Brahmamudi June 17th Episode: నిజం చెప్తే చచ్చిపోతానని బెదిరించిన స్వప్న- రిసెప్షన్ జరగకుండా కావ్య చేసిందన్న రాహుల్
స్వప్న, రాహుల్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్వప్నకి జాగ్రత్తలు చెప్పి కనకం, కృష్ణమూర్తి భారమైన హృదయంతో వెళ్లిపోతారు. కావ్య కోపంగా స్వప్నని లాక్కొచ్చి గదిలో పడేస్తుంది. ఏంటే ఇది నా కడుపులో బిడ్డ ఏమైపోవాలని స్వప్న అరుస్తుంది. అవునా అయితే పద హాస్పిటల్ కి వెళ్ళి స్కానింగ్ చేయిస్తా, గైనకాలజిస్ట్ అపాయింట్ మెంట్ తీసుకుంటానని కావ్య బెదిరిస్తుంది. అవసరం లేదు నాకు ఏదైనా అయితే తెలిసిపోతుందని స్వప్న కంగారు పడుతుంది.
కావ్య: నేను ఇప్పుడు ఈ క్షణం తలుచుకున్నా నిన్ను పుట్టిల్లు రానివ్వదు అత్తిల్లు రానివ్వదు
స్వప్న: ఏంటే బెదిరిస్తున్నావా ఆ ఖర్మ ఎందుకు పడుతుంది
కావ్య: ఎందుకంటే నీకు కడుపే రాలేదు కాబట్టి
స్వప్న: ఏంటి నా మీద లేనిపోనివి చెప్పి నువ్వే ఈ దుగ్గిరాల ఇంట్లో రాచరికం వెలగబెడదామని అనుకుంటున్నావా
Also Read: తల్లిదండ్రులకి నిజం చెప్పిన దివ్య- తల్లీమాటలు విని పెళ్ళాన్ని అసహ్యించుకుంటున్న విక్రమ్
కావ్య: నాకు సంస్కారం తెలుసు నేను ఇప్పుడే అప్పుకి ఫోన్ చేస్తాను నువ్వు చేసిన కడుపు నాటకానికి నిన్ను ఎలా ఆడుకోవాలో అలా అడుకుంటుంది
స్వప్న: ఛీ ఛీ ఆ రౌడీ ఎందుకు ఇప్పుడు ఇక్కడికి
కావ్య: అదైతే నీకు కరెక్ట్ గా సమాధానం ఇస్తుంది. అసలు ఇంత మోసం చేస్తావా నీ మాటలు నమ్మి నేను పోరాడి పెళ్ళికి ఒప్పించాను. రాహుల్ ఎంత దరిద్రుడో తెలిసి కూడా నువ్వు తల్లివి అయ్యావనే ఒకే ఒక కారణంతో పెళ్లి జరిపించాను నువ్వు చేసిన మోసానికి రాజ్ ఇప్పటికీ కొలుకోలేదు మళ్ళీ ఒక మోసం బయట పడితే నిన్ను, రాహుల్ ని ఇంట్లో ఉండనిస్తాడా?
స్వప్న: కడుపు అబద్ధం అని నీకు ఎలా తెలుసు
కావ్య: ఇందాక అరుణ్ ఫోన్ చేశాడు అది నేనే లిఫ్ట్ చేశాను అలా నిజం తెలిసిపోయింది
స్వప్న: నేను అబద్ధం చెప్పాను కానీ అందులో సగం నిజం. కడుపు అనేది తిరుగులేని ఆయుధం అదే వాడాను చచ్చినట్టు పెళ్లి జరిపించారు
కావ్య: అది వాళ్ళు తెలుసుకునే లోపు నేనే వెళ్ళి రాజ్ తో నిజం చెప్పేస్తాను లేదంటే నువ్వు చెప్పిన అబద్ధంలో నాకు భాగం పంచుతాడు
స్వప్న: వెళ్ళు వెళ్ళి చెప్పు నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ప్రాణాలతో ఉండను నీకు నా గురించి తెలుసు నువ్వు వెళ్ళి నిజం బయట పెట్టిన మరుక్షణం నేను బతికి ఉండను
Also Read: కృష్ణ, మురారీ ఆనందాన్ని చెడగొట్టాలని డిసైడ్ అయిన ముకుంద- ఎన్ని చేసిన బంధం విడిపోదన్న రేవతి
కావ్య: ఏంటి నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అమ్మానాన్నని పిలుస్తాను వాళ్ళే ప్రాణాలు తీస్తారు సిగ్గు ఉండాలి నీకు
స్వప్న: లేకపోతే ఆ అమ్మాయితో రాహుల్ కి పెళ్లి చేసేవాళ్ళు నువ్వు నిజం చెప్పిన మరుక్షణం నా శవాన్ని చూస్తావ్
కోపంగా అరుణ్ కి ఫోన్ చేసి తిడుతుంది. నెల తిరిగేసరికి ఆ కావ్య నోరు మూయించాలని స్వప్న డిసైడ్ అవుతుంది. దుగ్గిరాల ఇంటి కోడలిని అయ్యానని స్వప్న తెగ సంబరపడుతుంది. ఫస్ట్ నైట్ సంగతి గురించి ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. ఆల్రెడీ కడుపు తెచ్చుకున్న అమ్మాయికి మళ్ళీ శోభనం ఏంటని అపర్ణ అంటుంది. ఆనవాయితీ ప్రకారం జరగాల్సింది జరిపిద్దామని ఇంద్రాదేవి అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోమని రుద్రాణి కోపంగా వెళ్ళిపోతుంది.
రాజ్ ని ఇంద్రాదేవి పక్కకి తీసుకెళ్ళి అసలు విషయం చెప్పడానికి ఇబ్బంది పెడుతుంది. కావ్య సిగ్గుపడుతూ అక్కకి రాహుల్ కి శోభనం ఏర్పాట్లు చేయాలని ఆ గది మనమే రెడీ చేయాలని అనేసరికి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు చెప్పావ్ కదా నానమ్మ చేస్తానులే అంటాడు. ఏవేం కావాలో లిస్ట్ చెప్పమని రాజ్ అడుగుతాడు. కావ్య లిస్ట్ చెప్పి తీసుకురమ్మని అడుగుతుంది. మన పెళ్ళికి రిసెప్షన్ చేయారా అని స్వప్న అడిగితే మీ అక్క తన రిసెప్షన్ గ్రాండ్ గా చేయించుకుంది మనకి మాత్రం వద్దని చెప్పిందని రాహుల్ ఎక్కిస్తాడు.
కావ్య బెడ్ రెడీ చేస్తూ స్వప్న చేసిన మోసం గురించి ఆలోచిస్తుంది. అక్క ఈ ఇంట్లోకి అడుగుపెడుతూ నన్ను బలి పశువు చేసింది నిజం తెలిస్తే రాజ్ కత్తి పట్టుకుని వచ్చేస్తాడని అనుకుంటుండగా నిజంగానే రాజ్ అలా వస్తాడు.