News
News
వీడియోలు ఆటలు
X

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

విక్రమ్, దివ్య లవ్ పట్టాలేక్కడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

తులసి మీద నీ మనసులో ఏదో ఉందని లాస్య నందుకి క్లాస్ పీకుతుంది. దేవ్ బిజినెస్ డీల్ కోసం నటించమని చెప్పింది నువ్వే ఈ ప్రాసెస్ లో అటువంటివి ఎన్నో జరుగుతాయని చెప్తాడు. సరే అర్జెంట్ గా కేఫ్ కి రమ్మని లాస్య పిలుస్తుంది కానీ నందు మాత్రం తులసి ఫీవర్ తో ఉంది రాలేనని అంటాడు. ఈ సెంటి మెంట్ ఏంటని అంటే ఇది మానవత్వమని ఈ నాటకం ఇష్టం లేకపోతే దేవ్ ముందు రివీల్ చెయ్యి నాకు కాస్త రిలీఫ్ గా ఉంటుందని అంటాడు. దీంతో లాస్య సరేనని కోపంగా పెట్టేస్తాడు. ఇక నందు మళ్ళీ తులసి సేవలో నిమగ్నమైపోతాడు. విక్రమ్ హాస్పిటల్ కి క్యారేజ్ పట్టుకుని వస్తాడు. దివ్య ఎక్కడ చూస్తుందోనని మొహానికి ఖర్చిఫ్ కట్టుకుంటాడు. ఇప్పుడు తనని ఎవరు గుర్తు పట్టరని చేతులు ఊపుకుంటూ వెళ్తుంటే నర్స్ గుర్తు పట్టేస్తుంది.

Also Read: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం

దివ్యని అపాయింట్ చేసుకుని తప్పు చేశావని సంజయ్ అరుస్తుంటే రాజ్యలక్ష్మి రివర్స్ లో తిడుతుంది. అప్పుడే విక్రమ్ వస్తాడు. సంజయ్ కోపంగా ఉండటం చూసి ఏమైందని విక్రమ్ అడుగుతాడు. అమ్మని బెదిరించి ఒక డాక్టర్ పది లక్షలు కట్టించిందని సంజయ్ చెప్పేసరికి విక్రమ్ ఆవేశపడతాడు. ఈ హాస్పిటల్ లో అమ్మని బెదిరించిన డాక్టర్ ఎవరని అడుగుతాడు కానీ రాజ్యలక్ష్మి సర్ది చెప్పి పంపించేస్తుంది. దివ్య మీద పీకల దాకా కోపం ఉంది కానీ దాని హస్తవాసి మంచిది అది బంగారు బాతు జాగ్రత్తగా కాపాడుకోవాలని రాజ్యలక్ష్మి సంజయ్ కి కూడా నచ్చ చెప్తుంది. మగాడిగా బతికే నందు సడెన్ గా మొగుడిగా మారిపోయి అంత బుద్ధిమంతుడులాగా మారాడు, ఆ మాజీ మొగుడుపెళ్ళాల మధ్య పుల్ల పెడితే కానీ మనశ్శాంతి ఉండదని లాస్య అనుకుంటుంది. అప్పుడే భాగ్య ఫోన్ చేస్తుంది.

విక్రమ్ గురించి ఆరాలు తీస్తుంది. చదువు లేదు కానీ ఆస్తి మాత్రం చాలా ఉంటుందని. అతను వారసుడు కానీ వారసుడని చెప్తుంది. అతనింటికి అతనే పెద్ద పాలేరు. సవతి తల్లి ఉంది. అలాంటి దురదృష్టవంతుడితో దివ్యకి ఫ్రెండ్షిప్ ఏంటోనని అంటుంది. ఆ ఇంటి మీద ఇంటి మనషుల మీద కన్నెసి ఉంచమని లాస్య చెప్తుంది. హాస్పిటల్ బయట విక్రమ్ దివ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. దివ్యని బైక్ మీద ఒంటరిగా దింపితే బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చని అనుకుంటాడు. అప్పుడే దివ్య బయటకి వస్తుంది. రోడ్డు మీద దివ్య నడుచుకుంటూ వెళ్తుంటే వెనుకాలే విక్రమ్ బైక్ మీద వస్తాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటు ఉండగా కొంతమంది పోకిరీలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తారు. అందులో ఒకడు దివ్య చెయ్యి పట్టుకునేసరికి విక్రమ్ కి కోపం వస్తుంది. అమ్మాయికి సోరి చెప్పి వెళ్లిపొమ్మని అంటాడు. కానీ వాళ్ళు విక్రమ్ ని తోసేస్తారు దీంతో వాళ్ళతో ఫైటింగ్ కి దిగుతాడు.

Also Read: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే

విక్రమ్ మాటలు విని దివ్య తెగ మురిసిపోతుంది. విక్రమ్ దెబ్బకి వాళ్ళు పారిపోతారు. నిన్న మొన్న పరిచయమైన నాకోసం అప్పుడే తెగించాలా అని దివ్య అడుగుతుంది. పరిచయంతో పని లేదని అనేసరికి దివ్య ఇంప్రెస్ అయిపోయి రియల్ హీరో అనిపించారని మెచ్చుకుంటుంది. ఐయామ్ ఇంప్రెస్డ్ అంటుంది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని దివ్య అడిగేసరికి విక్రమ్ గాల్లో తెలిపోతాడు. నందులో వచ్చిన మార్పు నమ్మలేకపోతున్నామని దేవ్ వాళ్ళు అనుకుంటారు. అప్పుడే లాస్య వచ్చి తులసికి సేవలు చేయడం చూసి రగిలిపోతుంది. కోడలికి బాగోకపోతే అత్తమామలు పట్టించుకోవడం లేదేంటని దేవ్ భార్య అనుమానపడుతుంది. నందు మారి భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడని మురిసపోతూ ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటున్నారని దేవ్ అంటాడు. వామ్మో ఇంత కుట్ర చేస్తున్నారా అని లాస్య రగిలిపోతుంది.

Published at : 23 Mar 2023 09:54 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial March 23rd Update

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?