Ennenno Janmalabandham December 6th: ఆదిత్య చెంప పగిలింది, నిజం తన్నుకొచ్చింది- వేద చేసిన పనికి యష్, మాళవిక షాక్
తన తల్లికి యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదని ఆదిత్య అని వేదకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఖుషి వేదని వచ్చి మంచం మీద పడుకోమంటే రాను అంటుంది. రావొచ్చు కదా అని యష్ అనేసరికి నేను కేవలం ఖుషికి అమ్మని మాత్రమే వేద అంటుంది. వాళ్ళిద్దరినీ చూసి ఖుషి చాలా సంతోషిస్తుంది. వేద, యష్ నిద్రపోయిన తర్వాత ఖుషి మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు, మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా ఉండను అని వెళ్ళిపోతుంది. తెల్లారే సరికి వేద, యష్ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పడుకుని ఉంటారు. సులోచన వేద కాపురం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కోర్టులో ఏం జరగబోతుందో అని టెన్షన్ పడుతుంది. దీని గురించే ఆలోచిస్తూ ఉంటుంటే యష్ వచ్చి సులోచన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు.
యష్: నాలో ఒక కొడుకుని చూసుకున్నారు కానీ అమ్మని క్షోభ పెట్టె కొడుకుని అయ్యాను
సులోచన: నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నేను కూడా మీ అమ్మలాంటి దాన్నే
యష్: నేను ఏ తప్పు చేయలేదమ్మా, చేసింది కూడా తప్పు అనుకోవడం లేదు
సులోచన: నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. వేద నువ్వు కోర్టుకి వెళ్తున్నారు ఇద్దరూ ఒక్కరిగా తిరిగి రావాలి వస్తారని నా నమ్మకం
యష్: ఇప్పుడు నేను వచ్చింది ఆశీర్వాదం కోసం వాడు కృతజ్ఞతలు చెప్పడానికి. వేదలాంటి మంచి కూతుర్ని కని నాకు భార్యని చేసినందుకు
అభిమన్యు వేద కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వేద ఖుషిని తీసుకుని వెళ్తు అభిని చూసి ఆగుతుంది. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది మాళవిక అని చెప్పాను కదా అది నిజం కాదని అభిమన్యు అంటాడు.
Also Read: పోలీస్ ఆఫీసర్‌గా మాధురి కేసు తీసుకోమన్న రామా - రంగంలోకి దిగిన జానకి ఐపీఎస్
వేద: నాకు తెలుసు నువ్వేం చెప్తావో కూడా తెలుసు అసలు యాక్సిడెంట్ చేసింది ఖైలాష్ అనో నువ్వో అని చెప్తావ్ అని తెలుసు, లాస్ట్ మినిట్ లో నన్ను కన్ఫూజ్ చెయ్యాలని అనుకుంటున్నావ్
అభి: నేను చెప్పేది ఒక్క నిమిషం విను వేద అని ఇన్ డైరెక్ట్ గా ఆదిత్య గురించి చెప్పేసి వెళ్ళిపోతాడు.
యష్ మాళవికని కలుస్తాడు. మళ్ళీ ఇద్దరు గొడవపడతారు. వేద గురించి ఆలోచిస్తున్నావా అని మాళవిక కుళ్ళుతో అడిగేసరికి యష్ సీరియస్ అవుతాడు. ఒక తల్లిగా నీ కొడుకుని నువ్వు ఎంత నిర్లక్ష్యంగా పెంచుతున్నావ్ అని కోప్పడతాడు. ‘తల్లిగా నువ్వే కాదు తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. ఆది విషయంలో జరగాల్సింది జరిగిపోయింది, నా కొడుకుని జైలు శిక్ష నుంచి కాపాడుకోవాలి’ అని యష్ అంటాడు.
వేద ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చెయ్యడానికి వస్తుంది. డాడీతో నువ్వు ఫైట్ చెయ్యకు తన కోసం మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండమని అడుగుతుంది. ఖుషి కోసం ఏమైనా చేస్తానని వేద చెప్పేసరికి తను చాలా సంతోషిస్తుంది. ఆదిత్య క్లాసులో తన ఫ్రెండ్స్ తో కారు డ్రైవ్ గురించి మాట్లాడతాడు. తనకి కారు డ్రైవింగ్ వచ్చని తోటి వాళ్ళు అనేసరికి ఆదిత్య కోపంగా రండి కారు డ్రైవింగ్ చేసి చూపిస్తానని అంటాడు. డ్రైవర్ దగ్గరకి వెళ్ళి కారు కీస్ ఇవ్వమని అడుగుతాడు. ఇవ్వనని అనేసరికి కారు కీస్ తీసుకుంటాడు. అదంతా వేద చూసి ఆదిత్య కారు డ్రైవ్ చేయకుండా అడ్డుపడుతుంది. కారు కీస్ ఇవ్వమని అడుగుతుంది. ఇవ్వను అని మొండిగా మాట్లాడతాడు. వేద బలవంతంగా ఆదిత్య చేతిలో నుంచి కారు తాళాలు తీసుకుంటుంది. ఇవ్వమని ఆదిత్య అడిగేసరికి లాగి పెట్టి చెంప మీద కొడుతుంది. దీంతో ఆదిత్య కోపంగా వెళ్ళిపోతాడు.
Also Read: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయిన సామ్రాట్- బేరాలు ఆడటంలో మాస్టర్స్ చేసిన తులసి
కారు డ్రైవర్ రాగానే వేద అతన్ని తిడుతుంది. ఇప్పుడు మీరు కొట్టిన చెంప దెబ్బ వాళ్ళ అమ్మ ఎప్పుడో కొట్టి ఉంటే ఈ పిల్లాడు ఇలా చెడిపోయి ఉండే వాడు కాదు మీ అమ్మకి ఇలా జరిగి ఉండేది కాదు. యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య బాబు అని చెప్తాడు.
తరువాయి భాగంలో..
వేద కోర్టులో కేసు విత్ డ్రా చేసుకోవచ్చా అని జడ్జిని అడుగుతుంది. అది విని యష్, మాళవిక షాక్ అవుతారు. ఎందుకు ఇలా అని లాయర్ ఝాన్సీ వేదని అడుగుతుంది. వేద మాత్రం ఎందుకు ఏంటి అని ఆడగొద్దు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ కేసు విత్ డ్రా చేసుకుంటానని చెప్తుంది.