Godfather OTT Release: 'గాడ్ ఫాదర్' OTT రిలీజ్ డేట్ వచ్చేసింది , స్ట్రీమింగ్ అప్పటినుంచే ?
'గాడ్ ఫాదర్' ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. త్వరలోనే సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాకు ఈ సినిమా రీమేక్. మలయాళం లో మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి పోషించారు. ఈ సినిమా ఆక్టోబర్ 5 న విడుదల అయి ఇక్కడ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు హిందీ లోనూ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో మూవీ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ' గాడ్ ఫాదర్' సినిమా స్ట్రీమింగ్ డేట్ ను కూడ లాక్ చేసినట్లుగా సమాచారం. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్ ను ఓటీటీ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే సినిమా విడుదలైన సమయంలో ఓటీటీ నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగానే గాడ్ ఫాదర్ సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తోందట నెట్ ఫ్లిక్స్ సంస్థ.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నెగిటివ్ ఫలితం తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేయగా రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వాటికి మూవీ టీమ్ కూడా సమాధానం చెప్పింది. ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉన్నా కూడా తాము ఈ సినిమా చేశామని, సినిమా చేయాలనే ఉద్దేశంతోనే చేశామని తమకు కలెక్షన్స్ ప్రధానం కాదు అని సినిమా నిర్మాత కూడా చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.
ఈ సినిమాలో చిరంజీవి తో పాటు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. సత్యదేవ్ విలన్ పాత్రలో మెప్పించారు. అలాగే నయనతార, సునీల్, షఫీ, సముద్ర ఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి 'లూసిఫర్' సినిమా తో పోలుస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేశారు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత సినిమాకు మంచి స్పందన రావడంతో హిట్ టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు మోహన్ రాజా మలయాళం 'లూసిఫర్' నుంచి పాత్రలను తీసుకున్నా సినిమా మూల కథను మార్చి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు తీయడంతో సినిమా మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి నెట్ ఫ్లిక్స్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.