అన్వేషించండి

Lokesh Kanagaraj: 40 రోజులు ముందే సర్జరీ గురించి చెప్పిన రజనీకాంత్... పుకార్లకు చెక్ పెట్టిన కూలీ దర్శకుడు లోకేష్

రజనీకాంత్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను దర్శకుడు లోకేషన్ కనగరాజ్ ఖండించారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలో మళ్లీ ‘కూలీ‘ షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Lokesh Kanagaraj About Rajinikanth’s Health: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా హాస్పిటల్లో  చేరారు. గుండె సంబంధ శస్త్రచికిత్స తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంటారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు.  మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆయన ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ కాలేదని చెప్పారు. ఈ సర్జరీ గురించి 40 రోజుల క్రితమే తనకు చెప్పారని వెల్లడించారు. “రజనీకాంత్ సర్ ప్రస్తతం క్షేమంగా ఉన్నారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాను. 40 రోజుల క్రితమే ఈ విషయం గురించి చెప్పారు. తనకు సర్జరీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి సీరియస్ నెస్ లేదు. దయచేసి పుకార్లను ప్రచారం చేయకూడదని వేడుకుంటున్నాను. అసత్య ప్రచారాల కారణంగా ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. మాలో నిరాశ కలుగుతుంది” అని చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 10 నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభం

అటు ‘కూలీ’ షూట్ ప్లాన్స్ గురించి లోకేష్ కగనరాజ్ కీలక విషయాలు వెల్లడించారు. వైజాగ్ షూట్ లో సెప్టెంబర్ 28 వరకు రజనీకాంత్ సీన్లు కంప్లీట్ అయినట్లు చెప్పారు. సర్జరీ తర్వాత రజనీకాంత్ మూడు వారాల పాటు రెస్ట్ తీసుకుంటారని చెప్పారు. దసరా తర్వాత నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. “ వైజాగ్ షూట్ లో సెప్టెంబర్ 28న  రజినీకాంత్ సర్  సన్నివేశాలు పూర్తయ్యాయి. నాగార్జున పోర్షన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఓ 10 రోజుల పాటు విరామం తీసుకుంటున్నాం. మళ్లీ అక్టోబర్ 10న షూటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరుగుతుంది” అని లోకేష్ వెల్లడించారు.  

‘కూలీ’ మూవీ గురించి..

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కొద్ది రోజుల రెస్ట్ తర్వాత  ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈలోగా మిగతా నటీనటులకు సంబంధించిన సీన్లను కంప్లీట్ చేయనున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ లో రజనీకాంత్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో నాగార్జున, శృతి హాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు రజనీకాంత్ నటించిన  ‘వేట్టయాన్‌’ అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.   

అపోలో హాస్పిటల్లో హార్ట్ సర్జరీ

ఇక తాజాగా రజనీకాంత్ కు అపోలో హాస్పిటల్ వైద్యులు హార్ట్ సర్జరీ చేశారు. సెప్టెంబర్ 30న ఆయన హాస్పిటల్ లో జాయిన్ కాగా, గుండెకు సర్జరీ చేసి స్టంట్ వేశారు. అనంతరం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.  

Read Also: ‘దేవర‘ పార్ట్ 2 ఎలా ఉంటుందంటే? అసలు విషయం చెప్పేసిన ఎన్టీఆర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Mahindra Thar Discount: మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
Embed widget