Gruhalakshmi December 8th: తల గోడకేసి బాదుకున్న లాస్య, పట్టించుకోని నందు- హితబోధ చేసిన తులసి
లాస్య నిజస్వరూపం తెలియడంతో నందు తనని దూరం పెడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి ఇంటికి రావడంతో ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. తనని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అభి తల్లిని క్షమించమని అడుగుతాడు. గదిలో నందు, లాస్య గట్టిగా అరుచుకుంటూ పోట్లాడుకుంటారు.
నందు: భార్యాభర్తల బంధాన్ని దిగజారేలా చేశావ్, అందుకు ఫలితం నా ఫ్యామిలీ మాత్రమే కాదు నువ్వు కూడా అనుభవించాలి
లాస్య: అర్థం చేసుకో కేవలం ఇన్ సెక్యూరిటీ వల్లే ఇలా చేశాను
నందు: చివరి సారిగా మనం ఎప్పుడు పక్కన పక్కన కూర్చుని మాట్లాడుకున్నాం అది గుర్తుందా
లాస్య: మన రిలేషన్ లోనే కాదు తులసితో కూడా నువ్వు ఇదే గొడవ కదా మీరిద్దరు ఎప్పుడైనా ప్రశాంతంగా కలిసి ఉన్నారా. అయినా కూడా పాతికేళ్లు కలిసి కాపురం చేశారు, ఆ ఓపిక ఆ సహనం ఏమైపోయాయి తులసికొక రూల్ నాకొక రూలా
Also Read: మాధురి కేసులో ఊహించని ట్విస్ట్, నేరం చేసిందెవరో కనిపెట్టిన జానకి- మల్లిక చెంప పగలగొట్టిన జ్ఞానంబ
నందు: అవును, తులసితో పాతిక సంవత్సరాలు కలిసి ఉన్నా తాళి బంధం వల్ల, కానీ మనకి తాళి కంటే గొప్ప బంధం ఉంది అదే ప్రేమ బంధం. ప్రేమతో ముడి పడి ఉన్న బంధంలో చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద గాయం చేస్తాయి. ఇప్పటికీ మన బంధం తప్పుగానే అనుకుంటున్నారు కానీ పట్టించుకోవడం లేదు కారణం నాది స్వచ్చమైన ప్రేమ, నిన్ను ఎప్పుడు నేను హర్ట్ చెయ్యలేదు కానీ నువ్వు మాత్రం ఇంట్లో గొడవలు పెట్టి, నన్ను నా పిల్లల్ని ఏడిపించావ్, నా చెల్లిని దూరం చేశావ్
లాస్య: ఇల్లు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాను కదా అదంతా మర్చిపో
నందు: నీతో గొడవపడి అలిసిపోయాను, నా మనసు అర్థం చేసుకునేలా నిన్ను మార్చుకోలేకపోయాను. నీతో బంధాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నా కానీ సాధ్యం కావడం లేదు చాలా కష్టంగా ఉంది. మన ప్రేమ చచ్చిపోయింది, బంధం పగిలిపోయింది, మన మధ్య ఉంది కేవలం నిర్జీవమైన బంధం మాత్రమే
లాస్య: నీ మీద నాకు ప్రేమ ఉంది
నందు: తులసికి నేను ఎప్పుడు విలువ ఇచ్చే వాడిని కాదు కానీ గౌరవం ఉండేది కానీ మన మధ్య ప్రేమ లేదు గౌరవం లేదు. ఇక నుంచి నీ జీవితం నీది నా జీవితం నాది, లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం నాలుగు గోడల మధ్య కాదు
లాస్య ఎంతగా బతిమలాడినా కూడా నందు మాత్రం వినడు. మారడానికి గడువు ఇవ్వమని అడిగినా కూడ నందు జీవిత కాలం ఇచ్చినా మారవు అనేసరికి కోపంగా గదిలో ఉన్న వస్తువులు అన్ని పగలగొడుతూ ఉంటుంది. తన మాట వినకపోతే తల పగలగొట్టుకుంటా అని లాస్య బెదిరిస్తుంది. నందు వినకుండా వెళ్లిపోతుంటే లాస్య తల గోడకేసి బాదుకుటుంది. నందు వచ్చి మరింత రెచ్చగొట్టేసరికి ఇంకా లాస్య ఎక్కువ చేస్తుంటే తులసి ఆపేందుకు ట్రై చేస్తుంది. నందు మాత్రం తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
Also read: లాస్యతో తెగదెంపులు చేసుకున్న నందు- ఛాలెంజ్ లో గెలిచిన సామ్రాట్
తులసి లాస్య తలకి కట్టుకడుతుంది. తనకి మంచి మాటలు చెప్తుంది. భర్త కోపంలో ఉన్నప్పుడు తగ్గి సర్ది చెప్పుకోవాలి కానీ ఇలా చేయకూడదని అంటుంది. మీ మధ్య నుంచి తాను ఎప్పుడో వెళ్లిపోయానని మళ్ళీ లాగొద్దని తులసి చెప్తుంది. భర్త ప్రేమ పొందడానికి ప్రయత్నించమని సలహాలు ఇస్తుంది. ‘నందగోపాల్ కి నా మీద ప్రేమ లేదు తప్పదు కాబట్టి బతికారు, అందుకే తనకి దగ్గర కాలేకపోయాను. కానీ మీ పరిస్థితి అలా కాదు తనకి నువ్వంటే ప్రేమ. దగ్గర అవడానికి ట్రై చెయ్యిమని’ తులసి అంటుంది. ఎంత చూసినా నందు తన మాట వినలేదని అందుకే బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చిందని లాస్య చెప్తుంది.
తులసి నందుకి కూడా క్లాస్ పీకడానికి వస్తుంది. తన గొడవ తనే చూసుకుంటానని చెప్తాడు. 'నన్ను వదిలేశారు, పట్నం పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ తనని వదిలేస్తున్నారు. లాస్య కన్నీళ్ళు పెట్టుకుంటుంటే జాలిగా అనిపించింది, మీరిద్దరూ సంతోషంగా కలిసుంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. మీరు గొడవ పడితే వాళ్ళు కూడా బాధపడతారు. ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళని క్షమించండి' అని చెప్తుంది. లాస్య మీద ఒకప్పుడు ప్రేమ ఉండేది కానీ అది ఇప్పుడు లేదు పోయిందని నందు బాధగా చెప్తాడు.