
Nayanthara Tirumala Controversy: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?
తిరుమలలో నయనతార చెప్పులు వేసుకుని తిరగడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె భర్త విఘ్నేష్ శివన్ క్షమాపణలు కోరుతూ ఒక లేఖ విడుదల చేశారు.

కొత్త జంట నయనతార - విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan Wedding) చిక్కుల్లో పడ్డారు. తిరుమల మాడ వీధుల్లో నయన్ చెప్పులు వేసుకుని తిరగడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పైగా, ఏడు కొండల వేంకటేశ్వర సన్నిధిలో ఫొటోషూట్ చేయడంపైనా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ శివన్ ఒక లేఖ విడుదల చేశారు. తాము తెలియక చేసిన తప్పును క్షమించాలని ఆయన కోరారు. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
''మేం తిరుమలలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అయితే, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మహాబలిపురంలో మా వివాహం జరిగింది. పెళ్ళైన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా మండపం నుంచి నేరుగా తిరుపతి వచ్చాం... స్వామి కళ్యాణం చూసి ఆశీర్వాదం తీసుకోవాలని. స్వామి అంటే మాకు ఎంతో భక్తి. దర్శనం బాగా జరిగింది. ఇది మాకు జీవితాంతం గుర్తు ఉండాలని ఒక ఫొటో తీసుకోవాలని అనుకున్నాం. అయితే... జన సందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి మళ్లీ రావాల్సి వచ్చింది. అప్పుడు ఫొటో తీసుకోవాలనే తొందరలో మా కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తించలేదు. మా జంటకు భగవంతునిపై విపరీతమైన భక్తి ఉంది. గత 30 రోజుల్లో ఐదుసార్లు స్వామి సన్నిధికి వచ్చి వెళ్లాం'' అని విఘ్నేష్ శివన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Also Read: నయనతార దంపతులపై టీటీడీ సీరియస్, ఫొటో షూట్, చెప్పులతో నడవడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు
''మేం ఎంతగానో ఆరాధించే భగవంతుని అగౌరవ పరచాలని మేం అనుకోలేదు. తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరుతున్నాం'' అని విఘ్నేష్ శివన్ కోరారు. తమపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. పాజిటివిటీ చూపించాలని కోరారు.
Also Read: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

