Gruhalakshmi June 17th: దివ్య మీద చెయ్యి ఎత్తిన విక్రమ్ - తులసికి షాకిచ్చి, లాస్యని సపోర్ట్ చేసిన రాములమ్మ
నందు జైలు నుంచి విడుదల కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రెచ్చగొడితే ఎంత దూరమైన వెళ్తానని లాస్య ఇంట్లో అందరినీ బెదిరిస్తుంది. నన్ను ఎదిరించి ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉందామని అనుకుంటున్నారా అంటుంది. అప్పుడే రాములమ్మ వచ్చి లాస్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది తప్పు చేసిన వాళ్ళని క్షమించి నందు బాబుకి నచ్చజెప్పవచ్చు కదా అంటుంది. ఆపుతావా అని పరంధామయ్య అరుస్తాడు. అప్పుడు నందు బాబు తులసమ్మ విడిపోతుంటే చూస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదే చేయవద్దని హితబోధ చేసి వెళ్ళిపోతుంది. పని మనిషి అయినా మంచి మాట చెప్పింది ఇప్పటికైనా నందుకి చెప్పి సరైన నిర్ణయం తీసుకోండి లేదంటే నష్టపోతారని అంటుంది.
రాజ్యలక్ష్మి నొప్పితో అల్లాడిపోతున్నట్టు నటిస్తుంది. దివ్యని ఏమి అనకు నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని నాటకాలు ఆడుతుంది. అప్పుడే దివ్య ఇంటికి వస్తుంది. విక్రమ్ ఆవేశంగా నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు. రాజ్యలక్ష్మి చేతికి కట్టు చూసి ఏమైంది ఆ కట్టు ఏంటని అంటుంది. ఏం నీకు తెలియదా అని విక్రమ్ కోపంగా అంటాడు.
విక్రమ్: కూరగాయలు తరగడానికి నిన్ను సహాయం అడిగారు కదా
Also Read: రేవతి ఊహించని నిర్ణయం- మురారీ మనసులో మాట తెలుసుకున్న ముకుంద
దివ్య: అడిగారు కానీ నేను మా అమ్మ వాళ్ళ దగ్గరకి వెళ్ళాను
విక్రమ్: వాళ్ళు రావొద్దని అన్నారు కదా ఎందుకు వెళ్లావ్ అయినా నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు. సాయం చేయకపోతే చేయకపోయావు కత్తి ఎందుకు ఆమె మీదకి విసిరావు
దివ్య: నేను విసరలేదు అది అంతా అబద్ధం. ఏంటి నా మీద పగబట్టినట్టు మాట్లాడుతున్నావ్
విక్రమ్: నేను కాదు నువ్వు పగబట్టి చేస్తున్నావ్
దివ్య: అయినా ఇప్పుడు ఏం ఘొరం జరిగిందని నిలదీస్తున్నారు
విక్రమ్: మా అమ్మ చేతికి గాయం అయ్యింది
దివ్య: అంతే కదా ప్రాణం పోయినట్టు అరుస్తావ్ ఏంటని అనేసరికి విక్రమ్ కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. ఆగిపోయావ్ ఏంటి కొట్టు అప్పుడు మీ అమ్మ కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. నన్ను బలిపశువు చేయాలనే కదా ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చావు అనేసి వెళ్ళిపోతుంది.
Also Read: నిజం చెప్తే చచ్చిపోతానని బెదిరించిన స్వప్న- రిసెప్షన్ జరగకుండా కావ్య చేసిందన్న రాహుల్
రాములమ్మ తనకి సపోర్ట్ గా మాట్లాడినందుకు లాస్య ఉంగరం బహుమతిగా ఇస్తుంది. కేవలం భర్తతో కలిసి ఉండే విషయంలో మాత్రమే నేను మీ వైపు నిలబడ్డానని రాములమ్మ చెప్తుంది. తులసి దివ్య గురించి ఆలోచిస్తుంటే ప్రియ ఫోన్ చేస్తుంది. ఇంట్లో అందరూ అక్కడికి దివ్య వచ్చినందుకు గొడవ చేశారు. దివ్య మాటలు బావ కూడా పట్టించుకోవడం లేదు తన తప్పేమీ లేకుండా నిందిస్తున్నారు. ఆవేశంలో దివ్యని బావ కొట్టబోయారని చెప్తుంది. ధైర్యంగా నేను దివ్య వెనుక నిలబడలేకపోతున్నానని ప్రియ బాధపడుతుంది. గదిలో ఒంటరిగా కూర్చుని దివ్య బాధపడుతుంటే తులసి ఫోన్ చేస్తుంది. కాసేపు కూతుర్ని ఊరడించే మాటలు మాట్లాడుతుంది. కన్నీళ్ళు తుడుచుకుని మాట్లాడుతున్నావా అని అంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా అత్త నా మీద కక్ష్య తీర్చుకుంటుందని దివ్య బాధపడుతుంది.
విక్రమ్ తన నుంచి దూరమవుతున్నాడని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. భర్తని బతిమలాడుకోమని సలహా ఇస్తుంది. కానీ దివ్య మాత్రం ప్రతి సారీ భార్య ఎందుకు బతిమలాడాలి విక్రమ్ మాట్లాడే వరకు మాట్లాడనని బిగుసుకుని కూర్చుంటుంది. మౌనంగానే సమస్యలను ఎదురుచూస్తానని తన గురించి దిగులు పెట్టుకోవద్దని దివ్య ధైర్యంగా మాట్లాడుతుంది.