Brahmamudi March 22nd: చూడముచ్చటైన జంట- కనకాన్ని గుర్తుపట్టిన కావ్య, రిసెప్షన్ కి వచ్చిన స్వప్న
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మీనాక్షి, కనకం దగ్గరకి కళ్యాణ్ వస్తాడు. మీరు ఇద్దరూ ఎవరో నాకు తెలుసు కూతుర్ని కలవకూడదని మా వాళ్ళు కండిషన్ పెట్టారు అందుకే ఇలా చేశాను. మిమ్మల్ని జోకర్ వేషం వేసుకుని రమ్మని చెప్పాను మీరు దొరికిపోవద్దు జాగ్రత్తగా మీ కూతుర్ని చూసుకుని వెళ్లిపొమ్మని చెప్తాడు. దీంతో కనకం చాలా సంతోషపడుతుంది. ఇక రిసెప్షన్ దగ్గర మీడియా హడావుడి చేస్తుంది. ఇంకొద్ది క్షణాల్లో దుగ్గిరాల ఫ్యామిలీ రిసెప్షన్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఆ జంట కలిసి వస్తుందో లేక విడివిడిగా వస్తుందో చూద్దామని యాంకర్ చెప్తుంది. కనకం వాళ్ళు చాటుగా నిలబడి రాజ్ వాళ్ళని చూస్తూ ఉంటారు. రాజ్ ఒక్కడే వచ్చాడని పెళ్లి కూతురు రాలేదని మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. పెళ్లికూతురు తప్పకుండా వస్తుందని రాహుల్ మీడియా ముందు కవర్ చేస్తాడు.
Also Read: వేదని కాపాడి తీసుకొచ్చిన ఖుషి- బరువు తూగని యష్, విన్నీ కోరికే ఫలిస్తుందా?
ఇంద్రాదేవి ఒక్కతే వచ్చేసరికి తను రాదా అని అపర్ణ టెన్షన్ పడుతుంది. వస్తుందిలే అని చిట్టి చెప్తుంది. మళ్ళీ ముసుగు వేసుకుని వస్తుందేమోనని రాజ్ చిరాకు పడతాడు. కావ్య అద్దం ముందర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అపర్ణ కనిపించగానే కనకం కంగారులో నమస్తే వదిన అనేస్తుంది. మీనాక్షి అసలు నీకు బుద్ధి ఉందా అని తిడుతుంటే అప్పుడే అటు అపర్ణ వస్తుంది. తన కోసమే వస్తుందేమోనని భయపడిపోతారు. కానీ అపర్ణ వేరే వాళ్ళని పలకరించి తీసుకెళ్లిపోతుంది. రాహుల్ గుట్టు తెలుసుకోవడం కోసం స్వప్న వెయిటర్ వేషంలో అక్కడికి వస్తుంది. నిన్ను నమ్మి లేచిపోయి వస్తే నాకు చెప్పకుండా నీ ఫ్యామిలీ ఫంక్షన్ కి వస్తావా అసలు ఈ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావో తెలుసుకుంటానని స్వప్న అనుకుంటుంది. ఫంక్షన్ లో అందరూ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
రాహుల్ మీడియాకి సైగ చేసి మళ్ళీ రాజ్ ని ప్రశ్నించమని చెప్తాడు. యాంకర్ మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే రాజ్ ఆవేశంగా అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు నోటికి ఏం వస్తే అది అడిగేస్తారా? మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడమని వాళ్ళని తిడతాడు. కళ్యాణ్ రాజ్ ని వెనక్కి లాగి సర్ది చెప్తాడు. రాహుల్ మళ్ళీ ఏమి వెళ్లిపొమ్మని సైగ చేస్తాడు. కనకం టెన్షన్ పడుతూ వెళ్ళి కావ్యని తీసుకొస్తానని అంటుంటే మీనాక్షి తిట్టి ఆపేస్తుంది. రేఖ వచ్చి కావ్య గదిలో లేదని చెప్పడంతో అందరూ టెన్షన్ పడతారు. ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు గుసగుసలాడుకుంటారు. పెళ్ళిలో స్వప్న వెళ్లిపోయినట్టు ఈ అమ్మాయి కూడా వెళ్లిపోలేదు కదా అని రాజ్ తండ్రి అంటాడు. ఈ ఫ్యామిలీ మొత్తం పరువు తీయడానికి పుట్టినట్టు ఉన్నారని రాజ్ తిట్టుకుంటాడు. ఈ అమ్మాయి ఆలోచన లేనిది కాదు తన కళ్ళలో నిజాయితీ కనిపించిందని ఇంద్రాదేవి కావ్యని వెనకేసుకొస్తుంది.
Also Read: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య
మీడియా మళ్ళీ వచ్చి పెళ్లి కూతురు అసలు వస్తుందా రాదా? లేకపోతే లోపల బంధించారా? అని అంటుండగా కావ్య చక్కగా రెడీ అయి వస్తుంది. తనని చూసి రాహుల్ షాక్ అవుతాడు. కూతుర్ని చూసుకుని కనకం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చక్కగా అలకరించుకుని బుట్టబొమ్మలాగా వస్తుంది. నా కూతురికి నేను అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేశాడని కనకం ఎమోషనల్ అవుతుంది. నీకోడలు ఎంత అందంగా తయారై వచ్చిందో చూశారా అని ఇంద్రాదేవి సంతోషంగా చెప్తుంది. కావ్యని అలా చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు కానీ పైకి మాత్రం కోపంగా కనిపిస్తాడు. దుగ్గిరాల వంశానికి వన్నె తెచ్చావని రాజ్ తాతయ్య మెచ్చుకుంటాడు. తర్వాత కావ్య వెళ్ళి రాజ్ పక్కన నిలబడుతుంది. ఇద్దరూ గుసగుసలాడుకుంటూ తిట్టుకుంటారు. అయితే ఈ వేషం తీసేసి లోపలికి పోతానని కావ్య వెళ్లబోతుంటే రాజ్ తన చేయి పట్టుకుని ఆపుతాడు. రాజ్, కావ్య జంటని చూడముచ్చటగా ఉంటుంది.