Ennenno Janmalabandham May 29th: ఆదిత్యని వెళ్ళగొట్టిన అభిమన్యు- తప్పతాగి రోడ్డు మీద తిరుగుతున్న మాళవిక
అభిమన్యు మాళవికని మోసం చేసి నీలాంబరిని పెళ్లి చేసుకుని రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్, వేద రెడీ అయి గదిలో నుంచి బయటకి వస్తారు. వాళ్ళు ఏకాంతంగా గడపడానికి వెళ్తున్నారని రత్నం సులోచన వాళ్ళకి చెప్పడంతో అదే ఉద్దేశంతో సంతోషంగా గడిపి రమ్మని అంటారు. మేము వెళ్ళేది బిజినెస్ మీటింగ్ కదా డిన్నర్ కి ఇంటికే వస్తాం కదా అని వేద డౌట్ గా అడుగుతుంది. హ్యాపీగా వెళ్ళి గుడ్ న్యూస్ తో రమ్మని మాలిని అనేసరికి గుడ్ న్యూస్ ఏంటని అనుమానంగా అంటుంది. వేదకి విషయం తెలియకుండా ఉండేందుకు అందరూ బాగానే కవర్ చేస్తారు. వాళ్ళిద్దరూ సంతోషంగా వెళ్ళడం చూసి మాలిని, సులోచన మురిసిపోతారు. మాళవిక అభిమన్యు చేసిన మోసం తట్టుకోలేక బార్ కి వెళ్ళి దారుణంగా తాగేస్తుంది. నా బతుకు ఏదో నేను బతుకుటుంటే ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి నా పెళ్లి పెటాకులు చేశావ్. ఇప్పుడు దాన్ని ఎవతినో పెళ్లి చేసుకుని వచ్చావ్ నిన్ను వదలను. నాకు ఇంత నమ్మక ద్రోహం చేసిన నిన్ను వదలను అని బార్ మొత్తం గందరగోళంగా అరుస్తూ గోల గోల చేస్తుంది.
Also Read: అత్త రోగం కుదిర్చిన దివ్య, సంతోషంలో విక్రమ్- నందుకి జైలు శిక్ష పడుతుందా?
అభి చేసిన మోసం తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడుస్తుంది. వేదకి చెప్పకుండా తీసుకెళ్తున్నా అక్కడికి వెళ్ళినాక ఎలా రియాక్ట్ అవుతుందో ఏమోనని యష్ అనుకుంటూ ఉంటాడు. ఏమైంది అంతా ఒకేనా కదా వేద అమాయకంగా అడుగుతుంది. అసలు విషయం చెప్పేస్తే బాగుంటుందేమోనని అనుకుంటాడు. కానీ మళ్ళీ చెప్పకుండా వింతగా టెన్షన్ గా మాట్లాడతాడు. మీరు ఏం భయపడాల్సిన పని లేదు మీరు ఏం చెప్పినా పాజిటివ్ గా తీసుకుంటారని వేద అంటుంది. అయితే నువ్వు పాజిటివ్ గా తీసుకుంటావా అని విచిత్రంగా అడుగుతాడు. అభిమన్యు దగ్గర ఆదిత్య వచ్చి డాడీ మమ్మీ ఎక్కడ ఉందని అంటాడు. నీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని భ్రమరాంబిక ఆశ్చర్యంగా అడుగుతుంది. మమ్మీని బయటకి పంపించేశారా మమ్మీ ఎక్కడ? డాడీ అని పిలవమన్నావ్ కదా.. మమ్మీని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా అని ఆదిత్య ఏడుస్తూ అడుగుతాడు.
Also Read: డబుల్ ట్విస్ట్, నిజం తెలుసుకున్న స్వప్న- కావ్యని కిడ్నాప్ చేయించిన రాహుల్
మా మమ్మీని ఎందుకు బయటకి పంపించేశారని నిలదీస్తాడు. భ్రమరాంబిక వచ్చి మీ అమ్మకి ఈ ఇంటికి రుణం తీరిపోయింది. ఆవిడ నీలాంబరి తనని నా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మ ఇక్కడికి రాదని చెప్తుంది. మమ్మీని కదా పెళ్లి చేసుకుంటానని అన్నావ్ ఇప్పుడు ఈవిడని చేసుకోవడం ఏంటి తనని బయటకి పంపించేయండని అంటాడు. అభి కోపంగా ఆదిత్యని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడు. ఇంకోసారి డాడీ అని ఇటువైపు వస్తే ప్రాణాలు తీసేస్తాను పో బయటకని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. యష్, వేద హోటల్ కి వస్తారు. ఇక్కడికి అయితే తీసుకొచ్చాను కానీ తనని ఎలా కన్వీన్స్ చేయాలని ఆలోచిస్తాడు. ఆ ప్లేస్ చూసి ఇక్కడేనా మీటింగ్ అంటుంది. నీకు నచ్చింది కదా అంతే చాలని యష్ హ్యపీగా ఫీల్ అవుతాడు. వేద బిజినెస్ మీటింగ్ కదా మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. సమాధానం చెప్పలేక యష్ తిప్పలు పడతాడు.