Krishna Mukunda Murari May 16th: కీలక మలుపు, ఆదర్శ్ తో ముకుంద విడాకులు- ఉంగరం విసిరికొట్టిన మురారీ
కృష్ణ, మురారీని ప్రేమిస్తుండటంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
భవానీ వాళ్ళందరూ రెస్టారెంట్ కి వస్తారు. కావాలని మురారీ పక్కన ముకుంద కూడా కూర్చుంటుంది. ఉంగరం తీసేందుకు మురారీ ట్రై చేస్తుంటే ముకుంద వచ్చి ఏంటి రింగ్ తీసేస్తున్నావ్ అంటే మన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తున్నవా అంటుంది. ఇది అన్యాయమని మురారీ అంటాడు. ఎవరు ఎవరికి అన్యాయం చేస్తున్నారు, నీ నుంచి న్యాయం కోరుకుంటూ నేను దైవ సాక్షిగా ఉంగరం తొడిగాను. నీతో అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న కృష్ణని ఆపు అప్పుడు తప్పుకుంటాను. ఈ కట్టుబాట్లు ఎందుకు పనికిరావు. ఈ ఉంగరం నీవేలికి ఎప్పుడు ఉండాలి. ఆదర్శ్ ఉండి ఉంటే నా ప్రేమ సమాధి చేసుకునేదాన్ని లేదంటే కృష్ణతో నువ్వు బాగుంటే నీవైపు చూసేదాన్ని కాదు. కానీ అది జరగడం లేదు ఈ ఉంగరం తొడిగిన దగ్గర నుంచి నేను మానసికంగా నీ దాన్ని అయిపోయానని ముకుంద చెప్తుంది.
Also Read: కావ్య తరఫున అపర్ణని ఎదిరించిన ధాన్యలక్ష్మి- కనకానికి మస్కా కొట్టి స్వప్న జంప్
ఉంగరం గురించి అందరికీ డౌట్ వస్తుంది ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదని మురారీ మనసులో అనుకుంటాడు. భవానీ ఫుడ్ అందరికీ వడ్డిస్తుంటే మురారీ చాలు అని చెయ్యి బయట పెట్టేస్తాడు. ఉంగరాన్ని అందరూ చూసేస్తారు. రింగ్ ఎక్కడిదని రేవతి అడుగుతుంది. గుడికి వచ్చేటప్పుడు లేదు కదా ఇంతలోనే ఎలా వచ్చిందని కృష్ణ అంటుంది. కమిషనర్ గుడికి వచ్చారు కదా ఆయన గిఫ్ట్ గా ఇచ్చారని మురారీ అబద్ధం చెప్తాడు. రేవతి మాత్రం ముకుంద వైపు చూస్తూ అనుమానపడుతుంది. మురారీ డల్ గా ఉండటం చూసి ఏమైంది అంత డల్ గా ఉన్నారని కృష్ణ అడుగుతుంది. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటని ఆలోచిస్తున్నానని కవర్ చేస్తాడు. మురారీ ఒక్కడే ఉన్నప్పుడు కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. తను రాత్రంతా ఎంతో కష్టపడి మురారీ కోసం పర్స్ తయారు చేసి ఇస్తుంది. అందులో లెటర్ కూడా ఉంటుంది.
Also Read: వేద పిచ్చిలో మునిగితేలుతున్న యష్- పెళ్లికి వచ్చిన ఆదిత్య, ఏం జరగబోతోంది!
ఇందులో ఐలవ్యూ అని రాసి ఉంటుందా? ఒక వేళ కాకపోతే అని భయపడుతూనే ఓపెన్ చేస్తాడు. అందులో ఏసీపీ సర్ ఎప్పటికీ మీరు నా దేవుడు అని రాసి ఉంటుంది. అంటే నా మీద భక్తిభావం తప్ప ప్రేమ లేదని బాధపడతాడు. మళ్ళీ వెళ్ళి ఊనగరం తీసేందుకు ట్రై చేస్తాడు. సక్సెస్ ఫుల్ గా దాన్ని తీసేసి పక్కన విసిరికొడతాడు. కృష్ణ స్వీట్ చేసి తీసుకొస్తుంది. మురారీ డల్ గా రావడం చూసి థాంక్స్ చెప్తారని అనుకుంటే ఇలా డల్ గా వస్తున్నారు ఏంటని అనుకుంటుంది. మెట్ల మీద నుంచి మురారీ జారిపడబోతుంటే కృష్ణ పట్టుకుంటుంది. అది చూసి ముకుంద బాధపడుతుంది. ఉంగరం తీసేసి ప్రశాంతంగా ఉండాడు. నేను కృష్ణకి దగ్గర అయితే నువ్వు దూరం అవుతావు పై నుంచి దూకుతానని బెదిరిస్తావు ఏమో నేను బెదిరిపోనని ఉంగరం లేదనే విషయాన్ని కావాలని చూపిస్తూ ఉంటాడు. భవానీ ఆశ్రమానికి వెళ్తున్నట్టు చెప్తుంది. ముకుంద బాధగా గదిలోకి వెళ్తూ ఏడుస్తుంది. మురారీ ఇంతకు తెగిస్తాడా? తనకి ఆ ఉంగరం ఉంచుకోవడం ఇష్టం లేదా? నేను ఇంకో దారిలో వస్తాను అప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తానని అనుకుంటుంది.