Janaki Kalaganaledu December 6th: ఐపీఎస్ పుస్తకం పట్టిన జానకి- జ్ఞానంబ కాళ్ళ మీద పడి నిజం చెప్పిన మల్లిక
మాధురి కేసుని సవాలుగా తీసుకుని పరిష్కరించమని రామా జానకితో చెప్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామాజానకి సంతోషంగా గడుపుతారు. అమ్మానాన్న ప్రేమ మరిపిస్తున్నారని జానకి రామాతో అంటుంది. “మీ అమ్మానాన్న అంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళ కోరికని ఎందుకు మర్చిపోయారు. మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ గా చూడటం మీ నాన్న కల. మీరు అంతగా ఇష్టపడే వాళ్ళ కోరిక తీర్చడం బాధ్యత కదా అది ఎందుకు వదిలేశారు. నేను తప్పు చేశాను ఆవేశంలో మాట తూలాను, సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేశారు. ఎలా ఉండమంటారు బాధ్యతగల భార్యగానా, నిజాయితీ గల పోలీసాఫీసర్ గానా అని అడిగారు. దానికి సమాధానం చెప్పే తెలివి లేదు. నాకు తెలిసింది అందరినీ సంతోషంగా ఉంచడమే. దాన్ని పట్టుకుని మీరు ఇలా చేస్తే ఎలా? నా ఆవేశం మీ నాన్నగారి కల ఎలా వదిలేస్తారు”.
“నేను ఏదో అన్నానే అనుకోండి నిజాయితీ తప్పి మా తమ్ముడిని బయటకి తీసుకొచ్చారు ఇప్పుడు ఐపీఎస్ చదువు ఆగిపోకూడదు. ఒక పని చెయ్యండి పోలీసాఫీసర్ గా మాధురిది మీ తొలి కేసు అనుకో. అనలేం జరిగిందో ఒక పోలీసాఫీసర్ గా తెలుసుకో, నా తమ్ముడు తప్పు చేయలేదని తెలిస్తేనే నా మాట క్షమించి కాలేజీకి వెళ్ళండి. ఆశయాలు అడ్డుకోకూడదు, ఇక నీ ఇష్టం” అని రామా చక్కగా చెప్తాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని అంటాడు. రామా, జానకి భానుమతి దగ్గర నుంచి ఇంటికి బయల్దేరతారు. అటు ఇంట్లో మల్లిక జానకి వాళ్ళ కోసం టెన్షన్ గా ఎదురుచూస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే దాని కంటే తను వెళ్లలేకపోయినందుకు తెగ బాధపడిపోతుంది.
Also Read: వీరనారి అవతారమెత్తిన తులసి- భాగ్య ఐడియా, లాస్యకి షాకిచ్చిన నందు
అప్పుడే రామా, జానకి ఇంటికి వస్తారు. అక్కడ జరిగింది అంతా రామా జ్ఞానంబకి చెప్తాడు. కోడలిని చూసి మెచ్చుకుందా అని అడుగుతుంది. అందరూ కలిసి కాసేపు జానకిని ఆకాశానికి ఎత్తేస్తుంది. ప్రేమగా చూసుకున్నారని జానకి చెప్తుంది. ఎలాగైనా జానకిని పోలేరమ్మ దగ్గర ఇరికించాలని లేదంటే తన దొంగ కడుపు డ్రామా బయటపడిపోతుందని మల్లిక అనుకుంటుంది. జానకి గదిలో రామా మళ్ళీ ఐపీఎస్ బుక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. వాటిని జానకి తీసేయబోతుంటే రామా వచ్చి ఆపుతాడు. ఎందుకు వాటిని తీసేస్తున్నారని అడుగుతాడు. తన నిర్ణయం మార్చుకోమని మరోసారి బతిమలాడతాడు. జానకి వాటిని పట్టుకుని ఏడుస్తుంది.
జానకి తన గురించి నిజం బయట పెట్టకముందే తను చదువు ఆపేసిందని నిజం చెప్పి తీరాల్సిందే అని మల్లిక అనుకుంటుంది. వెంటనే వెళ్ళి చెప్పేయాలని జానకి గదిలోకి తొంగి చూసేసరికి జానకి పుస్తకాలు పట్టుకుని చూస్తుంది. అది చూసి మల్లిక నోరెళ్ళబెడుతుంది. దరిద్రం తన ఒంటి మీద టెంట్ వేసుకుని కూర్చుంది, తొందరపడి జానకి చదువు మానేసిందని చెప్పి ఉంటే పోలేరమ్మ వాతలు పెట్టేదని మల్లిక తనని తాను తిట్టుకుంటూ గోడకి తల బాదుకుంటుంది. అది చూసి విష్ణు ఏమైందని కంగారుగా అడుగుతాడు.
Also Read: ఆదిత్య చెంప పగిలింది, నిజం తన్నుకొచ్చింది- వేద చేసిన పనికి యష్, మాళవిక షాక్
తరువాయి భాగంలో..
కడుపు నిజం అనుకుని పుట్టబోయే బిడ్డ మీద ఇంట్లో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీకు నువ్వే నిజం చెప్పి అత్తయ్యగారి కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకుని క్షమించమని అడగమని జానకి మల్లికకి చెప్తుంది. మల్లిక వెళ్ళి జ్ఞానంబ కాళ్ళ మీద పడి తను కడుపుతో లేనని చెప్తుంది. అది విని జ్ఞానంబ కోపంగా మల్లిక చెంప పగలగొడుతుంది.