అన్వేషించండి

Gruhalakshmi March 30th: లాస్యతో చేతులు కలిపిన రాజ్యలక్ష్మి- సంజయ్ తిక్క కుదిర్చిన విక్రమ్

Gruhalakshmi March 30th: సంజయ్ పెళ్లి ప్రియతో చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ప్రియ ఇంట్లో ఉండటం చూసి తను ఇక్కడ ఉంది ఏంటని విక్రమ్ అడుగుతాడు. తను ఇప్పుడు హాస్పిటల్ లో నర్స్ కాదు నీకు మరదలు తన హోదా మారిపోయిందని విక్రమ్ తాతయ్య చెప్తాడు. అదేంటి నేను ఊర్లో లేని రెండు రోజుల్లో ఏం జరిగిందని అడుగుతాడు. చడీచప్పుడు లేకుండా ఈ పెళ్లి ఏంటని అంటాడు. ప్రియ విషయంలో తొందరపడ్డాను తను తల్లి కాబోతుంది. విషయం తెలిసి గొడవ కాబోతుంటే తన మెడలో తాళి కట్టానని సంజయ్ చెప్తాడు. తమ్ముడు చేసిన తప్పుని కూడా మంచి మనసుతో క్షమించావని విక్రమ్ తల్లిని మెచ్చుకుంటాడు. బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ వెనకేసుకుని రాకూడదు కదా అని అంటుంది. మరి అమ్మవారికి అభిషేకం చేస్తుందేంటని అంటే కోడలికి దోషం ఉందని పంతులు చెప్పాడని బసవయ్య చెప్తాడు. భార్యాభర్తల్లో ఎవరికి దోషం ఉన్నా అది ఇద్దరికీ వర్తిస్తుందట పరిహారం కూడా ఇద్దరూ కలిసే చేయాలంట, ప్రియ అభిషేకం చేస్తుంటే సంజయ్ చూస్తూ ఉంటే ఎలా తనతో పాటు అవుట్ హౌస్ లో ఉండాలి పూజ చేయాలని విక్రమ్ చెప్పేస్తాడు.

Also Read: కావ్యకి సారీ చెప్పిన రాజ్- బయటపడిన అపర్ణ దాష్టీకం, కన్ఫ్యూజన్ లో రుద్రాణి

కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అమ్మవారు చూస్తూ ఎందుకు ఉంటుందని దేవుడు మనసులోనే సంతోషపడతాడు. ఏ కష్టం వచ్చినా తనకి చెప్పమని విక్రమ్ ప్రియకి భరోసా ఇస్తాడు. వీడు ఏంటి ఇలా కాళ్ళకి అడ్డం పడుతున్నాడని రాజ్యలక్ష్మి తిట్టుకుంటుంది. అన్నయ్య చెప్పినట్టు చెయ్యమని తల్లి కూడా వెళ్లిపోవడంతో సంజయ్ ఇరుక్కుపోతాడు. దివ్య తులసితో మాట్లాడుతూ ఉండగా లాస్య వచ్చి బొకే వచ్చిందని చెప్పి తీసుకొస్తుంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు కానీ బొకేలు పంపిస్తున్నాడా అని దివ్య ఆ బొకే తీసుకోబోతుంది. కానీ లాస్య ఆ బొకే తీసుకొచ్చి కావాలని తులసి ఒళ్ళో పెట్టేస్తుంది. బొకేలో పేరు ఏమి లేదని ఫ్రెండ్ అనే ఉందని తులసి అనేసరికి దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. అది చూసి లాస్య విక్రమ్ ప్రేమలో నువ్వు కూరుకుపోవాలని మనసులో అనుకుంటుంది. లాస్య బిజినెస్ లో పెట్టిన అమౌంట్ పోయిందని తన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తుంది. నందుకి తెలిస్తే పీక పిసికేస్తాడు, విషయం బయట పెట్టకముందే డబ్బులు ఎలాగైనా తీసుకురావాలని అనుకుంటుంది.

అమ్మ మొహంలో దిగులు కనిపిస్తుంది ఎందుకని విక్రమ్ దేవుడిని అడుగుతాడు. ఈ ఇంట్లో పరిస్థితి బాగోలేదని దేవుడు మనసులో బాధపడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు అడ్డం పడినా దివ్యమ్మని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు. అమ్మ ప్రేమ దివ్య ప్రేమని దూరం చేస్తుందేమోనని భయపడతాడు. డైమండ్ రింగ్ చూపించి ఇది ఇచ్చి దివ్య వేలుకి పెట్టి ప్రపోజ్ చేస్తానని అంటాడు. దివ్య ప్రేమ, అమ్మ ప్రేమ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారని దేవుడు చాలా బాధగా అడుగుతాడు. విక్రమ్ మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకు అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని విక్రమ్ చెప్తాడు. అమ్మగారికి దివ్య అంటే పీకల దాకా కోపం, మీకు ప్రేమ ఏది గెలుస్తుందోనని టెన్షన్ గా ఉందని బాధపడతాడు. దివ్య విక్రమ్ మెసేజ్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండటం లాస్య గమనిస్తూనే ఉంటుంది.

Also Read: ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దామన్న యష్- విన్నీ కుట్రతో మళ్ళీ మొదటికొచ్చిన వేద జీవితం

ఫోన్ టేబుల్ మీద పెడితే విక్రమ్ మెసేజ్ చేస్తే అమ్మ చూస్తుందని చెప్పి డ్రెస్ లో ఫోన్ దాచేస్తుంది. విక్రమ్ మెసేజ్ చూసి కాల్ చేస్తాడు. ఫోన్ సైలెంట్ లో ఉండేసరికి గుయ్ మని సౌండ్ వస్తుంటే దివ్య నవ్వుతో కవర్ చేస్తుంది. కాసేపటికి పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి నడుము, గోల, అనుమానం అని ఏదేదో మాట్లాడుతుంది. మీరు మెసేజ్ చేస్తే మొబైల్ వైబ్రేషన్ లో పెట్టి నడుము దగ్గర దోపుకున్నానని చెప్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. రెస్టారెంట్ లో కలుసుకుందామని చెప్తాడు. దివ్య సంతోషంగా గింగిరాలు తిరుగుతుంటే లాస్య చూసేస్తుంది. అప్పుడే రాజ్యలక్ష్మి లాస్యకి ఫోన్ చేస్తుంది. ఇంటికి వచ్చి కలవమని చెప్తుంది. లాభం ఉన్న పనేనని చెప్పేసరికి లాస్య వస్తానని అంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Warangal BRS leaders: వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
వరంగల్‌ సభ నుంచి రేవంత్ కౌంట్‌డౌన్ స్టార్ట్- బీఆర్‌ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Embed widget