News
News
వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu March 20th: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర

Guppedantha Manasu March 20th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

వసు రిషి క్యాబిన్ కి వస్తుంది. మీరు లిఫ్ట్ ఇవ్వలేదు మరి నన్ను ఏం చేయమంటారు? జగతి మేడమ్ వాళ్ళ కారు బాగోలేదు అందుకే బైక్ మీద వచ్చాను. ఇదే కదా మీరు అడగాల్సింది నాకు తెలుసు మీరు ఇందుకే నన్ను పిలిచారని వసు లొడలొడ వాగుతుంది. నేను రమ్మంది అందుకు కాదని అంటాడు. లోపల మాత్రం నేను అనాల్సినవి కూడా నువ్వే అంటే నేను ఇంకేం అంటానని అనుకుంటాడు. కాలేజ్ పనులన్నీ మహేంద్ర, జగతి మేడమ్ కి చెప్పమని అంటాడు. మరి నేనేం చెయ్యను పని చెప్పొచ్చు కదా అంటుంది జగతి మేడమ్ కి అసిస్టెంట్ గా ఉండమని చెప్తాడు. మరి జీతం మా ఆయన ఖర్చులకి ఇవ్వడం లేదని అంటుంటే వద్దులే ఆపు అని అంటాడు.

నేను ఎక్కడ ఉండాలని వసు అంటే నేను ఎక్కడ ఉంటే నువ్వు నా పక్కనే ఉంటావ్ వసుధార అంటాడు. నువ్వు వచ్చిన తర్వాత నా కోపాన్ని మర్చిపోయాను తిట్టాలనుకుని తిట్టలేకపోయానని రిషి మనసులో అనుకుంటాడు. రిషి కెమికల్ ల్యాబ్ వైపు వెళ్లబోతుంటే వసు అడ్డుపడి వెళ్లనివ్వనని అంటుంది. గతంలో జరిగింది గుర్తు లేదా మిమ్మల్ని చివరి నిమిషంలో కాపాడుకున్నా, అసలు వెళ్ళడానికి ఒప్పుకోనని ల్యాబ్ రిపోర్టర్ వస్తాడు తనకి పని చెప్తుంది. ఒక్కసారి ప్రమాదం జరిగిందని ఎప్పుడు అలాగే అవుతుందని ఎందుకు అనుకుంటావ్ అప్పుడు నువ్వు నన్ను బాధపెట్టావ్ ఇప్పుడు బాధపెడుతున్నావ్ అని అంటాడు. మన మధ్య గొడవలు జరిగాయి కానీ పోయాయి నన్ను నా ప్రేమని మనసుని అర్థం చేసుకోండి, ఇప్పటికైనా మన పెళ్లిని అంగీకరించండి. ఇలా మౌనంగా ఎన్ని రోజులు ఉంటారు సమాధానం చెప్పాలి కదా అని అడుగుతుంది.

Also Read: రాజ్, కావ్య ప్రేమకీచులాట స్టార్స్- పగబట్టిన రుద్రాణి, నిజం తెలుసుకున్న స్వప్న

నా మనసుకి సమాధానం దొరికినప్పుడే నీకు సమాధానం దొరుకుంతుందని చెప్తాడు. మహేంద్ర వాళ్ళని పట్టుకోవడం కోసం రిషి ఎదురుచూస్తూ ఉంటాడు. అయ్యయ్యో దొరికిపోయామని పారిపోతుంటే జగతి తీసుకొస్తుంది. బైక్ మీద రావడం ఏంటి డాడ్ అని రిషి అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేయమని జగతికి సైగ చేస్తాడు. మీకు ఆరోగ్యం బాగోలేదు కదా ఎందుకు వచ్చారని మళ్ళీ అంటాడు. జస్ట్ ఫర్ ఛేంజ్ అని ఏదేదో చెప్తాడు. ఇంకోసారి ఇలా బైక్ మీద రావొద్దు ఆరోగ్యం జాగ్రత్త అని ప్రేమగా చెప్తాడు. ఇద్దరూ ఎలాగోకలా రిషి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోగానే రిషి వసు బైక్ చూసి ఈ బైక్ ఇక్కడ అవసరమా అని డాన్ని మాయం చేసేస్తాడు. వసు బయటకి వచ్చి చూసేసరికి స్కూటీ ఉండదు. రిషి సర్ నా స్కూటీ దాచి ఉంటారా అని వసు అనుకుని వెళ్ళి అడుగుతుంది.

Also Read: అంతలోనే సంతోషం అంతలోనే బాధ- యష్ కి వేద తులాభారం, చెడగొట్టేందుకు వచ్చిన విన్నీ

ఎవరో తన బైక్ కొట్టేశారని లై డిటెక్టర్ పెట్టాలని వసు మాట్లాడుతూనే ఉంటుంది. ఆ భాష ఏంటి క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూస్తావా అని రిషి అంటాడు. లిఫ్ట్ అడగను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత మీకు ఉందని వెళ్ళి వసు కారులో కూర్చుంటుంది. బైక్ మాయం చేసే కుట్రలో మీకు భాగం ఉందా అని అడుగుతుంది తన మాటలు వినలేక తల్లీ నీకు దణ్ణం నేనే పక్కన పెట్టించానని ఒప్పుకుంటాడు. కారులో కూర్చుని రిషితో సేవలు చేయించుకుంటుంది. ఇద్దరూ కారులో వెళ్ళడం చూసి మహేంద్ర వాళ్ళు సంతోషపడతారు. వాళ్లిద్దరికీ పెళ్లి చేద్దామని మహేంద్ర అంటాడు. రిషి దగ్గర ఆ టాపిక్ తీయకని జగతి తిడుతుంది.

Published at : 20 Mar 2023 10:06 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial March 20th Episode

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !