News
News
వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham May 4th: యష్ వేద కోసం కొన్న డ్రెస్ వేసుకున్న మాళవిక- ఇద్దరి మధ్య చిచ్చు మళ్ళీ రగిలేనా?

యష్, వేద ఒక్కటి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

పూజ చేసిన తర్వాత సరిఒడి భోజనాలు చేయాలని పంతులతో సుహాసిని అబద్ధం చెప్పిస్తుంది. దీంతో వేద యష్ ఒడిలో కూర్చుని తింటుంది. భార్యని కళ్ళలో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఒడిలో పెట్టుకుని చూసుకునే భర్తని నేనే ఏమోనని యష్ సంతోషపడతాడు. వేద తనని ఘోరంగా అవమానించిందని మాళవిక అభిమన్యుతో చెప్తుంది. అసలు నువ్వు ఎందుకు ఆ పూజకి వెళ్లావని అంటాడు. ఆ వేదని వెనకేసుకొచ్చి యశోధర్ కూడా రెచ్చిపోయాడని ఏడుస్తుంది. వాడి అంతు చూస్తాను మాళవిక అంటే ఎవరు నువ్వు నా ప్రాణమని కల్లబొల్లి మాటలు చెప్తాడు. నా లైఫ్ లో నీ ఎగ్జిట్ చిత్ర ఎంట్రీ ఒకేసారి జరుగుతుందని అభి మనసులో అనుకుంటాడు.

Also Read: జానకిని శత్రువులా చూస్తున్న జ్ఞానంబ- ఇంట్లో సునామీ సృష్టిస్తానన్న మధుకర్

యష్ అద్దం ముందు నిలబడి ఎంత అందంగా ఉన్నానో అని తెగ పొగిడేసుకుంటూ ఉంటుంటే వేద వస్తుంది. తన తలలో తెల్ల వెంట్రుక పీకి పైకి కనబడేది ఒకటే లోపల ఎన్ని ఉన్నాయో. నెరిసిపోతున్న జుట్టు, ముసలి చర్మం, వణుకుతున్న చేతిలో కర్ర పట్టుకుని ఎలా ఉంటాడో అంటుంటే యష్ ఆపేయ్ ఒక్క వెంట్రుకకె ముసలోడిని అయిపోతానా అంటాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఈవినింగ్ పార్టీ ఉందని వెళ్లాలని చెప్తాడు. లేటెస్ట్ డ్రెస్ ఏదైనా ఉందా అంటే ఉన్న వాటిలో ఏదోఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకుంటానులే అంటుంది. కానీ యష్ వద్దు షాపింగ్ వెళ్ళి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి తీసుకొస్తానని చెప్పేసరికి మురిసిపోతుంది. షాపింగ్ మాల్ కి వచ్చి డ్రెస్స్ చూస్తూ ఉంటాడు. తన కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. అదే షాప్ కి మాళవిక కూడ వస్తుంది. అక్కడ పని చేసే సెల్స్ గర్ల్ చేతిలో యష్ సెలెక్ట్ చేసిన డ్రెస్ చూసి నేను కొనాలనుకున్న డ్రెస్ దొరికిందని అంటుంది. వేరే వాళ్ళు కొనేశారని చెప్తుంది. ఎవరు కొన్నారో చెప్పండి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తానని వెళ్తుంది.

డ్రెస్ తీసుకుని యష్ దగ్గరకి వస్తుంది. ఈ డ్రెస్ అనేసరికి నేనే కొన్నానని యష్ చెప్తాడు. థాంక్యూ నా టేస్ట్ తెలుసుకుని నాకోసం డ్రెస్ సెలెక్ట్ చేసినందుకని నవ్వుతూ చెప్తుంది.

యష్: నీకోసం కొంటానని ఎలా అనుకున్నావ్ ఇది నా వేద కోసం

మాళవిక: ఈ మోడ్రన్ డ్రెస్ వేద వేసుకుంటుందా తనకి నప్పుతుందా? కొన్ని డ్రెస్ లు కొందరికే అందం. ఐదు అడుగుల చీరని దుప్పటిలా చుట్టేసుకుంటుంది నీ వేద ఫ్యాషన్ తెలియదు

యష్: షటప్ నా వేద గురించి ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో కూడా తెలియదు

మాళవిక: అలవాటు లేని డ్రెస్ ఆమెకి అతకదు. ఈరోజు పార్టీ ఉంది నేను ఈ డ్రెస్ లోనే రావాలి నాకు కావాలి

యష్: ఆ డ్రెస్ మాళవిక చేతిలో నుంచి లాగేసుకుంటాడు

Also Read: భార్యగా రాజ్ గదిలోకి అడుగుపెట్టిన కావ్య- బురదలో పడేసి కల్యాణ్‌ని కుళ్లబొడిసిన అప్పు

మాళవిక: కనీసం గిఫ్ట్ గా అయినా ఇవ్వు

ఇవ్వనని చెప్పేసి డ్రెస్ తీసుకుని వెళ్ళిపోతాడు. యష్ ఇంటికి వచ్చి తనకి తలనొప్పిగా ఉందని కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. వేద ఆత్రంగా గదిలోకి వస్తుంది. మీరు నన్ను పిలిచింది కాఫీ కోసం కాదు ఇంకా వేరే ఏదో ఉందని అంటుంది. డ్రెస్ తీసి వేదకి చూపిస్తాడు. అది చూసి వేద బిక్క మొహం వేస్తుంది. ఏంటి ఈ డ్రెస్ మోడ్రన్ డ్రెస్ తెచ్చారు ఏంటని అంటుంది. ఈ డ్రెస్ వేసుకుని పార్టీకి రావాలని, ఈ బ్యూటీఫుల్ డ్రెస్ లో నా బ్యూటీఫుల్ వైఫ్ ని చూసుకుని ఫిదా అయిపోవాలని చెప్తాడు. చిత్ర వచ్చి మాళవికని పలకరిస్తుంది.

Published at : 04 May 2023 08:18 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial May 4th Episode

సంబంధిత కథనాలు

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Gruhalakshmi June 1st: కొడుకు సంగతి తెలిసి కుప్పకూలిన అనసూయ దంపతులు- దివ్యని పుట్టింటికి దూరం చేస్తున్న రాజ్యలక్ష్మి

Gruhalakshmi June 1st: కొడుకు సంగతి తెలిసి కుప్పకూలిన అనసూయ దంపతులు- దివ్యని పుట్టింటికి దూరం చేస్తున్న రాజ్యలక్ష్మి

Krishna Mukunda Murari June 1st: ఓపెన్ అయిన రేవతి- ఇంకొక పెళ్లి చేసుకోమని ముకుందకి సలహా ఇచ్చిన మురారీ తల్లి

Krishna Mukunda Murari June 1st: ఓపెన్ అయిన రేవతి- ఇంకొక పెళ్లి చేసుకోమని ముకుందకి సలహా ఇచ్చిన మురారీ తల్లి

Brahmamudi June 1st: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్

Brahmamudi June 1st: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ