By: ABP Desam | Updated at : 05 Jan 2023 08:08 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
భార్యగా మారినట్టు ముందు తనకి తెలిసేలా చెయ్యమని వేదకి తన అక్క సుహా సలహా ఇస్తుంది. వెంటనే వేద తన అమ్మమ్మ దగ్గరకి పరుగు తీస్తుంది. ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ చెప్పకుండా టెన్షన్ పడుతుంటే రాణి అర్థం చేసుకుంటుంది. నీ భర్తకి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా? అని అడుగుతుంది. ‘భర్త విషయంలో భార్య ఒక్కొక్కసారి చొరవ తీసుకోవాలి. దూసుకుపోవాలి, సర్దుకుపోవాలి. కొన్ని సార్లు తగ్గాలి. భార్యలో ఒక తల్లి కూడా ఉండాలి. తల్లి బిడ్డని ఎలా బుజ్జగిస్తుందో అలాగే భార్య కూడా భర్తని బుజ్జగించాలి. భర్తని బిడ్డలా చూసుకో. దాంపత్యంలో ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం ఉండదు. ఇద్దరూ సరిసమానమే. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది పట్టు, విడుపు. నీ భర్త ముందు మనసు విప్పు, అతను నీ భర్త నీ హక్కు’ అని రాణి సలహా ఇస్తుంది.
Also Read: లాస్య బండారం బయటపెట్టిన శ్రుతి, అంకిత- ఉగ్రరూపం దాల్చిన నందు
వేద తన మనసులో భావాలన్నీ లెటర్ రాయాలని అనుకుంటుంది. ‘ప్రియాతి ప్రియమైన శ్రీవారికి రాస్తున్న ప్రేమలేఖ’ అంటూ మొదలు పెట్టేస్తుంది. అది రాస్తూ తెగ సిగ్గుపడిపోతుంది. ‘నాకు ఇప్పుడు తల్లి స్థానం మాత్రమే కాదు భార్య స్థానం కూడా కావాలి. భర్తగా మీ ప్రేమ కూడా కావాలి. దంపతులుగా మనం ఇద్దరం ఒకటి కావాలి. గతాలు పక్కన పెట్టి కలిసిపోదాం. ఇద్దరం కలిసి ఒక కొత్త బంగారులోకంలోకి వెళ్దాం’ అని రాస్తుంది. చివర్లో ఐ లవ్యూ శ్రీవారు అని ముద్దుపెట్టేస్తుంది. తొలిసారి శ్రీవారికి ప్రేమ లేఖ రాసినందుకు వేద చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. డాన్స్ వేస్తూ లెటర్ చూసుకుంటూ సిగ్గు పడిపోతుంది. దాన్ని యష్ కి ఇవ్వడం కోసం అని ఫిర్యాదుల పెట్టెలో వేస్తుంది. ఈ ప్రేమలేఖ చదివి మీరు మురిసిపోతారు, పొంగిపోతారు. మీ చేతులతో ఎట్టి గిరాగిరా తిప్పేస్తారు అని ఊహించుకుంటుంది.
ఆ లెటర్ ఫిర్యాదుల పెట్టెలో పెట్టడం యష్ చూసి దాన్ని తీసుకుంటాడు. అది చూసి చదివి ఇద్దరిదీ సేమ్ ఫీలింగ్ వేద సంతోషాన్ని షేర్ చేసుకుంటారు అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ యష్ మాత్రం ఆ లెటర్ ఓపెన్ చేసే టైమ్ కి ఫోన్ వస్తుంది. దీంతో లెటర్ చదవకుండానే పక్కన పెట్టేస్తాడు. తర్వాత వేద దగ్గరకి వస్తాడు. లెటర్ చదివి తన దగ్గరకి వచ్చాడని వేద అనుకుంటుంది. టెన్షన్ పడుతూ సిగ్గుపడుతుంది.
Also Read: వేద మనసు ముక్కలు చేసిన యష్- షాకైన రాజా, రాణి
యష్: నీ ఫిలింగ్స్ నాకు తెలుసు వేద. నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా. మీ అమ్మమ్మ తాతయ్య హ్యాపీ కదా. మీ అమ్మమ్మ వాళ్ళు నాకు బాగా నచ్చారు. వాళ్ళు మాట్లాడుకోవడం రాజా చూసి రాణిని పిలుస్తాడు. ఈ వయస్సులో కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటాడు. కానీ చివరకి తను చేసిందంతా యాక్టింగ్ అనేసరికి వేద మనసు ముక్కలవుతుంది.
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర
Gruhalakshmi February 4th: నందు కేఫ్‌కి సామ్రాట్ సాయం- విడాకులిస్తానంటూ అంకితని బెదిరించిన అభి
బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Adani Group - RSS: ఏడేళ్ల క్రితమే అదానీపై కుట్ర, ఇప్పుడు అమలు - స్టోరీలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్