అన్వేషించండి

Devara 2: ‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే? అసలు విషయం చెప్పేసిన ఎన్టీఆర్

Devara 2 Movie: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘దేవర‘ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ‘దేవర 2’ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కీలక విషయాలు చెప్పారు.

NTR About Devara 2: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా కనీవినీ ఎరుగని అంచనాలతో గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. తొలి మూడు రోజుల్లో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. వీక్ డేస్‌లో కాస్త తగ్గినా, మళ్లీ పుంజుకున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా అనుకున్నట్లుగా ఆడుతోంది. 7 రోజుల్లో రూ.405 కోట్లు సాధించింది.

‘దేవర 2’పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘దేవర’ సినిమాకు అద్భుత స్పందన లభించిన నేనథ్యంలో ‘దేవర 2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ‘దేవర 2’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ది అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర 2’ ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు. “‘దేవర‘ పార్ట్ 1 బాగా ఆడుతున్నది. అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటున్నది. ‘దేవర 2‘ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. తొలి భాగంతో పోల్చితే రెండో భాగం బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది. ‘దేవర‘2 కోసం దర్శకుడు అద్భుతమైన స్టోరీ ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ అంచనాలకు మించి ఉంటుంది. ‘దేవర 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. మరోవైపు దర్శకుడు కొరటాలపై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.  ‘బృందావనం’ మూవీతో తమ ప్రయాణం మొదలైందన్న ఆయన, తన ఫ్యామిలీలో ఒకరు అయ్యారని చెప్పుకొచ్చారు. ‘దేవర’ సినిమాతో తనతో మరింత సాన్నిహిత్యం పెరిగిందన్నారు.  

ఇంతకీ ‘దేవర 2’ వచ్చేది ఎప్పుడు?

‘దేవర’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అభిమానుల చూపు ‘దేవర’2 మీద పడింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అయితే, ‘దేవర 2’ ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకోవాలనే ఆలోచనలో ఎన్టీఆర్, కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కొంత షూటింగ్ పూర్తైంది. మరోవైపు ‘కేజీఎఫ్’ దర్వకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు ‘దేవర 2’ ప్రారంభం అయ్యేది కష్టమే. మొత్తంగా ఈ సినిమా 2026 తర్వాత సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో కొరటాల కూడా మరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ 2027 చివరలో లేదంటే 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాపై మేకర్స్ నుంచి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

Read Also: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి

టాప్ హెడ్ లైన్స్

Modha Rathri OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Godavari Serial Today September 16th: 'గోదావరి' సీరియల్: పెళ్లి చేసుకుంటానని షాక్ ఇచ్చిన సంజు! గుడిలో సూర్య దీనస్థితి! కుమిలి కుమిలి ఏడుస్తున్న జాను!
'గోదావరి' సీరియల్: పెళ్లి చేసుకుంటానని షాక్ ఇచ్చిన సంజు! గుడిలో సూర్య దీనస్థితి! కుమిలి కుమిలి ఏడుస్తున్న జాను!
Fauzi Release Update: జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?
జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?
Nindu Manasulu Serial Today September 16th: నిండు మనసులు: మీ నాన్న చావుకి కారణం ఈ దుర్మార్గుడే.. నిజం చెప్పేసిన రాజశేఖరం! ప్రేరణకు దిమ్మతిరిగే షాక్!
నిండు మనసులు: మీ నాన్న చావుకి కారణం ఈ దుర్మార్గుడే.. నిజం చెప్పేసిన రాజశేఖరం! ప్రేరణకు దిమ్మతిరిగే షాక్!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
Embed widget