అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘దేవర 2’ అప్‌డేట్, ‘మట్కా’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ‘దేవర 2’ అప్‌డేట్ నుంచి మట్కా టీజర్ రిలీజ్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర 2’ అప్‌డేట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ టీజర్ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఓజీ కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని సంగీత దర్శకుడు థమన్ అన్నారు. కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా నుంచి ‘మాస్ జాతర’ అనే సాంగ్ రిలీజ్ అయింది. రజనీకాంత్ సర్జరీ గురించి తమకు ముందే సమాచారం ఉందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ అన్నారు.

‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే?
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా కనీవినీ ఎరుగని అంచనాలతో గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. తొలి మూడు రోజుల్లో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. వీక్ డేస్‌లో కాస్త తగ్గినా, మళ్లీ పుంజుకున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా అనుకున్నట్లుగా ఆడుతోంది. 7 రోజుల్లో రూ.405 కోట్లు సాధించింది. ఎన్టీఆర్ ‘దేవర 2’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ది అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర 2’ ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు. “‘దేవర‘ పార్ట్ 1 బాగా ఆడుతున్నది. అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటున్నది. ‘దేవర 2‘ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. తొలి భాగంతో పోల్చితే రెండో భాగం బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది. ‘దేవర‘2 కోసం దర్శకుడు అద్భుతమైన స్టోరీ ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ అంచనాలకు మించి ఉంటుంది. ‘దేవర 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వరుణ్ తేజ్ 'మట్కా' టీజర్ హైలెట్స్ ఇవే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మట్కా'. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి మెగా ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుండగా... ముందుగా చెప్పినట్టుగా ఈ రోజు టీజర్ లాంచ్ చేశారు. వరుణ్ తేజ్ 'మట్కా' చిత్రానికి 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘క’ నుంచి ‘మాస్‌ జాతర’
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ స‌స్పెన్స్  థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  కిరణ్ తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ‘మాస్‌ జాతర’ అనే పాటను విడుదల చేశారు. ‘ఆడు ఆడు ఆడు..’ అంటూ దుమ్మురేపుతోంది. సామ్‌ సీ సంగీతాన్నందించిన ఈ పాట హుషారెత్తించే బీట్‌ తో ఆకట్టుకుంటోంది. సినిమాపై ఈ సాంగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచుతోంది.  పూర్తి పాటను ఇవాళ సాయంత్రం 7 గంటల 29 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్...
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా హాస్పిటల్లో  చేరారు. గుండె సంబంధ శస్త్రచికిత్స తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. సర్జరీ గురించి 40 రోజుల క్రితమే తనకు చెప్పారని వెల్లడించారు. “రజనీకాంత్ సర్ ప్రస్తతం క్షేమంగా ఉన్నారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాను. 40 రోజుల క్రితమే ఈ విషయం గురించి చెప్పారు. తనకు సర్జరీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి సీరియస్ నెస్ లేదు. దయచేసి పుకార్లను ప్రచారం చేయకూడదని వేడుకుంటున్నాను. అసత్య ప్రచారాల కారణంగా ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. మాలో నిరాశ కలుగుతుంది” అని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి
గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఆగిపోయిన తన సినిమాల షూటింగ్లను తిరిగి మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే 'ఓజి' మూవీ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక 'హరిహర వీరమల్లు' కంటే 'ఓజి' మూవీ అప్డేట్స్ కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన అప్డేట్ మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget