Gruhalakshmi May 16th: రాజ్యలక్ష్మికి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన దివ్య- కోర్టులో ఆవేశపడిన నందు దోషిగా తేలుతాడా?
రాజ్యలక్ష్మి నిజస్వరూపం దివ్యకి తెలిసిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కోర్టుకి తను, విక్రమ్ కూడా వస్తున్నట్టు దివ్య తులసికి ఫోన్ చేసి చెప్తుంది. అత్తకి చెప్పకుండానే వస్తున్నామని అంటుంది. కేసు వాదనల టైమ్ లో ఎలాంటి నిజాలు బయట పడతాయో ఏమో దివ్య అక్కడ ఉంటే కష్టం. రాజ్యలక్ష్మి గురించి తెలిస్తే విక్రమ్ కి దివ్యకి గొడవ జరగవచ్చు. నేను కోర్టుకి వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేయాలని తులసి అనుకుంటుంది. నందు కోర్టుకి బయల్దేరుతుంటే తను కూడా వస్తున్నాయత్తు తులసి చెప్తుంది. రాను అన్నావ్ కదా వస్తే నాకే నష్టమని చెప్పావ్ కదా అంటే రావాలనిపించిందని చెప్తుంది. బసవయ్య రాజ్యలక్ష్మికి ఎక్కించే పనిలో ఉంటాడు. నీ మాట కాదని విక్రమ్ పెళ్ళాంతో కోర్టుకి చెక్కేస్తే ఎలా అంటాడు. దివ్య ఏదైనా చేసి తీసుకెళ్లగలుగుతుందని బసవయ్య చెప్తాడు.
Also Read: కీలక మలుపు, ఆదర్శ్ తో ముకుంద విడాకులు- ఉంగరం విసిరికొట్టిన మురారీ
దివ్య, విక్రమ్ కోర్టుకి బయల్దేరే టైమ్ కి ఇంట్లో పూజ పెట్టుకుని బయటకి వెళ్ళడం ఏంటని రాజ్యలక్ష్మి అంటుంది. అప్పుడే పూజారి వచ్చి అదేంటి మర్చిపోయావా ప్రతి శుక్రవారం అమ్మ పేరు మీద కుంకుమార్చన చేస్తావ్ కదా లేదంటే అమ్మకి ఆయుష్హు క్షీణమని చెప్తాడు. సాయంత్రం పూజ చేస్తానని విక్రమ్ అంటాడు. అర్జెంట్ పనులు ఉన్నాయని అంటున్నారు కదా పూజ ఇంకోసారి చేయొచ్చులఎ మీరు వెళ్లందని నటిస్తుంది. అలా ఎలా చేస్తాను మా అమ్మ తర్వాత ఏదైనా అని విక్రమ్ అని చెప్తాడు. భార్యాభర్తలు కలిసి పూజ చేయాలని విక్రమ్ అంటే మనం బయటకి వెళ్ళడం కంటే అమ్మవారికి కుంకుమార్చన చేయడం ముఖ్యమని దివ్య కోర్టుకి వెళ్ళకుండా ఆగిపోతుంది. అత్తయ్య ఆట మొదలైంది మీకు ఓటమి రుచి చూపిస్తానని దివ్య మనసులో అనుకుంటుంది.
ఇక కోర్టులో వాదనలు మొదలవుతాయి. దివ్య, నందు చెరొక బోనులో ఉంటారు. లాస్యని వదిలించుకోవాలని తన మీద చెయ్యి చేసుకోవడమే కాకుండా మెడ పట్టుకుని బయటకి గెంటేశాడని లాస్య తరఫు న్యాయవాది వాదిస్తాడు. అంతా అబద్ధమని నందు ఆవేశంగా అరుస్తాడు. నా భర్త నా మీద దౌర్జన్యం చేయడం నిజమే కానీ అందరి ముందు మా లాయర్ ఆయన్ని రౌడీ అనడం బాధగా అనిపిస్తుంది. మళ్ళీ మేము కలిసి ఉండాలి దయచేసి అలాంటి పదాలు వాడొద్దని లాస్య అమాయకురాలిగా నటిస్తుంది. ముద్దాయి నేరం చేసినట్టు రుజువైతే జైలు శిక్ష తప్పదని జడ్జి చెప్తాడు. ముద్దాయి ప్రవర్తనని బట్టి అర్థం అవుతుంది అతన్ని దోషిగా ప్రకటించి శిక్ష వేయమని లాస్య తరఫు న్యాయవాది కోరతాడు. నిజానికి గృహహింస భరించింది నా క్లయింట్, తన ఆగడాలు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు తప్ప చెయ్యి చేసుకోలేదని, నందు మర్యాదస్తుడని మాధవ్ వాదిస్తాడు. అలా అయితే మొదటి భార్య ఎందుకు వదిలేశాడని అడుగుతాడు.
తులసి: నందగోపాల్ మొదటి భార్యని. ఆయనకి విడాకులు ఇచ్చాను కానీ ఆయనెప్పుడు నా మీద దౌర్జన్యం చేయలేదు. మా అభిప్రాయాలు కలవక మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నాం
Also Read: కావ్య తరఫున అపర్ణని ఎదిరించిన ధాన్యలక్ష్మి- కనకానికి మస్కా కొట్టి స్వప్న జంప్
లాస్య లాయర్: మీరు నిజాలు దాచి ముద్దాయిని సేవ్ చేస్తున్నారు
తులసి: నన్ను అడ్డం పెట్టుకుని బురద చల్లడం ఎందుకని వచ్చాను
లాయర్: విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఎందుకు ఆయనతో కలిసి ఉంటున్నారు
తులసి: దానికి సమాధానం మీ క్లయింట్ కి తెలుసు. ఆ ఇల్లు నాది అత్త, మామతో కలిసి ఉంటున్నాం. భర్తతో కలిసి మీ క్లయింట్ నా ఇంట్లో ఉంటున్నారు. ఆయన లాస్యని కొట్టలేదు
లాయర్: విడాకులు తీసుకున్న తర్వాత కూడ మీ ఇద్దరి మధ్య ఏదో అనుబంధం ఉందని మా క్లయింట్ ఆరోపణ
తులసి: అబద్ధం.. నాకు సంబంధించిన గొడవ అయితే నాకు తెలుస్తుంది కదా