Viral videos: క్లాస్ రూమ్‌లో విద్యార్థిని పెళ్లాడిన ప్రొఫెసర్ - అంతా సైకాలజీ ప్రాక్టికల్స్ అట - నమ్మేద్దామా ?
Marriage in the classroom: బెంగాల్‌లో క్లాస్ రూమ్‌లోనే విద్యార్థిని పెళ్లి చేసుకున్న ప్రొఫెసర్ వీడియో వైరల్ అయింది. అది నిజమైన పెళ్లికాదని.. తన క్లాసులో భాగమని ఆమె అంటున్నారు.

Viral videos show female prof getting married to student in classroom : బెంగాల్ లోని మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీలోని ఓ క్లాస్ రూమ్‌లో విద్యార్థిని ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ ఇదేమీ చోద్యం అని నోళ్లు నొక్కుకున్నారు.
ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ టీచర్ ను ఇక క్లాసులకు రావొద్దని చెప్పారు. మళ్లీ ఎప్పుడు రావాలో తాము చెబుతామని యూనివర్శిటీ ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆదేశించారు. ఆ విద్యార్థిని కూడా తదుపరి విచారణ పూర్తయ్యే వరకూ క్లాసులకు హాజరు కావొద్దని చెప్పారు.
Viral videos of a senior female professor getting "married" to a student in the classroom at a state-run university in #WestBengal triggered a furore, following which an inquiry was ordered on Wednesday, officials said.
— Hate Detector 🔍 (@HateDetectors) January 30, 2025
The professor claimed that it was a drama that was part of… pic.twitter.com/r81Unz6pVU
అయితే ఆ వీడియో పూర్తిగా సైకాలజీ క్లాసుకు సంబంధించిన అంశమని.. అది నిజమైన పెళ్లి కాదని ఆ టీచర్ చెబుతున్నారు. ఆ మహిళా ప్రొఫెసర్ సైకాలజీనే బోధిస్తారు. పెళ్లి అంశంపై ఆమె మనుషుల సైకాలజీని విశ్లేషిస్తున్నప్పుడు ఇలా ప్రాక్టికల్ గా ఓ విద్యార్థితో చేసి చూపించారని తెలిపారు. మరి ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందంటే.. కాలేజీ రికార్డుల కోసమేనని ఆ టీచర్ చెబుతున్నారు.
కాలేజీ రికార్డుల కోసం తీసిన వీడియోను కొంత మంది విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారని అంటున్నారు. ఈ అంశంపై విద్యార్థి కూడా అదే చెబుతున్నారు.
पश्चिम बंगाल : छात्र और प्रोफेसर ने नाटक के रूप में क्लासरूम में रचाई शादी
— News24 (@news24tvchannel) January 30, 2025
◆ मामला हरिंगहाटा में मौलाना अबुल कलाम आज़ाद यूनिवर्सिटी ऑफ टेक्नोलॉजी (MAKAUT) का है
◆ प्रोफेसर ने कहा, "यह सब नाटक था, जिसे क्लास के हिस्से के तौर पर किया गया" #WestBengal | West Bengal pic.twitter.com/NN2FtIBjm1
ఆ విద్యార్థి డిగ్రీ ఫస్టియర్ లో ఉన్నారు. ఇంకా మైనార్టీ కూడా తీరలేదని తెలుస్తోంది. ఆ టీచర్ వయసు ఆ విద్యార్థి కన్నా చాలా పెద్దది. ఇరువులు పెళ్లి చేసుకోవాలన్నంత సన్నహితంగా లేరని.. కేవలం సైకాలజీ పాఠాల్లో భాగంగానే అలా చేశారని ఇతర విద్యార్థులు చెబుతున్ననట్లుగా తెలుస్తోంది.
మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ ప్రభుత్వరంగంలోనిది కావడంతో.. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత అసలు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: భద్రత కారణాలతో కుంభమేళా నుంచి వెళ్లిపోయిన మోనాలిసా - తీవ్ర ఇబ్బందులకు గురయ్యానంటూ వీడియో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

