Gruhalakshmi March 18th: తులసికి పెళ్లిరోజు కానుక ఇచ్చిన నందు- విక్రమ్ ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజ్యలక్ష్మి ఎత్తుగడ
దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి గుడికి వెళ్లానని చెప్పేసరికి పెళ్లిరోజు భర్త పక్కన లేకుండా ఒక్కదానివే వెళ్ళడం ఏంటని వాసుదేవ్ అంటాడు. అసలు నందు ఎక్కడ ఏం చేస్తున్నాడని పిలుస్తాడు. ఏమైందని కంగారుగా వచ్చేసరికి అర్జెంట్ గా తులసికి డివోర్స్ ఇచ్చేసేయ్ అని అంటాడు. తులసి మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఇలా చేస్తున్నాడు, తనని జాగ్రత్తగా చూసుకోమని వాసుదేవ్ చెప్తాడు. సరిగా చూసుకోకపోతే చెప్పమ్మా వెంటనే బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటానని తులసితో చెప్పేసరికి లాస్య షాక్ అవుతుంది. పెళ్లి రోజు సందర్భంగా వాసుదేవ్ దంపతులు తులసి, నందుకి కొత్తబట్టలు పెడతారు. అది చూసి అనసూయ, పరంధామయ్య దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అని ఓవైపు ఆనందపడతారు. లాస్య అది చూసి రగిలిపోతూ ఉంటే రాములమ్మ సెటైర్లు వేస్తుంది. అప్పుడే దీపక్ వచ్చి వింతగా చూస్తూ ఉంటాడు.
Also Read: రిషి, వసుకి ఫస్ట్ నైట్- ఉచ్చుబిగించిన దేవయాని, ఈసారి తప్పించుకోవడం కష్టమే
అక్కా,బావ పెళ్లిరోజని విష్ చేయడానికి వచ్చావా అని వాసుదేవ్ దీపక్ ని అడుగుతాడు. ఏదో జరుగుతుంది అందరి మొహాల్లో టెన్షన్ కనిపిస్తుందని దీపక్ మనసులో అనుకుంటాడు. దివ్య ఏదై ఫైల్ తీసుకుని సంజయ్ దగ్గరకి వచ్చేసరికి మళ్ళీ నర్స్ తో రాసలీలలు మొదలుపెడతాడు. పెళ్లి విషయం మాట్లాడతానని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడలేదని నర్స్ అంటుంది. నమ్మకం లేదా ఏది కావాలంటే అది చేస్తున్నా కదా అని అంటాడు. నర్స్ ప్రియతో సరసాలు ఆడుతూ ఉంటే దివ్య వచ్చి పిలుస్తుంది. లోపలికి వచ్చి దివ్య సంజయ్ ని కోపంగా చూస్తుంది. నేను రాయకుండానే పేషెంట్ కి ఇన్ని టెస్ట్ లు ఎందుకు రాశారని దివ్య వచ్చి నిలదీస్తుంది. ఇది మా హాస్పిటల్ నీకు అనవసరం మమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు నీకు లేదని అంటాడు. దీంతో దివ్య కోపంగా వెళ్ళిపోతుంది.
తులసి దీపక్ కి జరిగింది మొత్తం చెప్తుంది. ఆయన పక్కన కూర్చోవడానికి మనసు ఎలా ఒప్పుకున్నావని అంటాడు. ఆయన నా పిల్లలకి తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి చేయక తప్పలేదని తులసి వేదాంతం చెప్పుకొస్తుంది. కేఫ్ విషయంలో సహాయం చేయడం నచ్చలేదని అంటాడు. పిల్లల కోసం తప్పడం లేదు అంతే కానీ మరొక ఉద్దేశం లేదని తెగేసి చెప్తుంది. నందగోపాల్ తో నా జీవితం ఒక పెను తుఫానని తులసి బాధపడుతుంది. ఛీ కొట్టి వదిలించుకున్న మనిషి పక్కన మళ్ళీ భార్యగా నటించడం మామూలు విషయం కాదు మంచితనంతో చేస్తుంది. సోరి తులసి నిన్ను బాధపెడుతున్నా ఇంక ఈ ఒక్క రోజే. మొన్న ఇద్దామని అనుకుంటే లాస్య హైజాక్ చేసింది, ఇప్పుడు నీకు నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తానని అనుకుంటాడు. విక్రమ్ ని తనవైపు తిప్పుకోవడం కోసం రాజ్యలక్ష్మి దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తుంది. పొద్దుటి నుంచి మంచి నీళ్ళు కూడా తాగలేదు కనీసం పాలు అయినా తాగమని బసవయ్య విక్రమ్ ని చూసి నటిస్తాడు.
Also Read: డబుల్ ట్విస్ట్, రుద్రాణి మోసం బయటపెట్టిన కావ్య- చెంప చెల్లుమనిపించిన అపర్ణ
నా బిడ్డ మనసు మారి నా మాట వినేవరకు పూజ మానను అని రాజ్యలక్ష్మి కావాలని విక్రమ్ రాగానే కళ్ళు తిరిగి పడిపోబోతుంది. పెళ్లికి ఒప్పించడం కోసం విక్రమ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. తిండి మానేసి పూజ చేస్తుందని బసవయ్య వాళ్ళు చెప్పేసరికి విక్రమ్ చాలా బాధపడతాడు.