Ennenno Janmalabandham March 23rd: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే
యష్, వేద మధ్య అగాధం సృష్టించడానికి విన్నీ రంగంలోకి దిగటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద నిలువుదోపిడి ఇచ్చుకున్నా కూడా యష్ తూగడు. దీంతో వేద చాలా బాధపడుతుంది. నిలువుదోపిడి ఇచ్చినా మీ భర్త తూగలేదంటే మీ వివాహ బంధంలోనే ఏదో అపసవ్యం ఉంది, మీ జాతకంలో ఏదో లోపం ఉందని పూజారి అంటాడు. సులోచన దేవుడు ముందుకి వెళ్ళి ఏడుస్తుంది. దాన్ని సుఖపడనివ్వవా, ఎందుకు నాబిడ్డకి ఈ శిక్ష అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక ఈ తులాభారం ఆపేయడమే మీరు ఎంతసేపు త్రాసులో కూర్చున్న శుద్ధ దండగే, తులాభారం విజ్ఞమయినట్టేనని పూజారి అంటాడు. యష్ దిగబోతుంటే వేద ఆపి అమ్మవారి దగ్గరకి వెళ్తుంది. చేతిలో కర్పూరం పెట్టుకుని హారతి ఇస్తుంది. నా భర్తని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నా, నా భర్త నాకు దూరం అవడం అంటే నా ప్రాణాలు వదిలేసినట్టే. పంచభూతాల సాక్షిగా తులాభారంలో గెలిచి తీరాలని వేడుకుంటుంది. అక్కడే ఉన్న పసుపు తాడు తీసుకుని వెళ్తుంది.
Also Read: చూడముచ్చటైన జంట- కనకాన్ని గుర్తుపట్టిన కావ్య, రిసెప్షన్ కి వచ్చిన స్వప్న
వేద మంత్రాల సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా పరమపవిత్రమైన వివాహ లగ్నంలో మీరు నా మెడలో కట్టిన మంగళసూత్రానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ పవిత్రమైన పసుపు తాడుని తన మెడలో కట్టమని వేద భర్తని అడుగుతుంది. యష్ సంతోషంగా మరోసారి వేద మెడలో తాళి కడతాడు. తర్వాత వేద తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి తులాభారంలో పెడుతుంది. తాళి వెయ్యగానే తులాభారం తూగుతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. విన్నీ షాక్ అవుతాడు. యష్ వేదని చూస్తూ ఉండిపోతాడు. అద్భుతం నీ భక్తితో సంకల్పంతో చిత్తశుద్ధితో ఈ విషమ పరిస్థితుల్లో నెగ్గావ్ అమ్మవారి కటాక్షం నీకు లభించింది. ఈరోజు నీ మంగళసూత్రంతో భర్తని తూచావ్. నీ భర్త మీద నీ ప్రేమ రుజువు చేసుకున్నావని పూజారి మెచ్చుకుంటాడు. అందరూ అక్షింతలు వేసి ఆ దంపతుల్ని ఆశీర్వదిస్తారు.
వేద ప్రసాదం పంచిపెడుతూ ఒక పెద్దావిడ దగ్గరకి వస్తుంది. ‘పిడికెడు బెల్లం ప్రసాదం పెట్టి గంపెడు కష్టాలు తీర్చుకుందామని అనుకుంటున్నావా? అని సోదమ్మ అంటుంది. అందరితో మంచిగా ఉంటావ్. నీ మాట పటిక బెల్లం, నీ మనసు వెన్నపూస. కానీ నీకు చెడు చేసే వాళ్ళు నీవెంటే ఉన్నారు. వెన్నుపోటు పొడుస్తారు. పాము పడగనీడ నీమీద పడింది. నాటు పాము ఒకటి నక్కి నక్కి చూస్తుంది. నిన్ను కాటు వేయడానికి మాటు వేసి ఉంది. నీ బిడ్డ నడక పూల బాట కాదు ముళ్ళ బాట. గడ్డుకాలం దాపరించింది. నీది సీతమ్మ తల్లి జాతకం అవమానాలన్నీ నిన్ను చుట్టుముడతాయి. నీ పెనిమిటి నీ పసుపు కుంకుమలు, బిడ్డ జాగ్రత్త’ అని సోదమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ విని సులోచన ఏడుస్తుంది. అమ్మవారి దీవెన తనకి ఉందని అంతా మంచే జరుగుతుందని వేద అంటుంది.
Also Read: వేదని కాపాడి తీసుకొచ్చిన ఖుషి- బరువు తూగని యష్, విన్నీ కోరికే ఫలిస్తుందా?
విన్నీ వేద మెడలో యష్ తాళి కట్టడం తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. వేద, యష్ మధ్య భయంకరమైన గ్యాప్ తీసుకురావాలి. అది విడాకులు దాకా రావాలి. ఇద్దరూ ఒకరికొకరు అసహ్యించుకునే వరకు తీసుకురావాలి. నీకోసం పిచ్చి వాడిని అయిపోతున్నా వేదు.. నా గుండెల నిండా నీమీద ప్రేమ ఉంది అది కనిపించడం లేదా? ఆ యష్ లో పనిగట్టుకుని ప్రేమ వెతుక్కుంటున్నావ్. వదలను నిన్ను యష్ ని విడగొట్టకుండా వెళ్లనని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వేద విన్నీ ఇంటికి వచ్చి తనని పిలుస్తుంది.