Ennenno Janmalabandham March 22nd: వేదని కాపాడి తీసుకొచ్చిన ఖుషి- బరువు తూగని యష్, విన్నీ కోరికే ఫలిస్తుందా?
విన్నీ తన అసలు రంగు బయట పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి మాల కట్టడానికి దారం కోసం వేద ఒక రూమ్ లో వెళ్తుంది. వెనుకే వెళ్ళిన విన్నీ తనని లోపల ఉంచేసి బయట గడిపెట్టేస్తాడు. పూజకి టైమ్ అవుతుందని వేద బయటకి రాబోతుంటే డోర్ రాదు. మళ్ళీ విన్నీ ఏమి తెలియనట్టు పూజ దగ్గరకి వచ్చి నిలబడతాడు. బయట ఎవరైనా ఉన్నారా అని వేద గట్టిగా పిలుస్తూ ఉంటుంది కానీ ఎవరికి వినిపించదు, ఆ గదిలోకి పొగ ఎక్కువగా రావడం వల్ల ఊపిరి ఆడక స్పృహ తప్పి పడిపోతుంది. తులసి మాలకి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని పూజారి గుర్తు చేసేసరికి మాలిని, సులోచన కంగారు పడతారు. చిత్ర వేదని వెతుక్కుంటూ వెళ్తుంది. ఖుషి కూడా వేద కోసం వెళ్తుంది. విన్నీ ఏమి తెలియనట్టు వెతుకుతాడు. యష్ త్రాసులో నుంచి దిగబోతుంటే పూజ పూర్తయ్యే వరకు దిగకూడదని పూజారి చెప్తాడు. అందరూ వేద కోసం కంగారు పడుతూ ఉంటారు.
Also Read: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య
లగ్నం దాటి పోయాక తులాభారం చేసిన వ్యర్థం అయిపోతుంది, ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే టైమ్ ఉంది అమ్మాయి వస్తే సరి లేదంటే పూజ భగ్నం అయినట్టేనని పూజారి చెప్తాడు. జరగదు ఈ తులాభారం జరగదు వేద, యష్ విడిపోతారు నేను విడగొట్టేస్తానని విన్నీ మనసులో సంతోషపడతాడు. సులోచన దేవుడి ముందు కూర్చుని ఏడుస్తూ వేదని కాపాడమని వేడుకుంటుంది. ఖుషి వెతుక్కుంటూ వేద ఉన్న గది దగ్గరకి రాగానే అక్కడ తన కాలి పట్టీ కనిపిస్తుంది. వెంటనే గది తలుపు తెరిచి చూడగా వేద కనిపిస్తుంది. తనని లేపుతుంది. ఖుషిణి చూడగానే వేద ఎమోషనల్ అవుతుంది. పుణ్యకాలం కాస్త గడిచిపోయిందని పూజారి చెప్పేసరికి విన్నీ సంబరపడతాడు. అప్పుడే ఖుషి వేదని తీసుకుని వస్తుంది. అది చూసి విన్నీ షాక్ అవుతాడు. తులసి దళాన్ని పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుని పూజ మొదలుపెట్టమని పూజారి అంటాడు.
Also Read: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి
వేద భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుని తులాభారం మొదలుపెడుతుంది. త్రాసులో మరొక వైపు వేద బెల్లం పెడుతూ ఉంటుంది. ఎంత పెట్టినా కూడా త్రాసు పైకి లేవకపోయేసరికి అందరూ టెన్షన్ పడతారు. పూజకి పెట్టిన బెల్లం మొత్తం పెట్టినా కూడా త్రాసు పైకి లేవకపోయేసరికి వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అల్లుడు బరువుని బట్టి బెల్లం తీసుకొచ్చాము కానీ ఎందుకు తూగలేదు ఏమి మార్గం లేదా అని సులోచన అడుగుతుంది. ఏమి చేయలేము తులాభారం విగ్నం అయ్యింది పూజ వెస్ట్ అయినట్టే అని పూజారి అంటాడు. ఏదో ఒక మార్గం ఉంటుంది చెప్పమని వేద అడుగుతుంది. ఒకే ఒక మార్గం ఉంది నిలువుదోపిడి. ఒంటి మీద ఉన్న బంగారం అంతా దేవుడికి సమర్పించాలని చెప్తాడు. అందుకు వేద సరేనని నిలువుదోపిడి ఇచ్చుకుంటుంది. అయినా కూడా బరువు తూగకపోయేసరికి చాలా బాధపడుతుంది. స్వామివారి అనుగ్రహం లేనట్టు ఉంది. మీ దాంపత్యంలో ఏదో లోపం ఉందని పూజారి అంటాడు.