OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Pawan Kalyan OG: యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ తాజాగా మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచే అప్డేట్ ఇచ్చారు. ఇండస్ట్రి హిట్ అంటూ ఆయన 'ఓజీ' మూవీ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీసెంట్‌గా ఆగిపోయిన తన సినిమాల షూటింగ్లను తిరిగి మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే 'ఓజి' మూవీ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక 'హరిహర వీరమల్లు' కంటే 'ఓజి' మూవీ అప్డేట్స్ కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన అప్డేట్ మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. మరి తమన్ ఇచ్చిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
'ఓజి' ఇండస్ట్రీ హిట్ అంటున్న తమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజి'. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఓజాస్ గంభీర అని అందుకే ఈ సినిమాకు 'ఓజీ' అనే టైటిల్ పెట్టామని ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్ కి లింక్ ఉంటుందని కూడా ఆయన గతంలోనే చెప్పి సినిమాపై అంచనాలు పెంచారు. 'ఓజి' మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా 'ఓజీ' గురించి అప్డేట్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
All Asking About #Og Updates Guys !!
— thaman S (@MusicThaman) October 4, 2024
Will give U all Soon . As we are on progress !!
Will Be A SURE SHOT 💥🔥
BLOCKBUSTER INDUSTRY HIT FROM US !! #Sujeeth HAS SMOKED IT OUT !! 🎥 🔫💣⚔️🗡️@dop007 ⛏️ Axed It OUT
I will give NOW #OG 💥💥🔥🔥🔥🔥🔥🏆🏆🏆🏆🏆🧨🧨
IT WILL…
ఆయన తన ట్వీట్ లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి.. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేసాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా 'ఓజీ'కి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్ ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి.. అప్డేట్స్ తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తమన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ 'ఆయన తన సింహాసనం పైకి తిరిగి వస్తున్నాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అప్డేట్స్ తో అదరగొడుతున్న తమన్
తమన్ తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాలకు సంబంధించి చిత్ర బృందం కంటే ముందే తమన్ వరుసగా అప్డేట్స్ ఇస్తుండడం విశేషం. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు తమన్. ఇక ఇప్పుడు 'ఓజీ' అప్డేట్స్ అడుగుతున్నారు అంటూ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ చేసి మళ్లీ ట్రెండ్ లోకి వచ్చారు తమన్.
Read Also : VD12 Movie: సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్