Gruhalakshmi May 27th: అత్త రోగం కుదిర్చిన దివ్య, సంతోషంలో విక్రమ్- నందుకి జైలు శిక్ష పడుతుందా?
నందు మీద గృహహింస కేసు పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తప్పు చేయకపోయినా లాస్య మనల్ని ఆడిస్తుందని మోహన్ అంటాడు. మనం తీసుకెళ్ళే సాక్ష్యం గురించి ఎలా తెలుసుకుందానని అనుకుంటారు. వీడియో తన దగ్గర ఉంచుకుని కూడా ఎందుకు బయట పెట్టలేదని అంటే కోర్టు బయటే సెటిల్ చేయాలని ట్రై చేస్తుంది కానీ అది జరగని పని అని నందు అంటాడు. లాస్యని రెచ్చగొట్టడం కంటే తన దారిలోకి వెళ్ళడం మంచిదని తులసి హితబోధ చేస్తుంది. విక్రమ్ తల్లి గురించి ఏడుస్తూ తిండి కూడా తినకుండా ఉంటాడు. అమ్మని అలా చూడలేకపోతున్నా కాలికి అంత పెద్ద దెబ్బ అని ఏడుస్తాడు. మీ నాన్న ఇంతకంటే దారుణమైన పరిస్థితిలో వీల్ చైర్ కి పరిమితం అయ్యాడు తన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మీ నాన్న విషయంలో గుండె ఎలా దిటవు చేసుకున్నావో అలాగే అమ్మ విషయంలో కూడా ఉండమని విక్రమ్ తాతయ్య అంటాడు. కానీ తన తల్లిని వేరే వాళ్ళతో పోల్చవద్దని బాధగా వెళ్ళిపోతాడు.
Also Read: డబుల్ ట్విస్ట్, నిజం తెలుసుకున్న స్వప్న- కావ్యని కిడ్నాప్ చేయించిన రాహుల్
విక్రమ్ ని బొమ్మని చేసి ఆడిస్తుందని తాతయ్య అంటాడు. తనని మారుస్తానని దివ్య ధీమాగా చెప్తుంది. నందు తన ఫోటో చూసుకుని కోపంగా దాని మీద కాఫీ పోస్తాడు. ఏంటి నీకేమైన పిచ్చి ఎక్కిందా అని పరంధామయ్య బాధపడతాడు. మీ పట్ల నేను చేసింది తలుచుకుంటే కోపం వస్తుంది తప్పు చేసినప్పుడు బయటకి గెంటేయవచ్చు కదా. నేను ద్రోహి అని పచ్చబొట్టు పొడిపించుకుంటా. నేను తప్పు చేసిన ప్రతిసారీ చచ్చిపోతున్నా. ఈ కొడుకు మీకు ఉండి కూడా లేనట్టే. మీ బరువు మోయాల్సిన టైమ్ లో మీకు భారంగా ఉన్నానని తన మీద ద్వేషంతో మాట్లాడతాడు. తన జీవితం ముగిసిపోయిందని లాస్యతో జీవితాంతం యుద్దం తప్పదని పిచ్చి వాడిలా మాట్లాడతాడు. కొడుకుని అలా చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతారు. పొద్దున్నే తులసి నందు దగ్గరకి వచ్చి వేదాంతం మొదలుపెడుతుంది. పెద్ద వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకు నా కళ్ళ ముందు నా భర్త మరో ఆడదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అది జైలు శిక్ష కంటే కఠినమైంది. అది తలరాత అనుకున్నా. మీరు అలాగే అనుకోమని హితబోధ చేస్తుంది.
Also Read: రాజ్యలక్ష్మిని బెదిరించిన దివ్య- అన్ని దారులు మూసేసి నందుని ఇరకాటంలో పడేస్తున్న లాస్య
దివ్య రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చి అందరినీ పిలిచి గుడ్ న్యూస్ అని అరుస్తుంది. మా అక్క కాలు విరగొట్టుకుని బెడ్ మీద ఉంటే గుడ్ న్యూస్ అంటావ్ ఏంటని బసవయ్య అంటాడు. చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఎంతో చెప్పమని విక్రమ్ తాతయ్య చెప్తాడు. అత్తయ్య లెగ్ రిపోర్ట్స్ చూశాను, రేపటికల్లా అత్తయ్యని నడిపిస్తాను ఎవరూ దిగులు పెట్టుకోవాల్సిన పనిలేదని అంటుంది. కాకపోతే కాస్త చార్జ్ ఎక్కువ అవుతుందని అంటుంది. ఎముక విరిగితే ఎలా నయం అవుతుందని బసవయ్య అంటాడు. విరగలేదు జస్ట్ బెణికిందని దివ్య చెప్తుంది. కావాలంటే మీరు చూడమని బసవయ్యకి ఇస్తుంది. తల్లి నడుస్తుందని అనేసరికి విక్రమ్ సంతోషంగా దివ్యని కౌగలించుకుంటాడు. లాస్య ఒకతను దగ్గరకి వెళ్ళి నందు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేయాలని చెప్తుంది. నందు మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తుంది.