By: ABP Desam | Updated at : 09 Dec 2022 08:24 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
తమ మధ్య పప్రేమ లేదని నందు తులసితో చెప్తాడు. లాస్య గురించి అన్ని తెలిసే కదా పెళ్లి చేసుకున్నారని తులసి అంటుంది. కానీ నందు మాత్రం ఈ ఇంటిని కుట్రతో రాయించుకున్నప్పుడే తన గురించి తెలిసిందని మోసం చేసిందని బాధపడతాడు. అభద్రత వల్లే చేశానని చెప్పింది కదా అని నచ్చజెప్పడానికి చూస్తుంది.
నందు: అది తన జబ్బు మారదు, తన కోసం ఎన్నో చేశాను నిన్ను వదిలేశాను, పిల్లల ముందు హీరోలా ఉండేవాడిని ఇప్పుడు జీరో అయ్యాను. తన కోపాన్ని భరించాను సహించాను అయినా ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతుంటే అది నా తప్పు కాదు
తులసి: మిమ్మల్ని కూడా తను భరించింది, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతంగా తీసుకోండి, కోపంలో వద్దు. ఆ నిర్ణయ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఇప్పటికే మన గొడవలు చూసి అలిసిపోయారు, ఇప్పుడు మీ గొడవలు చూసి పిల్లలు విసిగిపోతున్నారు. లాస్య గురించి ఆలోచించండి ప్లీజ్ అనేసి వెళ్ళిపోతుంది.
Also Read: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్
తులసి బయటకి వెళ్లిపోగానే వెనుకే నందు కూడా వస్తాడు. ఇప్పటి వరకి ఈ కుటుంబం కోసం చాలా తపన పడ్డావ్, ఈ ఇంటికి దూరంగా వెళ్ళినా ఈ ఇంటి సమస్యలు నిన్ను వదలడం లేదు, సోరి ఇంకోసారి నువ్వు ఈ ఇంటికి వస్తే పిల్లలతో సంతోషంగా గడపటానికి మాత్రమే వస్తావ్ నేను మాట ఇస్తున్నా అని నందు అంటాడు. ఆ మాటకి తులసి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అది నా పాతికేళ్ళ కోరిక అది తిరితే చాలా సంతోషంగా ఉంటానని చెప్తుంది. అత్తయ్య వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని తులసి అంతే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అని నందు అనేసరికి సంతోషంగా వెళ్ళిపోతుంది.
లాస్య తులసి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే నందు వచ్చి గదిలో చిందరవందరగా ఉన్నవన్నీ సర్దుతూ ఉంటాడు. తర్వాత లాస్యకి సోరి చెప్తాడు. లాస్య కూడా నందుకి సోరి చెప్పి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ‘ఈ ఇంటి కోడలిగా నువ్వు చేయనది ఇప్పుడు చెయ్యాలి తులసిలాగా నువ్వు కూడా ఇంట్లో వాళ్ళకి దగ్గర అవు’ అని నందు చెప్పి వెళ్ళిపోతాడు. ‘నిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి మారినట్టు నటించాను, లోపల మాత్రం లాస్య ఎప్పటికీ మారదు, ఈ ఇంటిని ఆయుధంగా చేసుకుని నీ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుతాను’ అని లాస్య తన మనసులో కుట్ర బయటపెడుతుంది.
Also read: వేద త్యాగాన్ని మెచ్చుకున్న కుటుంబం- మరో కుట్ర ప్లాన్ చేసిన మాళవిక
తులసి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. తన కోరికలు గురించి డైరీలో రాసుకుంటూ తల్లికి ఫోన్ చేస్తుంది. తన బాధని తల్లితో పంచుకుంటుంది. సామ్రాట్ హనీ కోసం బొమ్మలు కొని తీసుకొస్తాడు. అవి చూసినా కానీ హనీ డల్ గా ఉంటుంది. తనని చూసి సామ్రాట్ ఏమైందని అడుగుతాడు. ఏం కావాలో చెప్పు నీకు చిటికెలో తెచ్చిస్తానని సామ్రాట్ అంటాడు. ఆ మాటకి ఎగ్జామ్ లో తనకి ఫస్ట్ ర్యాంక్ కావాలని అడుగుతుంది.
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!
Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?