Ennenno Janmalabandham March 20th: అంతలోనే సంతోషం అంతలోనే బాధ- యష్ కి వేద తులాభారం, చెడగొట్టేందుకు వచ్చిన విన్నీ
విన్నీ తన అసలు రంగు బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ ని ఆఫీసుకి వెళ్ళకుండా ఆగిపొమ్మని వేద అడుగుతుంది. నో చాలా పనులున్నాయని ముందు చెప్తాడు వేద బుంగమూతి పెట్టేసరికి ఎన్ని పనులు ఉన్నా నీ కోసం వదిలేసి ఉంటానని అంటాడు. ఆ మాటకి వేద సంతోషపడుతుంది. గుడిలో ఈ రోజు మా అమ్మ తులాభారం పూజ చేయమని చెప్పిందని చెప్తాడు. సరే అంటాడు. ఆఫీసుకి కాల్ చేసి అన్నీ అపాయింట్ మెంట్స్ క్యాన్సిల్ చేయమని చెప్పడంతో వేద మురిసిపోతుంది. బెస్ట్ హజ్బెండ్ అనేవాడు భార్య చిన్న చిన్న సరదాలు తీర్చాలని యష్ మనసులో అనుకుంటాడు. వేద సంతోషంగా సులోచన దగ్గరకి వస్తుంది. గుడికి రావడానికి ఆయన ఒప్పుకున్నారని చెప్తుంది.
Also Read: తులసికి పెళ్లిరోజు కానుక ఇచ్చిన నందు- విక్రమ్ ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజ్యలక్ష్మి ఎత్తుగడ
గుడిలో ఖుషి దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ తులాభారం సక్సెస్ అవాలని కోరుకుంటుంది. బాగా జరిగితే అమ్మ హ్యాపీ, నేను హ్యాపీ నాన్న కూడా హ్యపీ అని అంటుంది. ఖుషి గంట కొట్టాలని అందటం లేదని అనుకుంటుంటే వేద, యష్ వచ్చి తనని ఎత్తుకుంటారు. మొదటి సారి నా చేత్తో గంట కొడుతున్నా అని ఖుషి సంబరపడుతుంది. తులాభారం చేసి నిలువెత్తు బంగారం స్వామివారికి సమర్పిస్తే అంతా మంచే జరుగుతుందని పూజారి చెప్తాడు. వీళ్ళ మధ్య ఎలాంటి విభేధాలు రాకూడదని సులోచన కోరుకుంటుంది. వేద పూజ చేస్తూ ఉంటే ఓవైపు యష్ చూస్తూ ఉంటే మరోవైపు విన్నీ కూడా చూస్తాడు. ఆయన ఈ తులాభారంలో తూగాలి, నా ప్రేమకి సరితూగాలి మా అనుబంధం కలకాలం కొనసాగాలని వేద మనసులోనే దేవుడిని వేడుకుంటుంది.
అప్పుడే మంచితనం ముసుగు వేసుకున్న విన్నీ వస్తాడు. ఆపడానికి రావాలి కదా మనసులో అనుకుంటాడు. తీరని కోరిక ఏదైనా ఉంటే అది తీరిపోతుందని సులోచన చెప్తుంది. అయితే నాకు ఒక పెద్ద తీరని కోరిక ఉంది అది తీరుతుందని అనుకుంటాడు. నువ్వు నాతో రావాలన్న కోరిక తీరాలంటే మీ ఇద్దరు ఒకటి కావాలనే కోరిక తీరకూడదు, ఆ కోరిక తీర్చే ఈ తులాభారం జరగకూడదని విన్నీ మనసులో అనుకుంటాడు. వేద, యష్ చూడముచ్చటగా ఉందని చిత్ర, వసంత్ మాట్లాడుకుంటారు. గొడవలతో మొదలైన వాళ్ళ బంధం ఇలా ఉండటం చూస్తే చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ బంధం ఎటువంటి గొడవలు లేకుండా సాగిపోవాలని వసంత్ చిత్ర అనుకుంటారు. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ యష్ అడుగులో అడుగులు వేస్తూ వేద మురిసిపోతుంది. ఏంటి.. ఏంటి వరస.. అని సాంగ్ వేసి ఆ సీన్ సూపర్ గా చూపించారు. యష్ ఏం చేస్తే వేద కూడా అలాగే చేస్తూ ఉంటుంది.
Also Read: రిషి, వసుకి ఫస్ట్ నైట్- ఉచ్చుబిగించిన దేవయాని, ఈసారి తప్పించుకోవడం కష్టమే
గుడిలో కాయిన్స్ నిలబెడుతున్నారని, అలా చేస్తే కోరిన కోరిక తీరుతుందని చిత్ర చెప్పేసరికి వేద చేస్తానని అంటుంది. నా మనసులో ప్రేమని ఆయనకి చెప్పాలని అనుకుంటున్నా మా ఇద్దరి మధ్య ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడు స్వామి అను కోరుకుంటూ వేద కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తుంది కానీ అది పడిపోతుంది. కాయిన్ నిలబడకపోవడంతో వేద బాధపడుతుంది. అది చూసి విన్నీ సంతోషపడతాడు.