అన్వేషించండి

Matka Teaser: వరుణ్ తేజ్ 'మట్కా' టీజర్... హైలెట్స్ ఇవే - మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే, అదిరిందంతే!

Varun Tej Matka Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మట్కా'. ఈ రోజు టీజర్ రిలీజ్ చేశారు. మరి, అందులో ఉన్న హైలెట్స్ ఎంటో చూసేద్దాం పదండి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మట్కా' (Matka Movie). ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి మెగా ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుండగా... ముందుగా చెప్పినట్టుగా ఈ రోజు టీజర్ లాంచ్ చేశారు. మరి, ఈ టీజర్ విశేషాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

పూనకాలు తెప్పిస్తున్న 'మట్కా' టీజర్ 
వరుణ్ తేజ్ 'మట్కా' చిత్రానికి 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'మట్కా' మూవీలో కథకు అనుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో వరుణ్ తేజ్  కనిపించబోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం 1980 బ్యాక్ గ్రౌండ్ లో వైజాగ్ లొకేషన్స్ ను రీ క్రియేట్ చేశారు. ఇటీవల ఆ సెట్స్‌లో వరుణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ వార్తల వల్ల ఇప్పటికే సినిమాపై మంచి బజ్ నెలకొంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక అందులో భాగంగానే సినిమా ప్రమోషన్లను షురూ చేశారు. టీజర్ తో ముందుగా ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. టీజర్ ఎలా ఉందో ఇక్కడ చూడండి... వరుణ్ తేజ్ గెటప్స్‌తో పాటు ఆ లుక్స్, ఆ విజువల్స్‌ అప్పట్లో విశాఖ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయి.

ఈ రోజు (అక్టోబర్ 5న) విజయవాడలోని యువరాజ్ సెంటర్ లో ఉన్న జీ3 థియేటర్లో మట్కా మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఇక చెప్పినట్టుగానే వరుణ్ ఈ రోజు మధ్యాహ్నమే ఈ ఈవెంట్ కోసం విజయవాడ చేరుకున్నారు. చిత్రబృందం అంతా కలిసి తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా, అది సినిమాపై సూపర్ హైప్ లు క్రియేట్ చేస్తోంది. వరుణ్ తేజ్ ను సరికొత్త అవతారంలో చూపించడమే కాకుండా ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్‌లో నెవర్ బిఫోర్ వరుణ్ లుక్స్, అదిరిపోయే డైలాగులు, దుమ్మురేపే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. టీజర్ ను  చూస్తుంటే సినిమా హిట్ అవ్వడం పక్కా అనిపించేలా ఉంది. మొత్తానికి మెగా ప్రిన్స్ కి కరుణ కుమార్ హిట్ ఇవ్వబోతున్నాడు అంటూ టీజర్ చూసిన మెగా ఫాన్స్ సంబరపడుతున్నారు. ఏదైతేనేం ఒక్కసారిగా 'మట్కా' టీజర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. మరి ఈ మూవీ తోనైనా వరుణ్ ఖాతాలో ఫస్ట్ ఫ్యాన్ ఇండియా హిట్ పడుతుందేమో చూడాలి.

Also Read: సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్

ఫస్ట్ పాన్ ఇండియా హిట్ పక్కానా?
వరుణ్ తేజ్ గత చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'తో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి 'మాట్కా' మూవీతో మరోసారి పాన్ ఇండియా లక్ ను పరీక్షించుకోబోతున్నారు వరుణ్. మరి ఈ 'మట్కా' కింగ్ వరుణ్ ను బాక్స్ ఆఫీస్ కింగ్ అన్పిస్తాడా అనేది తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు.    

Read Also:విజయ్ 69వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ప్రేమలు బ్యూటీ మంచి ఆఫరే పట్టిందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget