Mahesh Babu Prabhas: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్
స్టార్ హీరోస్ డేట్స్ కోసం చాలా మంది తిరిగే రోజులు ఇవి. ఈ తరుణంలో మహేష్ - ప్రభాస్ డేట్స్ ఇచ్చినా సినిమా చేయనని ఒకరు అంటున్నారు. ఆయన ఎవరు? ఏమైంది?
![Mahesh Babu Prabhas: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్ Mahesh Babu Prabhas multi starrer Tollywood top producer says no to Mahesh Prabhas movie comments went viral Mahesh Babu Prabhas: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/11/9afe0f33431699fea9cfa357ce83567a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ఇద్దరూ ఇద్దరే. తెలుగులో మాత్రమే కాదు... ఉత్తరాదిలోనూ ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే? ఆ ఊహ ఎంత బావుందో కదూ! ఒకవేళ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేసినా... ఆ సినిమా తాను చేయనని నిర్మాత ఎంఎస్ రాజు స్పష్టం చేశారు.
మహేష్ బాబుకు 'ఒక్కడు', ప్రభాస్‌కు 'వర్షం' వంటి భారీ విజయాలను ఎంఎస్ రాజు అందించారు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ అని చెప్పాలి. అప్పటికి ఆయా హీరోల కెరీర్‌లో భారీ విజయాలుగా నిలిచాయి. అయితే, ప్రభాస్ 'వర్షం' ఆయనకు తీరని నష్టాల్ని మిగిల్చింది అనుకోండి. ఒకప్పుడు భారీ సినిమాలు తీసిన ఎంఎస్ రాజు... ఇప్పుడు 'డర్టీ హరి', '7 డేస్ 6 నైట్స్', 'సతి' వంటి చిన్న సినిమాలు తీస్తున్నారు. మళ్ళీ భారీ సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడతారా? అనే ప్రశ్న ఇటీవల ఎంఎస్ రాజుకు ఎదురైంది.
''మహేష్, ప్రభాస్ కలిసి సినిమా చేసినా నేను చేయను. ఇప్పటివరకు నా జీవితంలో నేను అనుకున్న విధంగా సినిమాలు తీశా. అలాగే, తీస్తా'' అని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. తాను కాంబినేషన్‌పై నమ్మకంతో కాకుండా కథను నమ్ముకుని సినిమాలు తీశానని... భవిష్యత్తులోనూ అలాగే చేస్తానని చెప్పారు. ఎవరినీ డేట్స్ అడగనని చెప్పారు. భారీ చిత్రాలు తీసే నిర్మాతలు ఎంత మంది హ్యాపీగా ఉన్నారని ప్రశ్నించారు.
Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?
ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్' సినిమా జూన్ 24న విడుదల అవుతోంది.
Also Read: నయనతార దంపతులపై టీటీడీ సీరియస్, ఫొటో షూట్, చెప్పులతో నడవడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)