Raymond Group: అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
Andhra Investment: రేమండ్ గ్రూప్ అనంతపురం జిల్లాలో రెండు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించనుంది. ఏరోస్పేస్, ఆటోమోటివ్ సెక్టార్లలో ఈ ప్రాజెక్టులు 1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి.

Raymond Group to invest Rs 1000 cr in aerospace automotive sectors in Andhra: ఏపీలో మరో ప్రఖ్యాత సంస్థ పెట్టుబడులతో వచ్చింది. రేమండ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రెండు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించనుంది. ఏరోస్పేస్ మరియు ఆటోమోటివ్ సెక్టార్లలో ఈ ప్రాజెక్టులు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి. ఇవి 5,400 ఉద్యోగాలు సృష్టిస్తాయి, రూ.695 కోట్ల ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందనున్నాయి. రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, ఆటో కాంపోనెంట్లలో తన వ్యాపారాలను విస్తరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది. మొత్తం రూ.943 కోట్ల పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.695 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇస్తుంది . ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ గుడిపల్లిలో, ఆటోమోటివ్ యూనిట్ టెకులోడు గ్రామంలో ఏర్పాటు కానున్నాయి JK మైని ప్రెసిషన్ టెక్నాలజీ కింద రూ.430 కోట్ల పెట్టుబడితో స్థాపిస్తారు. ఈ ప్రాజెక్టు 4,096 మందికి నేరుగా ఉద్యోగాలు కల్పిస్తుంది. JK మైని గ్లోబల్ ఏరోస్పేస్ కింద 47 ఎకరాల్లో రూ.510 కోట్ల పెట్టుబడితో నిర్మాణం జరుగుతుంది. 1,400 ఉద్యోగాలు సృష్టిస్తుంది.
ఈ ప్రాజెక్టులు రేమండ్ గ్రూప్‌ను హై-ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఆటో మరియు ఏరోస్పేస్ కాంపోనెంట్లలో మరింత బలోపేతం చేస్తాయి. 2023లో మైని ప్రెసిషన్ ప్రాడక్ట్స్ (MPPL)లో మెజారిటీ స్టేక్ కొనుగోలు చేసి, రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్‌లోకి అడుగుపెట్టింది. 1973లో స్థాపించబడిన మైని ప్రెసిషన్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ (MPPL) ఆటోమోటివ్ మరియు ఇండస్ట్రియల్ కాంపోనెంట్ల మాన్యుఫాక్చరింగ్‌లో బలమైన వారసత్వం కలిగి ఉంది. 2004లో ఏరోస్పేస్‌లోకి అడుగుపెట్టి, గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్లకు (OEMs) మిషన్-క్రిటికల్ కాంపోనెంట్లు సరఫరా చేస్తోంది. JK మైని గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ (JKMGAL) ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, హై-కాంప్లెక్సిటీ కాంపోనెంట్లు తయారీలో గ్లోబల్ OEMs , టియర్-I సప్లయర్లకు విశ్వసనీయ పేరు.
… and the A in #Anantapur stands for Aerospace and Automotive!#YoungestStateHighestInvestment pic.twitter.com/aVH7i8IMLU
— Lokesh Nara (@naralokesh) October 15, 2025
ఈ ప్రాజెక్ట్‌కు అనంతపురం ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది AP ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు. టెక్స్‌టైల్ రాజు రేమండ్, ఇప్పుడు అనంతపురం నుంచి ప్రపంచానికి హై-టెక్ భాగాలను పంపించబోతున్నది. ఇది కేవలం ఒక వెయ్యికోట్ల పెట్టుబడి కాదు—ఇది AP భవిష్యత్తుపై, మౌలిక సదుపాయాలపై, యువతపై రేమండ్ నమ్మకం. సాంప్రదాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే శక్తి, మరియు అనంతపురాన్ని దేశంలోనే ఒక ఏరోస్పేస్-ఆటోమోటివ్ హబ్‌గా తీర్చిదిద్దే శక్తివంతమైన అడుగుగా భావిస్తున్నారు.





















