Pakka Commercial: 'పక్కా కమర్షియల్' ట్రైలర్ - ఆడియన్స్ కు మాస్ ట్రీట్
గోపీచంద్ నటిస్తోన్న 'పక్కా కమర్షియల్' సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
జూలై1, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలను, టీజర్ ను వదిలింది. ఇప్పుడేమో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు. ఎలాంటి తప్పు చేసినవాడికైనా.. కోర్టులో శిక్ష పడకుండా చూస్తుంటాడు హీరో. న్యాయాన్ని కాపాడుకోవడానికి కన్న కొడుక్కే(గోపీచంద్) ఎదురు తిరిగి పోరాటం చేస్తుంటాడు తండ్రి(సత్యరాజ్). వీరిద్దరి మధ్య పోరుని సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ లో హీరో 'సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా.. విలన్..' అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ కి ఇది మంచి ట్రీట్ అనే చెప్పారు.
ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. గోపీచంద్ ను చాలా స్టైలిష్ గా ప్రెజంట్ చేస్తున్నారు. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?
View this post on Instagram