అన్వేషించండి

Gruhalakshmi December 7th: లాస్యతో తెగదెంపులు చేసుకున్న నందు- ఛాలెంజ్ లో గెలిచిన సామ్రాట్

లాస్య నిజస్వరూపం బయటపడటంతో 'గృహలక్ష్మి' సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

లాస్య ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పరంధామయ్య వాళ్ళ ముందు పెట్టి మొసలి కన్నీళ్ళు కారుస్తుంది. తన మాటలు విని ప్రేమ్ తుస్సుమని గాలి తీస్తాడు.

ప్రేమ్: అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.. ఈ ఇల్లు నీ పేరు మీద పెట్టుకుంటే చక్రం తిప్పొచ్చు అందరినీ నీ గుప్పిట్లో పెట్టుకోవచ్చని అనుకున్నావ్ ప్లాన్ వర్కౌట్ కాలేదు, మీ ఆయన కూడా నిన్ను దూరం పెడుతున్నాడు ఏం చెయ్యాలో తెలియక వెనుకడుగు వేశావ్

లాస్య: ప్రేమ్ అనే దాంట్లో నిజం లేదు మావయ్య ఇల్లు కావాలంటే రాయించుకోగానే సంతోషంగా ఉండేదాన్ని కదా ఇలా మీ ముందు కన్నీళ్ళు పెట్టుకునే దాన్ని కాదు

ప్రేమ్: అవి నిజం కన్నీళ్ళు కాదు తాతయ్య మొసలి కన్నీళ్ళు నమ్మకండి

లాస్య: నేను ఏం చేస్తే నమ్ముతారు చెప్పండి గొంతు కోసుకుంటే నమ్ముతారా అని కత్తి తీసుకొచ్చి చెయ్యి కోసుకుంటానని సీన్ చేస్తుంది. పరంధామయ్య ఆపుతాడు.

పరంధామయ్య: నీమీద కోపం ఉన్న మాట నిజమే కానీ ప్రాణాలు తీసుకుంటుంటే చూస్తూ ఉండే కసాయి వాళ్ళం కాదు

ప్రేమ్: తనని మళ్ళీ నమ్మొద్దు

Also Read: సాక్ష్యం సంపాదించిన ఝాన్సీ, చేతులెత్తేసిన యష్ లాయర్ - అందరికీ షాకిచ్చిన వేద

పరంధామయ్య: తన మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం కానీ ఇంటి కోడలు కన్నీళ్ళు పెడితే మంచిది కాదు, ఈ ఆస్తి వల్లే ఇల్లు ముక్కలైంది నీ దగ్గరే ఉంచుకో ఈ ఆస్తి

‘నువ్వు చస్తాను అంటే భయపడలేదు, అయ్యో అని పాపం కూడా చూపించలేదు. తాతయ్య నిన్ను మనసు చంపుకుని కోడలిగా ఒప్పుకున్నారు. గెలిచాను అని చంకలు గుద్దుకోకు. ఈ ఇంటి కోడలి స్థానానికి ఒక విలువ ఉంది అది దిగజారేలాగా ప్రవర్తించకు’ అని గడ్డిపెట్టి వెళతాతోడికోడళ్ళు ఇద్దరూ లాస్యకి గడ్డి పెట్టి వెళ్తారు. తులసి, సామ్రాట్ సామాన్లు మోసుకుంటూ నడుస్తూ ఉంటారు. నడవలేక అవస్థలు పడుతూ ఉంటాడు. ఇల్లు దగ్గరకి రాగానే సామ్రాట్ చిన్న పిల్లాడికి చాక్లెట్ దొరికినంత ఆనందంగా ఫీల్ అయిపోతాడు. ఛాలెంజ్ గెలిచారని తులసి అనేసరికి ఇదంతా మీ ఆడవాళ్ళ గొప్పతనమే. ఆడవాళ్ళు మీకు జోహార్లు అని పొగిడేస్తాడు.

ఇంట్లో వాళ్ళు తనని నమ్మలేదని భాగ్య దగ్గర చిరాకుపడుతుంది. ఇల్లు రిజక్ట్ చేసిన విషయం బావగారికి తెలిస్తే నిన్ను మెచ్చుకుంటారు, ఆయన్ని నీ వైపు తిప్పుకో అని భాగ్య సలహా ఇస్తుంది. లాస్య తెల్లారగానే నందుకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. నందు మాత్రం తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. లాస్య వెళ్ళి నందుని పట్టుకునేసరికి గట్టిగా అరుస్తాడు.

నందు: నువ్వు చేసిన పనులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో

లాస్య: చేసిన తప్పులకి సారీ చెప్పాను కదా

నందు: నువ్వు చేసిన మోసం తర్వాత నీకు నాకు మధ్య పెద్ద అగాథం ఏర్పడింది, అది ఎప్పటికీ పూడ్చలేం

లాస్య: నేను ఏం చేసినా అది  మనం సుఖంగా ఉండాలనే కదా, మన ఫ్యూచర్ కోసమే కదా

Also Read: ఐపీఎస్ పుస్తకం పట్టిన జానకి- జ్ఞానంబ కాళ్ళ మీద పడి నిజం చెప్పిన మల్లిక

నందు: నువ్వేం చేసినా అది నీకోసమే. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నేను చాలా కోల్పోయాను, నన్ను నేను మార్చుకున్నా. కానీ నువ్వు నాకు ఇచ్చింది అశాంతి

లాస్య: ఆవేశం తగ్గించుకుని నన్ను క్షమించు

నందు: నువ్వు చేసింది తప్పు అయితే క్షమించొచ్చు కానీ నువ్వు చేసింది మహా పాపం, కట్టుకున్న భర్తని మోసం చేసిన ఆడదాన్ని ఏ మగాడు క్షమించడు

అప్పుడే తులసి ఇంట్లోకి అడుగుపెడుతుంది. వాళ్ళ కోసం కొన్న సామాన్లు అన్ని మోసుకుంటూ లోపలికి వస్తుంది. తనని చూడగానే దివ్య సంతోషంగా హగ్ చేసుకుని అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి తులసిని పలకరిస్తారు. ఇంట్లో వాళ్ళ కోసం కొన్న వస్తువులు అన్నీ వాళ్ళకి ఇస్తుంది. కోడళ్ళకి చీరలు ఇస్తుంది. తులసి తన మాటకి కట్టుబడి ఇంటికి వచ్చినందుకు అనసూయ చాలా సంతోషిస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget