Ennenno Janmalabandham January 6th: 'నా యాక్టింగ్ నమ్మేశావా' అంటూ షాకిచ్చిన యష్- గుండెలు పగిలేలా ఏడ్చిన వేద
వేద, యష్ తన అమ్మమ్మ ఊరుకి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద తన మనసులో భావాలన్నీ ప్రేమలేఖగా రాసి ఫిర్యాదుల బాక్స్ లో వేస్తుంది. అది చూసి యష్ లెటర్ తీసుకుంటాడు కానీ ఓపెన్ చేసే టైమ్ కి ఫోన్ రావడంతో చదవకుండా పక్కన పెట్టేస్తాడు. తర్వాత వేద దగ్గరకి వచ్చి మాట్లాడతాడు. లెటర్ చదివే వచ్చాడని వేద సంతోషంగా ఉంటుంది. అప్పుడే యష్ ‘నేను నువ్వు కోరుకున్నట్టే యాక్ట్ చేశాను కదా ఇప్పుడు సంతోషమే కదా’ అని అంటాడు. వాళ్ళ మాటలు విని రాజా, రాణి కూడా షాక్ అవుతారు. ‘నీ సంతోషం చూసి చాలా ఆనందంగా ఉందనేసరికి’ వేద మనసు ముక్కలు అవుతుంది.
యష్: ఫస్ట్ టైమ్ యాక్ట్ చేయడం కానీ నీ మాటలు వింటుంటే మీ అమ్మమ్మ తాతయ్య దగ్గర మార్క్స్ కొట్టేసాను అని నమ్మకం వచ్చింది
వేద: ఏడుస్తూ యాక్టింగ్ ఏంటండీ
యష్: నేను ఇంత యాక్టివ్ గా ఉండటం ఎప్పుడైనా చూశావా? బయట వాళ్ళతో నేను ఎక్కువగా రాసుకుపూసుకు తిరగలేను కానీ మీఅమ్మమ్మ తాతయ్యతో చనువు తీసుకున్న ఎక్కువ ప్రేమగా సంతోషంగా ఉన్నాను. నా యాక్టింగ్ వాళ్ళు, నువ్వు నమ్మేశారు. నా సూపర్ యాక్టింగ్ తో మిమ్మల్ని అందరినీ నమ్మించాను. ఆ పెద్దవాళ్ళని మోసం చేసి ఉండకూడదు కానీ చేశాను. ఇవన్నీ చేశానంటే కేవలం నీకోసమే వేద, నాకు నా సంతోషం కంటే నీ సంతోషమే ఎక్కువ, అందుకోసం ఏమైనా చేస్తాను
Also Read: 'ఐ లవ్యూ శ్రీవారు' అని ప్రేమలేఖ రాసిన వేద- యష్ తనని భార్యగా అంగీకరిస్తాడా?
యష్ మాటలకి వేద మనసు ముక్కలై పోతుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా గడిపిన క్షణాలన్నీ తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ‘నాతో చనువుగా ఉన్నది అంతా యాక్టింగ్, నాకు దగ్గర అవడం కూడా డ్రామా యేనా, నామీద మీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా, మీకు నామీద ఉన్న ఒకే ఒక ఫీలింగ్ కృతజ్ఞత. మీ యాక్టింగ్ తో నాకు థాంక్స్ చెప్తారా? ఇది కాదు నేను మీ నుంచి ఎక్స్ పెక్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ నేను మిమ్మల్ని ఖుషి తండ్రిగా కాకుండా భర్తగా చూశాను. మీరు కూడా నన్ను భార్యగా చూశారని ఆశపడ్డాను. నాకు నిరాశ మిగిల్చారు. దగ్గర అయినట్టే అయ్యి దూరం అయ్యారు’ అని బాధపడుతుంది.
వేద లెటర్ చూస్తారేమో అని వెంటనే దాన్ని తీసేయడానికి వస్తుంది. అప్పటికే యష్ ఆ లెటర్ తీసుకుని బయటకి వస్తాడు. మళ్ళీ చదివేలోపు ఫోన్ వస్తుంది దీంతో చదవకుండా ఉండిపోతాడు. టేబుల్ మీద పెట్టేసరికి అడి ఎగిరిపోతుంది. దాన్ని వెతుక్కుంటూ వేద వెళ్తుంది కానీ లెటర్ కనిపించదు. ముత్యాలకి ఆ లెటర్ దొరుకుతుంది, యష్ కి ఇవ్వబోతుంటే వేద అడ్డుపడి దాన్ని తీసేసుకుంటుంది. రాజా, రాణి యష్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. రాణి యష్ మాటలు విని చాలా బాధపడుతుంది. కానీ రాజా మాత్రం వాళ్ళ మనసులో దోబూచులాట తొలిగిపోయిందని అంటాడు. మనల్ని నొప్పించకూడదు అనుకుని అన్యోన్యంగా ఉండాలని నటించారు. కానీ వేదని చూస్తే అలా అనిపించలేదు. భర్తకి దగ్గర అవాలని ఆశ కనిపించిందని రాణి అంటుంది.
Also Read: బెనర్జీతో చేతులు కలిపిన లాస్య- కళ్ళు తిరిగి పడిపోయిన తులసి, పరిస్థితి విషమం
యష్ గురించి రాజా మంచిగా చెప్తాడు. పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదని ఆలోచించాడు, భార్య సంతోషం కోసం చూసాడని అంటాడు. వేద యష్ గురించి ఆలోచిస్తూ ఆయన ఏం చేసినా నా సంతోషం కోసమే ఇలా చేశారు కానీ చిన్న తేడా ఏంటంటే ఆయన నాకు ఇచ్చే గౌరవం ఖుషికి తల్లిగా మాత్రమే అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.