Ennenno Janmalabandham December 8th: వేద త్యాగాన్ని మెచ్చుకున్న కుటుంబం- మరో కుట్ర ప్లాన్ చేసిన మాళవిక
తన తల్లికి యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య అనే విషయం తెలుసుకున్న వేద కేసు వెనక్కి తీసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన తల్లికి యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య అని వేద తెలుసుకుంటుంది. కోర్టులో నేరం నిరూపించే టైమ్ కి వేద వచ్చి అనుమతి ఇస్తే కేసు వాపసు తీసుకోవాలని అనుకుంటున్నట్టు జడ్జిని అడుగుతుంది. వేద తీసుకున్న నిర్ణయం విని మాళవిక, యష్ తో పాటు మాలిని వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఝాన్సీ ఎందుకని అడగబోతుంటే ఏడుస్తూ ఏమి అడగొద్దని కేసు మాత్రం విత్ డ్రా చేసుకుంటానని వేడుకుంటుంది. ఈ విషయం తెలిసి అభిమన్యు రగిలిపోతూ ఉంటాడు. ఆదిత్య అంటే యష్ కి ఎంత ఇష్టమో వేదకి తెలుసు అందుకే తనని వదిలేసి భర్త దృష్టిలో దేవత అయిపోయింది, మాళవికని దెయ్యాన్ని చేసేసిందని అభి, ఖైలాష్ మాట్లాడుకుంటారు.
తప్పు చేశావ్ వేద అని మాలిని అంటుంది. ఎందుకు ఇలా చేశావ్, యష్ కి భయపడ్డావా అని రత్నం కూడా అడుగుతాడు. ఆ మాళవికకి శిక్ష పడకుండా చేశావంటే నమ్మలేకపోతున్నామని వేద తండ్రి కూడా అంటాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావని సులోచన మాత్రం పాజిటివ్ గా అంటుంది. కానీ మాలిని మాత్రం తప్పు చేసింది వేద అని సీరియస్ అవుతుంది.
వేద: అవును నేను చేసింది తప్పే. మీరు మీ అబ్బాయిని కూడా కాదని నాకు అండగా నిలబడ్డారు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం నా తప్పే. ఈ కేసు వాపసు తీసుకోవడానికి కారణం ఒక పదేళ్ళ పసివాడు. అతడు ఎవరో కాదు ఆదిత్య. యాక్సిడెంట్ చేసింది అందరూ అనుకుంటున్నట్టు మాళవిక కాదు ఆదిత్య. ఇప్పుడు అడుగుతున్నా నేను చేసింది తప్పా, ఒక పదేళ్ళ పసివాడి మీద పగతీర్చుకోవాలా, వాడిని జైల్లో పెట్టించాలా? ఆదిత్యకి శిక్ష వేయిస్తే నేను గెలిచినట్టా, నిజం తెలిశాక నాకు మనసు ఒప్పుకోలేదు, అందుకే ఈ కేసు వెనక్కి తీసుకున్నా. నేను ఇలా చెయ్యడానికి కారణం ఆది యశోధర్ కొడుకు కావడం కాదు దానికి కారణం నేను అమ్మని అత్తయ్య. అమ్మలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఆ దేవుడు నాకు తల్లయ్యే రాత రాయలేదు కానీ ప్రతి బిడ్డని ప్రేమించే గొప్ప వరం ఇచ్చాడు. ఖుషి మాత్రమే బిడ్డ కాదు ఆది కూడా బిడ్డే.
Also Read: మాధురి కేసులో ఊహించని ట్విస్ట్, నేరం చేసిందెవరో కనిపెట్టిన జానకి- మల్లిక చెంప పగలగొట్టిన జ్ఞానంబ
సులోచన: నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది
మాలిని: ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నవని అరిచాను, కానీ నువ్వు తీసుకుంది గొప్ప నిర్ణయం నువ్వు తప్ప ఎవరు ఇలాంటి నిర్ణయం తీసుకోలేరు
వేద: ఇంత చేసిన నాకు బాధగానే ఉంది, నేను ఎవరిని అయితే ఎక్కువ నమ్మానో ఆయన నన్ను నమ్మలేదు, తన బిడ్డని నేను ఏమి చేయననే భరోసా ఆయనకి ణా మీద లేకుండా పోయింది, నాలో ఆదికి తల్లిని చూడలేకపోయారు ఆయన, నాలో అమ్మతనాన్ని ఆయన నమ్మలేకపోయారు అది తట్టుకోలేకపోతున్నా
యష్: ఈ ప్రపంచంలో నన్ను ఎవరైనా కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నారంటే అది నువ్వే, నాకు అండగా నిలబడేది నువ్వే, కానీ అలాంటి నీ దగ్గర నిజాన్ని దాచాల్సి వచ్చింది, నిన్ను బాధపెట్టాను అని మనసులో అనుకుంటాడు. ఇంట్లో అందరినీ యష్ క్షమించమని అడుగుతాడు.
Also read: లాస్యతో తెగదెంపులు చేసుకున్న నందు- ఛాలెంజ్ లో గెలిచిన సామ్రాట్
మాళవిక ఆదిత్యకి వేద గురించి చాలా చెడుగా చెప్తుంది. ఆదిని అడ్డం పెట్టుకుని వేద, యష్ ని దూరం చెయ్యాలని మాళవిక అనుకుంటుంది. వేద లాయర్ ఝాన్సీని కలుస్తుంది. వేద తీసుకున్న నిర్ణయాన్ని ఝాన్సీ మెచ్చుకుంటుంది. ఆదిత్య గురించి ఒకటే ఆలోచించాను వాడు ఖుషి అన్న, మా ఇంటి మనవడు వాడిని ఎలా జైలుకి పంపిస్తానని వేద అంటుంది. వేద కూడా తన పరిస్థితి అర్థం చేసుకున్నందుకు ఝాన్సీకి థాంక్స్ చెప్తుంది. సులోచన కాళ్ళు మామూలు అయిపోతాయి. మాలినితో కలిసి గుడికి వెళ్ళి అక్కడ ఇద్దరు మా వేద, నా అల్లుడు గొప్ప అని కొట్లాడుకుంటారు.