Ram Prasad Gets Emotional: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
'సుడిగాలి' సుధీర్ అంటే 'ఆటో' రామ్ ప్రసాద్, 'గెటప్' శ్రీను గుర్తొస్తారు. ముగ్గురు కలిసి స్కిట్స్ చేసేవారు. ఇప్పుడు సుధీర్, శ్రీను విడిపోవడంతో ఆటో రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
'ఎక్స్ట్రా జబర్దస్త్' కార్యక్రమంలో విజయవంతమైన టీమ్స్‌లో 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) టీమ్ ఒకటి. సుధీర్ టీమ్ అతను ఒక్కడే కాదు... 'ఆటో' రామ్ ప్రసాద్ (Auto Ram Prasad), 'గెటప్' శ్రీను (Getup Srinu) కూడా గుర్తు వస్తారు. ఇన్నాళ్ళూ ముగ్గురు కలిసి స్కిట్స్ చేశారు. ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'ను సుధీర్, శ్రీను వదిలేసిన సంగతి తెలిసిందే.
సుధీర్, శ్రీను వెళ్లడంతో 'ఆటో' రామ్ ప్రసాద్ ఒక్కరే స్కిట్స్ చేస్తున్నారు. అసలు, వాళ్ళిద్దరూ ఎందుకు 'ఎక్స్ట్రా జబర్దస్త్' వదిలేశారనేది శుక్రవారం ఎపిసోడ్‌లో 'రాకింగ్' రాకేష్ స్కిట్‌లో చూపించారు. ఆ తర్వాత స్టేజి మీద మాట్లాడిన రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
''నేను ఎప్పుడూ ఏడవలేదు. 'జబర్దస్త్'కు వచ్చిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఎన్నో షోస్ చేశా. అందరూ ఏడుస్తూ ఉంటారు. నాకు ఏడుపు వచ్చినా ఆపేసుకుంటా. ఆ కెపాసిటీ నాకు ఉంది కూడా! మనసుకు సర్ది చెప్పుకొంటా... 'నేను రైటర్‌ను. నాకేంటి? రాసేసి, చేసేస్తా' అని! కానీ, తెలియకుండా ఒంటరి అనే ఫీలింగ్ వచ్చింది. అందరూ 'ఒకే కంచం ఒకే మంచం' అని అంటారు కదా. అది మాట వరకూ వాడతారు. నిజంగా చెబుతున్నా... మేం ఒకే కంచంలో భోజనం చేసి, ఒకే మంచంలో నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా ఆ సంతృప్తి ఉండటం లేదు'' అని 'ఆటో' రామ్ ప్రసాద్ అన్నారు.
''పెన్ను కదలడం లేదు బావా'' అని సుధీర్, శ్రీనును తలుచుకుని ఎమోషనల్ అయ్యారు రామ్ ప్రసాద్. ఆయన ఇంకా మాట్లాడుతూ ''వాళ్ళిద్దరూ ఉంటే ధైర్యంగా పక్కకి వెళ్లి అరగంటలో స్కిట్ రాసుకుని వచ్చేవాడిని. ఇప్పుడు రెండు మూడు రోజులు ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. ఎందుకంటే... లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. దీన్ని మిస్ అవ్వకూడదు'' అని చెప్పారు. కచ్చితం సుధీర్, శ్రీను 'జబర్దస్త్'కు తిరిగి వస్తారని రష్మీ గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ... వాళ్ళ మనసంతా 'జబర్దస్త్' స్టేజి చుట్టూ తిరుగుతాయని ఆమె అన్నారు.
Also Read: జన గణ మన రివ్యూ: థ్రిల్ చేస్తూనే ఆలోచింపజేసే సినిమా
'సుడిగాలి' సుధీర్ టీమ్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఆ తర్వాత జర్నీ ఎలా సాగింది? ఎందుకు దూరం అయ్యారు? అనేది చూపించారు. సినిమా అవకాశం రావడంతో మూడు నెలలు 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు దూరం అయినట్టు... ఆ తర్వాత సుధీర్ కూడా బ్రేక్ ఇస్తానని చెప్పినట్టు 'రాకింగ్' రాకేష్ స్కిట్‌లో చూపించారు.
Also Read: చీకటిని వణికించే అస్త్రం, వెయ్యి నందుల బలం - 'బ్రహ్మాస్త్ర'లో అనీష్ శెట్టిగా కింగ్ నాగార్జున
View this post on Instagram