అన్వేషించండి

Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి

రాజ్, కావ్యకి పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రాజ్ వేసుకున్న కోపం ముసుగు త్వరలోనే తొలగిపోతుందని ఇంద్రాదేవి కావ్యకి ధైర్యం చెప్తుంది. ఈ ఇంట్లో సగం మంది పెళ్లి దగ్గర నుంచి నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారని అంటుంది. ఈ ఇంటి ఆచారం ప్రకారం భర్త మొదటి ముద్ద తినిపించాలి రాజ్ నీకు తినిపించాడు, అలాగే నువ్వు వేసుకోవాల్సిన మొదటి బట్టలతో నగలు ఇవ్వాలి అనుకోకుండా రాజ్ వేశాడు. అసలు ఈ పెళ్లి మీ అమ్మ అబద్ధాలు ఆడటం వల్లో స్వప్న వెళ్ళిపోవడం వలనో నువ్వు ముసుగువేసుకుని కూర్చోవడం వల్లో జరగలేదు దైవలీల అని ఇంద్రాదేవి అంటుంది. ఫంక్షన్ లో భర్త పక్కన నిలబడతానని చెప్తుంది. రేఖ జరిగింది మొత్తం రాహుల్ కి చెప్తుంది. స్వప్న ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుందని రేఖ అంటుంది. రాహుల్ మాత్రం స్వప్నని వెనకేసుకొస్తాడు. ఇంతకంటే రిచ్ పర్సన్ ఎవడో దొరికి ఉంటాడు అందుకే వెళ్ళిపోయి ఉంటుందని అంటుంది.

Also Read: తులాభారం ఆపేందుకు విన్నీ స్కెచ్- వేద తన ప్రేమతో భర్తని దక్కించుకుంటుందా?

అందరి ముందు మమ్మీని అవమానించినందుకు వాళ్ళ అంతు చూడాలని రేఖ, రాహుల్ పగతో రగిలిపోతూ ఉంటారు. రాజ్ కావ్య మాటలు తలుచుకుంటూ ఉండగా రాహుల్ వస్తాడు. అసలు ఏ అమ్మాయినైతే నువ్వు చూడకూడదు అనుకున్నానో ఆ అమ్మాయినే జీవితాంతం చూడాల్సి వస్తుందని పైకి అంటాడు. ఆ స్వప్నని తీసుకెళ్ళి నేను మాత్రం ఏం సాధించాను బకరాని అయ్యానని మనసులో తిట్టుకుంటాడు. నువ్వు కళావతిని చేసుకోవడానికి మా అమ్మ కారణం అంట కదా అది తెలిసిన దగ్గర నుంచి చాలా గిల్టీగా ఉందని నమ్మిస్తాడు. వాళ్ళ అమ్మ నాకు సొంత అత్త కాదు అని తెలియకపోవడమే మంచిదని రాజ్ మనసులో అనుకుంటాడు. కనకం రెడీ అయి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతాడు. కావ్య రిసెప్షన్ అని రమ్మని ఫోన్ చేశారని చెప్తుంది. ఒకసారి వెళ్ళి అవమానపడింది చాలదా అని కృష్ణమూర్తి అంటాడు. వెళ్ళి చాటుగా అయినా చూసి వస్తానని బాధగా చెప్తుంది. నీ బాధ నాకు అర్థం అవుతుంది కానీ నీ ప్రేమ దాని కాపురాన్ని నాశనం చేయకూడదు లోపలికి వెళ్ళమని చెప్తాడు.

Also Read: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర

దుగ్గిరాల ఇంట్లో రాజ్, కావ్య రిసెప్షన్ కి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. కావ్య పెద్దమ్మ మీనాక్షి విచిత్రంగా రెడీ అయిఫంక్షన్ కి వస్తుంది. మంచి సెక్సీగా కత్తిలాగా ఉందే అని అక్కడ పని చేసే పనోడు లైన్ వేస్తాడు. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ నవ్విస్తుంది. ఫంక్షన్ అయ్యేలోపు తనని సెట్ చేసుకోవాలని అనుకుంటాడు. మీడియా వచ్చి మళ్ళీ హడావుడి చేస్తుంది. కనకం రిసెప్షన్ కి వెళ్ళడం కోసం జోకర్ వేషం వేసుకుంటుంది. ఇద్దరూ తిక్క తిక్కగా మాట్లాడుకుంటూ కాసేపు మైండ్ తినేస్తారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించని రాజ్ భార్యగా తనని అంగీకరిస్తాడా అని మీడియా వాళ్ళు అంటారు. మీనాక్షిని బుట్టలో వేసుకునేందుకు అకౌంటెంట్ పిట్టల దొర వేషం వేస్తాడు. రాహుల్ రిసెప్షన్ కి వెళ్తున్న విషయం ఎందుకు దాచాడు, అసలు కావ్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే అక్కడికి వెళ్లాలని స్వప్న డిసైడ్ అవుతుంది. రాహుల్ మనసులో ఏమనుకుంటున్నాడో, రాజ్ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటానని అనుకుంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!
ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!
Money heist: రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
Tilak Varma Ruled out: చివరి 2 టీ20లకు తిలక్ వర్మ దూరం.. ప్రపంచ కప్ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
చివరి 2 టీ20లకు తిలక్ వర్మ దూరం.. ప్రపంచ కప్ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
Kamareddy Latest News:కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి

వీడియోలు

India vs New Zealand 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Ind vs NZ 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Abhishek Sharma Records Ind vs NZ T20 | అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్
Sanju Samson Ind vs NZ T20 | వరుసగా విఫలమవుతున్న సంజు
Jasprit Bumrah in Ind vs NZ T20 | కివీస్ ను కుప్పకూల్చిన భారత బౌలర్లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!
ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!
Money heist: రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !
Tilak Varma Ruled out: చివరి 2 టీ20లకు తిలక్ వర్మ దూరం.. ప్రపంచ కప్ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
చివరి 2 టీ20లకు తిలక్ వర్మ దూరం.. ప్రపంచ కప్ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
Kamareddy Latest News:కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
Republic Day 2026: ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
Infosys: ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?
ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?
Chiranjeevi : రిజల్ట్ ఏదైనా తప్పు నాపైనే వేసుకుంటా - కొరటాల శివకు చిరు కౌంటరిచ్చారా?
రిజల్ట్ ఏదైనా తప్పు నాపైనే వేసుకుంటా - కొరటాల శివకు చిరు కౌంటరిచ్చారా?
David Reddy : 'డేవిడ్ రెడ్డి' డేంజరస్ లుక్ - మంచు మనోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
'డేవిడ్ రెడ్డి' డేంజరస్ లుక్ - మంచు మనోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
Embed widget