News
News
X

Ennenno Janmalabandham January 4th: వేద మనసు ముక్కలు చేసిన యష్- షాకైన రాజా, రాణి

వేద, యష్ తన అమ్మమ్మ ఊరు వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

వేద, యష్ ని దగ్గర చేసేందుకు ఆరుబయట వెన్నెల్లో పడక ఏర్పాటు చేస్తారు. ఇద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. మ్యారేజ్ లైఫ్ లో నాతో హ్యాపీగా ఉన్నావా అని యష్ అడుగుతాడు. చాలా హ్యపీగా ఉన్నానని చెప్తుంది. ఇది నాకు ఒక కొత్త జీవితం, మీతో పెళ్లి నాకొక కొత్త జన్మ. నేను లైఫ్ లో చాలా డిస్ట్రబ్ అయ్యాను, ప్రేమలో ఒడిపోయాను. ప్రేమించిన వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పెళ్లి ఆగిపోయింది. అన్నింటికీ మించి తల్లిని కాలేను అనే వార్త కుంగిపోయేలా చేసింది. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను. ఎవరైనా అనాథ బిడ్డని దత్తత తీసుకోవాలని అనుకున్నా. అప్పుడే ఖుషి, మీరు నాకు లైఫ్ లోకి వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉన్నాను’ అని ఎమోషనల్ అవుతుంది.

ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నాతో హ్యపీగా ఉన్నారా? అంటుంది. ‘నువ్వు వచ్చాకే నా జీవితంలో హ్యపీనెస్ వచ్చింది. నీతో నాకు ఎటువంటి సమస్య లేదు. గత జీవితం నా మనసు ముక్కలు చేస్తుంది. బయట వాళ్ళతో కనిపించని యుద్ధం చేస్తున్నా. గత జీవితం నుంచి బయటపడలేకపోతున్నా’ అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ‘మీరు పడి లేచారు, నేను ఉండగా మిమ్మల్ని పడనివ్వను. మీకు నేనున్నా’ అని యష్ కి ధైర్యం చెప్పి తన మూడ్ మార్చేందుకు ఖుషి గురించి చెప్తుంది. తెల్లారేసరికి ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని నిద్రపోతారు. భర్త గుండెల మీద పడుకుంటే ఆ హాయే వేరు అని చాలా మంది చెప్తారు. ఇప్పుడు తెలుస్తుంది అది దీన్నే ప్రేమ అంటారేమో అని వేద సిగ్గుపడుతుంది.

Also Read: తులసిని కంపెనీ సీఈవో చేస్తానన్న సామ్రాట్- శ్రుతిని చంటిపాపలా చూసుకుంటున్న ప్రేమ్

భార్యాభర్తలు అంతే ఒకరి పట్ల ఒకరికి బాధ్యత. మీలోపల మీకే తెలియని అలజడి ఉంది కనపడరు. మన మధ్య ఒక అడ్డుగోడ ఉంది దాన్ని తీసెయ్యడం ఎలా అని వేద ఆలోచిస్తుంది. నిద్రపోతున్న మొగుడికి దిష్టి తీసుకుని మురిసిపోతుంది. తన ఫీలింగ్స్ అక్క సుహాసినితో పంచుకోవాలని, భర్తకి దగ్గర అయ్యేందుకు తన సలహా తీసుకోవాలని అనుకుంటుంది. వెంటనే సుహాకి ఫోన్ చేస్తుంది. విలేజ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఈ జర్నీ మీ భార్యాభర్తల కోసం ప్లాన్ చేసింది కదా వర్కౌట్ అవుతుందా? ఒప్పందాలు పక్కన పెట్టి దగ్గర అయ్యారా? అని అడుగుతుంది. ఆయన పాత జ్ఞాపకాల నుంచి బయటకి రాలేకపోతున్నారని అంటుంది.

సుహా: నువ్వే చొరవ తీసుకోవాలి. ఆయన్ని నువ్వే మార్చాలి. నీ భర్తని నువ్వే కొత్తగా తీర్చిదిద్దుకోవాలి. ఖుషి కోసమే పెళ్లి అనే ఒప్పందం నుంచి ముందు నువ్వు బయటకి రా, తర్వాత తనని బయటకి తీసుకుని రా. మదర్ ఆఫ్ ఖుషి దగ్గర నుంచి వైఫ్ ఆఫ్ యశోధర్ గా మారు. భార్యగా ఆలోచించి మనసు శరీరాన్ని భార్యగా మార్చుకో.  నువ్వు భార్యగా మారిపోయినట్టు ముందు నీ భర్తకి తెలియజేయి. ఇప్పటిదాకా మీరిద్దరూ ఖుషికి అమ్మానాన్న. ఇప్పుడు మీరిద్దరూ ఒకరికోసం ఒకరుగా మారండి అని చక్కగా చెప్తుంది. వేద వెంటనే తన అమ్మమ్మ దగ్గరకి వస్తుంది. ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ మాటలు రాక టెన్షన్ పడుతుంది.

Also Read: వెన్నెల రాత్రిలో ఊసులాడుకున్న రెండు మనసులు- భార్య స్థానం కోసం ఆశపడిన వేద

తరువాయి భాగంలో..

వేద తన మనసులోని విషయాన్ని లెటర్ రాసి ఫిర్యాదుల బాక్స్ లో వేస్తుంది. అది యష్ తీసుకుంటాడు కానీ చదవకుండానే వేద దగ్గరకి వస్తాడు. నువ్వు కోరుకున్నట్టే యాక్ట్ చేశాను కదా. మీ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఫుల్ మార్క్స్ కొట్టేసాను అని నమ్మకం వచ్చిందని అంటాడు. ఆ మాటకి వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈ యాక్టింగ్, చీటింగ్ అన్ని చేశాను అంటే అది కేవలం నీకోసమే వేద అని యష్ చెప్పేసరికి వేద గుండె ముక్కలవుతుంది. వాళ్ళ మాటలు విని రాజా, రాణి కూడా షాక్ అవుతారు.  

Published at : 04 Jan 2023 07:49 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial January 4th Episode

సంబంధిత కథనాలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు

Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు