హక్కులు మాకు ఇచ్చేశారు. దురదృష్టం కొద్ది ఆదర్శ్ రాకపోతే, బతికిలేకపోతే మేమే మా కోడలికి రెండో పెళ్లి చేస్తాం
శ్రీనివాసరావు: కన్నతండ్రిగా నేను పడే ఆవేదన అర్థం చేసుకోండి. నా కూతురి జీవితంలో మనశ్శాంతి లేదు ఇంకొక ఆడపిల్ల అయితే నెలరోజులు చూసి తర్వాత మీకు దణ్ణం పెట్టి వెళ్లిపోయేది
భవానీ: మా అబ్బాయి తిరిగొచ్చి నా భార్య ఏది అని అడిగితే
శ్రీనివాసరావు: మురారీ మౌనంగా ఉండేసరికి నువ్వేమి మాట్లాడవు ఏంటని అడుగుతాడు.
Also Read: అభిమన్యుకి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చిన మాళవిక- ఒక్కటైన అన్నాచెల్లెలు
భవానీ: ముకుంద ఒంటరిగా ఉంటుంది నిజమే కానీ జీవితాంతం తను ఒంటరిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు
శ్రీనివాసరావు: అయితే నా కూతుర్ని కట్టుబట్టలతో నాతో పంపించండి నేను తీసుకుని వెళ్లిపోతాను. న్యాయస్థానంలో ఆదర్శ్ తో పెళ్లి చెల్లదని విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేస్తాను
భవానీ: ఇంటి పెద్ద కోడలిని పంపించడానికి మేము సిద్ధంగా లేము. నాకు కొంత గడువు కావాలి. ముఖ్యమైన పని మీద బయటకి వెళ్తున్నా అది పూర్తవగానే వస్తాను. అప్పుడు ముకుంద మనసులో ఏముందో కనుక్కుని నిర్ణయం తీసుకుంటాను. అప్పటి వరకు మీరు ఈ విషయం పక్కన పెట్టండి