News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gruhalakshmi June 10th: నిర్ధోషిగా విడుదలైన నందగోపాల్, లాస్యకి మొట్టికాయలు- నిర్విఘ్నంగా పూజ చేసిన దివ్య

నందు మీద గృహహింస కేసు పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

దివ్య అత్యంత కష్టమైన సరే 101 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేస్తుంది. హోమం పూర్తయ్యే వరకు అఖండ దీపం చేతిలోనే ఉండాలి, హోమం అయిపోయాక దీపం అందులో వేయాలని పంతులు చెప్తాడు. దీంతో దివ్య కళ్ళు తిరుగుతున్నా కూడా అఖండ దీపం పట్టుకుని నిలబడుతుంది. రాజ్యలక్ష్మి మీద తల వాల్చి నిలబడుతుంది. ఓసి నా పిచ్చి అత్త నేను చేసే ఈ పూజ నీకోసం అనుకుంటున్నావా? మా నాన్న కోసం ఆయన జైలు నుంచి విడుదల అవడం కోసం మానే ప్రసక్తే లేదని దివ్య చెప్పేసరికి రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. చేసిన పూజ చాలు ఇక దివ్య చేయలేదని అంటుంది. కానీ దివ్య మాత్రం పూజ చేసి తీరతానని ధైర్యం చెప్తుంది.

సాక్ష్యం ఉందని చెప్పి కేసు రీ ఓపెన్ చేయించారు కానీ ఇంతవరకు రాలేదని జడ్జి మోహన్ ని అడుగుతాడు. ఒకసారి సాక్షికి కాల్ చేసి తన ముందు మాట్లాడమని అనేసరికి తులసి శేఖర్ కి కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తులసి టెన్షన్ పడుతుంది. కేసు క్లోజ్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను, ఇచ్చిన గడువు లోపల సాక్షిని ప్రవేశపెట్టడంలో విఫలం అవడం వల్ల అని జడ్జి అనగానే శేఖర్ పరిగెత్తుకుంటూ వచ్చి నేను వచ్చేశానని అంటాడు.

ALso Read: విషమంగా ముకుంద తల్లి ఆరోగ్యం- కృష్ణ కాలికి మెట్టెలు తొడిగిన మురారీ

శేఖర్: నేను లాస్య మొదటి భర్తని డబ్బు కోసం ఆశపడి నందగోపాల్ కి వల వేసి పెళ్లి చేసుకుంది. నామీద లేనిపోని నిందలు మోపి డివోర్స్ తీసుకుంది. నా కొడుకుని దూరం చేసి తానూ పట్టించుకోవడం లేదు. తన స్వార్థం కోసం తులసి జీవితాన్ని నాశనం చేసింది. ఈ నందగోపాల్ ఇప్పటికైనా తన రాక్షసత్వం తెలుసుకుని బయట పడ్డాడు

మోహన్: లాస్య కావాలని నందగోపాల్ ని రెచ్చగొట్టి కావాలని చెయ్యి ఎత్తి కొట్టేలా చేసింది

భాగ్య: అందుకు సాక్షిని నేనే. లాస్య తోటి కోడలిని తన ప్లాన్ ముందే చెప్పి వీడియో తీయించింది

లాస్యని బోను ఎక్కిస్తారు. మీ మొదటి భర్త తోడి కోడలు చెప్పిన వాటిని ఒప్పుకుంటున్నారా ని జడ్జి అడుగుతాడు. అతని వైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా గృహహింస కేసు పెట్టారా అని అడుగుతాడు.

లాస్య: నా వైపు తప్పు జరిగింది క్షమించండి. నా భర్త నన్ను ఇంట్లో నుంచి గెంటేయడంతో ఇలా చేశాను

నందు: నేను ఆ పని చేయడానికి కారణం కూడా చెప్పమనండి సర్. తప్పు నాది అయితే అందరి ముందు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను

లాస్య: నేను స్వార్థంతో ప్రవర్తించబట్టే నన్ను గెంటేశారు. కానీ ఆయన లేకుండా నేను బతకలేను

నందు: ఇక ఇలాంటి మనిషితో బతకడం నా వల్ల కాదు ఆ రాక్షసి నుంచి నా కుటుంబాన్ని కాపాడుకునే ఓపిక లేదు. కావాలంటే మళ్ళీ జైలుకి పంపించండి. నేను తన చేతిలో మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేను

Also Read: సోది పెట్టిన మైఖేల్- పెళ్లి కూతురు కిడ్నాప్, స్వప్నని కావ్య కాపాడుతుందా?

లాస్య: నాకు విడాకులు ఇవ్వొద్దని చెప్పు తులసి

లాస్య చేసిన ఆరాచకాలన్నీ నందు ఏకరువు పెడతాడు. తులసి మధ్యలో లేచి తన గతాన్ని తీసుకురావద్దని అంటుంది.

జడ్జి: లాస్య వైపు చాలా తప్పులు ఉన్నాయి. అందుకు పశ్చాత్తాపపడుతూ కలిసి ఉండాలని కోరుకుంటుంది. మొదటి భార్య విషయంలో తొందరపడి దూరమై బాధపడుతున్నారు. రెండోసారి అలా జరగకూడదు అందుకే ఆఖరి ప్రయత్నంగా నెల రోజులు కలిసి ఉండాలి. మీ మనసులు మారి దగ్గరయితే సరే లేదంటే విడాకులకి అప్లై చేసుకోవచ్చు. ఈ కేసులో నందగోపాల్ ని నిర్ధోషిగా ప్రకటిస్తూ అతడిని విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తాడు. దివ్య పూజ చేస్తూ ఉండగా విక్రమ్ కి ఫోన్ వస్తుంది. నందుని నిర్దోషిగా విడుదల చేశారని చెప్పడంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది.

Published at : 10 Jun 2023 10:30 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial June 10th Update

ఇవి కూడా చూడండి

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు  

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు