అన్వేషించండి

VD12 Movie: సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్

విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ సెట్స్ లో ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. షూటింగ్ కోసం తీసుకొచ్చిన ఏనుగులు కొట్లాడుకోవడంతో షూటింగ్ ను క్యాన్సిల్ అయ్యింది.

VD12 Movie Shooting: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. విజయ్ కెరీర్ లో 12వ చిత్రంగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని భూతత్తాన్ కెట్టులో నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఏనుగులతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. కాసేపు రెండు ఏనుగులు పోట్లాడాయి. పుదుపల్లి సాధు అనే ఏనుగుకు గాయాలు కావడంతో  తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. నిన్న సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, ఇప్పటి వరకు ఏనుగు ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి అంతా ఏనుగు కోసం అటవీశాఖ అధికారులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఏనుగు గాయపడిన నేపథ్యంలో ఎక్కువ దూరం వెళ్లి ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ మంది అటవీ సిబ్బందితో ఏనుగును వెతుకుతున్నారు.  

ఏనుగుల కొట్లాటతో సినిమా షూటింగ్ వాయిదా

నిజానికి ఈ సినిమా షూటింగ్ కోసం ఐదు ఏనుగులను తీసుకొచ్చారు. వాటిలో మూడు ఆడ ఏనుగులు కాగా, రెండు మగ ఏనుగులు ఉన్నాయి. గత వారం రోజులుగా ఏనుగులతో సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తాజాగా ఏనుగుల మధ్య గొడవ జరగడం, ఓ ఏనుగు అడవిలోకి పారిపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారు. అటు మిగతా ఏనుగులను అక్కడి నుంచి వాహనాల్లో తీసుకెళ్లారు. తప్పిపోయిన ఏనుగు దొరికే వరకు సినిమా షూటింగ్ నిలిపివేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 

Read Also:విజయ్ 69వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ప్రేమలు బ్యూటీ మంచి ఆఫరే పట్టిందిగా

VD 12 మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్న రౌడీ బాయ్   

VD 12 సినిమాను గౌతమ్ తిన్ననూరి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కెరీర్ లో ఖాకీ పాత్ర చేయడం ఇదే తొలిసారి. శ్రీలీల, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన అర్జునుడి పాత్ర పోషించారు. కనిపించింది కాసేపే అయినా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆయన హీరోగా చివరగా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో కనిపించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకు ముందు నటించి ‘ఖుషీ’ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. ఈ నేపథ్యంలో VD12 మూవీపై రౌడీ బాయ్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు.

Read Also: దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Prithviraj Sukumaran: 'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
Embed widget