Gruhalakshmi April 26th: 'ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలా' అంటూ నందుకి అవమానం- ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుపడిన రాజ్యలక్ష్మి
దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పూజ మొదలు పెడదామా అంటే తన పుట్టింటి వాళ్ళు ఇంకా రాలేదని దివ్య చెప్తుంది. పూజకి కూడా టైమ్ కి రాకపోతే ఎలా అని ప్రసన్న నోరు పారేసుకుంటుంది. పరవాలేదు వర్జ్యం వచ్చేలోపు దీపం వెలిగిస్తే పూజ కాస్త అటూ ఇటూగా మొదలు పెట్టవచ్చని పంతులు చెప్తాడు. దివ్యకి కనీసం అగ్గిపెట్టె వెలిగించడమే రాదని ప్రసన్న మళ్ళీ నోటికి పని చెప్తుంది. దివ్య దీపం వెలిగించేటప్పుడు తులసి వాళ్ళు వస్తారు. వాళ్ళని చూడగానే దివ్య ఏడుస్తూ వెళ్ళి కౌగలించుకుంటుంది. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది చూసి అత్తగారు ఏడిపించడం మొదలు పెట్టినట్టు ఉందని నందు అనుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ ఎవరైనా ఏమైనా అన్నారా అని నందు టెన్షన్ గా అడుగుతాడు. తనకి భయంగా ఉందని ఎక్కడికి వెళ్లొద్దని దివ్య ఏడుస్తూ తల్లిని అడుగుతుంది.
Also Read: కృష్ణ తలకి గన్ గురిపెట్టిన భవానీ- మురారీ బాధ తీరే దారి లేదా?
పూజ పనులు సరిగా చేయలేకపోతున్నా అందరినీ ఇబ్బంది పెడుతున్నా నా వల్ల కావడం లేదు నేను కోడలిగా పనికిరానా అని ఏడుస్తూ అడుగుతుంది. ఎవరికైనా కొత్తలో ఇలాగే ఉంటుందని తాతయ్య వాళ్ళు చెప్తారు. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు కదా అలా ఏడవకూడదని దివ్యకి సర్ది చెప్తుంది. రాజ్యలక్ష్మి వచ్చి ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది. వాళ్ళ ముందు దివ్యమీద కపట ప్రేమ నటిస్తుంది. కోడలు వచ్చిన తర్వాత అమ్మ నా గురించి పట్టించుకోవడమే మానేసిందని విక్రమ్ అంటాడు. నందు కోపంగా ఉంటుంటే ప్రియ వద్దని సైగ చేస్తుంది. మా అమ్మ నీడలో ఉంటే దేవత నీడలో ఉన్నట్టేనని విక్రమ్ చెప్తాడు. తండ్రిని పట్టుకుని దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పూజ మొదలవుతుంది. మధ్య మధ్యలో బసవయ్య నసుగుతూ ఉంటాడు. దివ్య దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేస్తారు.
Also Read: మనసుల్ని మెలిపెట్టేస్తున్న యష్ గుండె లోతుల్లోని బాధ- వేదకి నిజం చెప్పిన విన్నీ
పూజ పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. దివ్య తులసి వాళ్ళ వైపు వస్తే విక్రమ్ తల్లి వైపు వెళతాడు. ఇక్కడ అందరి కంటే మా నానమ్మ, తాతయ్య పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని చెప్తుంది. దీంతో విక్రమ్ దివ్య వెనుకాలే వెళతాడు. అది చూసి రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. నందు, తులసి పక్క పక్కన ఉంటే విక్రమ్ ఆశీర్వాదం తీసుకోబోతుంటే ప్రసన్న అడ్డు పడుతుంది. వాళ్ళు భార్యాభర్తలు కాదు కదా ఆలోచించవద్దా అనేస్తుంది. మీరు ఏంటి పర్మినెంట్ గా మొగుడు పెళ్ళాల్లాగా ప్రవర్తిస్తున్నారు జంటగా మా వాళ్ళని దీవిస్తున్నారు. పద్ధతి లేదా అని అడుగుతుంది. మీరు తాళి కట్టిన పెళ్ళాం ఏది ఈవిడతో షికార్లు కొడుతున్నారని బసవయ్య అంటాడు. మేము కూతురు ఇంటికి వచ్చామని తులసి అంటుంది. ఇంట్లో లాస్య పెళ్ళాం, ఇక్కడ తులసి మీ జంట అంటే ఎలా కుదురుతుందని ప్రసన్న దెప్పి పొడుస్తుంది. అన్నీ తెలిసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని విక్రమ్ అడుగుతాడు. లేని పోనీ వాదన పెట్టుకుని గొడవ పెట్టొద్దు అమ్మ డెసిషన్ ఫైనల్ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిన బాధ్యత తనకుందని అంటాడు. మీ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తానని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. వ్రతం పూర్తయింది కాబట్టి మొదటి రాత్రి జరిపిద్దామని రాజ్యలక్ష్మి అంటుంది. మంచి ముహూర్తం రెండు వారాల తర్వాత ఉందని పంతులు చెప్తాడు.