Gruhalakshmi March 24th: ప్రియని మోసం చేసిన సంజయ్- రాజ్యలక్ష్మి నెత్తిన మరో పిడుగు వేయనున్న దివ్య
దివ్య, విక్రమ్ ప్రేమ పట్టాలెక్కడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసిని చూసుకుంటూ నందు రాత్రంతా తన గదిలోనే ఉండిపోతాడు. లేచి వంటింట్లో పనులు చూసుకోవాలని తులసి అంటే రాములమ్మ ఇంట్లో వాళ్ళు ఉన్నారులే అని నందు సర్ది చెప్తాడు. రాత్రంతా కాపలా ఉండటం ఎందుకని అంటుంది. లేచి ఫ్రెష్ అవు కాఫీ చేసుకుని తీసుకొస్తానని చెప్తాడు. దివ్య నిద్రలేవగానే విక్రమ్ మాటలు తలుచుకుని మురిసిపోతుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా మనసు నీ దగ్గరకి పారిపోయి వచ్చేస్తుంది. మనసు లేకుండా నేను ఉండలేను కానీ నువ్వు లేకుండా నా మనసు ఉండలేకపోతుంది. మొత్తం మీద ఏదో మత్తు చల్లావ్ బాగుందని విక్రమ్ కి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతుంది.
Also Read: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
అనసూయ సంతోషంగా ఉంటుంది. ఎందుకు సంతోషమని తులసి బాధగా అంటుంది. కంటికి కనిపించేది చేతికి కనిపించదు అని వేదాంతం చెప్పి అనసూయ సంతోషాన్ని క్షణాల్లో పోగొట్టేస్తుంది. వాసుదేవ్ దంపతులు వచ్చి ఎలా ఉన్నావని అడుగుతారు. ఆఫీస్ ఫైల్స్ చూడాలని తులసి అంటే నందు రాత్రంతా కూర్చుని క్లియర్ చేశాడని చెప్తుంది. తులసి వాటిని చూసి అవును అన్ని చూశారు సైన్ చేయడమే మిగిలి ఉందని అంటుంది. నీకు ట్యాబ్లెట్స్ వేస్తూ రాత్రంతా నిన్ను చూసుకున్నాడు. నీకోసం కాఫీ కూడా కలుపుతున్నాడని దేవ్ భార్య అంటుంది. ఆడపని, మొగపని అనే నందు మారితే చూడాలని అనుకున్నా ఆ కోరిక తీరిపోయింది తృప్తిగా వెళ్లిపోతామని దేవ్ అంటాడు.
దివ్య దగ్గర నుంచి మెసేజ్ వచ్చేసరికి విక్రమ్ ఎగిరిగంతులేస్తాడు. దేవుడిని పట్టుకుని గిరాగిరా తిప్పేస్తాడు. ఆంజనేయ దండకం చదువుతుంటే అది దివ్య దండకంలాగా ఉందని అంటాడు. రాజ్యలక్ష్మి విక్రమ్ ని విజయవాడ వెళ్ళమని చెప్తుంది. అది విని విక్రమ్ మొహం మాడిపోతుంది. రెండు రోజులు దివ్యని చూడకుండా ఉండటం అంటే తన వల్ల కాదని విక్రమ్ బాధపడతాడు. దివ్య మెసేజ్, ఫోన్స్ కి రిప్లై ఇవ్వొద్దని దేవుడి సలహా ఇస్తాడు. అలా చేస్తే ప్రేమ పెరుగుతుందని ఎడబాటు తట్టుకోలేక గట్టిగా కౌగలించుకుంటుందని అంటాడు. అయితే సర్ ఎల్లుండి దివ్య పుట్టినరోజు తనకి ఎదురుపడి సర్ ప్రైజ్ చేస్తానని అనుకుంటాడు. అప్పుడే దివ్య విక్రమ్ కి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయకుండా దేవుడు ఆపేస్తాడు. నందు తులసికి కాఫీ తీసుకుని వస్తాడు. తనని అలాగే చూస్తూ థాంక్స్ చెప్తుంది.
Also Read: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం
పాతికేళ్ళ కాపురంలో నీకోసం ఏమి చేయలేదు కానీ ఎప్పుడు నేను నీకు థాంక్స్ చెప్పలేదని అంటాడు. చెప్పాల్సిన అవసరం లేదని అప్పుడు మన మధ్య బంధం ఉందని అంటుంది. అప్పుడే మేనేజర్ ఫైల్స్ కోసం వస్తాడు. దివ్య కోసం ప్రియ ఇంటికి వస్తుంది. సంజయ్ తో పెళ్లి జరిపించమని, తన చేతిలో మోసపోయానని చెప్తుంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి దగ్గరయ్యాడు. ఇప్పుడు నాకు రెండో నెల. పెళ్లి విషయం ఇప్పటివరకు వాళ్ళ అమ్మదగ్గర మాట్లాడలేదు అనుమానం వచ్చి నిలదీస్తే చేసుకోను కావాలంటే అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడని బాధగా చెప్తుంది. నిన్ను మోసం చేయాలని అనుకున్నాడు కాబట్టే ప్లాన్ చేసి ట్రాప్ చేశాడని దివ్య అంటుంది. మోసం చేసే అవకాశం ఇవ్వడం నీ తప్పు, అంత పెద్ద హాస్పిటల్ ఓనర్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావని కాస్త గడ్డి పెడుతుంది. తన తరఫున నిలబడి న్యాయం చేయమని ప్రియ దివ్యని బతిమలాడుతుంది. తన వంతు సాయం చేస్తానని దివ్య అంటుంది.