(Source: ECI | ABP NEWS)
Commonwealth Games: అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
2030 Centenary Commonwealth Games: 2030లో కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలకు చాలా ప్రత్యేకత ఉంది.

Ahmedabad Set To Host 2030 Centenary Commonwealth Games: అహ్మదాబాద్ 2030 సెంటినరీ కామన్‌వెల్త్ గేమ్స్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. కామన్‌వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ బుధవారం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. తుది నిర్ణయం నవంబర్ 26న గ్లాస్‌గోలో జరిగే జనరల్ అసెంబ్లీలో తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం లాంఛనమేనని భావిస్తున్నారు. ఈ గేమ్స్ 1930లో మొదలైన కామన్‌వెల్త్ స్పోర్ట్ మూవ్‌మెంట్‌కు 100 ఏళ్ల అయిన సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. భారత్ 2010 ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించిన మరోసారి ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈ ప్రతిపాదన భారతదేశం 2036 ఒలింపిక్స్ బిడ్‌కు కూడా బలం చేకూర్చుతుందని అధికారులు తెలిపారు.
గుజరాత్ ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సంయుక్తంగా అహ్మదాబాద్‌ను సెంట్రల్ హోస్ట్ సిటీగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదన సెప్టెంబర్ 23, 2025న లండన్‌లో కామన్‌వెల్త్ స్పోర్ట్ ఎవాల్యుయేషన్ కమిటీకి సమర్పించారు. అంతర్జాతీయ స్థాయి వెన్యూస్‌లు, రోబస్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లు, హై-క్వాలిటీ అకమడేషన్‌లు అహ్మదాబాద్‌లోఉన్నాయి. గేమ్స్ అక్టోబర్ నెలలో 12 రోజులు నిర్వహిస్తారు. గేమ్స్ రీసెట్ ప్రిన్సిపల్స్ కు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయి. పారా-స్పోర్ట్స్ పూర్తి ఇంటిగ్రేషన్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, జెండర్ ఈక్వాలిటీ ప్రమోషన్, లాంగ్-టర్మ్ లెగసీ ఫ్రేమ్‌వర్క్. అథ్లెట్-సెంట్రిక్ గేమ్స్ ఉంటాయని ప్రతిపాదనలు సమర్పించారు.
జనవరf 2025లో కామన్‌వెల్త్ స్పోర్ట్ అధికారులు అహ్మదాబాద్‌ను సందర్శించి క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. ఆగస్ట్ 13న IOA స్పెషల్ జనరల్ మీటింగ్ (SGM)లో భారత బిడ్‌ను ఆమోదించారు. మార్చి 2025లో PT ఉష PT ఉష లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించారు. ఈ బిడ్‌కు భారత కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం (132,000 సీట్లు) మెయిన్ వెన్యూగా ప్రతిపాదించారు.
The Executive Board of Commonwealth Sport has today confirmed that it will recommend Ahmedabad, Gujarat, India, as the proposed host city for the 2030 Centenary Commonwealth Games. Ahmedabad will now be put forward to the full Commonwealth Sport membership, with the final… pic.twitter.com/E2fBp8o2a2
— ANI (@ANI) October 15, 2025
కామన్‌వెల్త్ గేమ్స్ 1930లో హామిల్టన్ (కెనడా)లో మొదలైంది. గ్లాస్‌గో 2026 తర్వాత, 2030 సెంచరీ ఎడిషన్. భారతదేశం 2010 ఢిల్లీలో గేమ్స్ నిర్వహించినప్పుడు కొన్ని ఇన్‌ఫ్రా సమస్యలు ఉన్నప్పటికీ, స్పోర్ట్స్ పరంగా విజయవంతమైంది. ఈ బిడ్ విజయం పొందితే, అహ్మదాబాద్ 2036 ఒలింపిక్స్ బిడ్‌కు బలం చేకూరుస్తుంది. ఈ ప్రతిపాదన 'గేమ్స్ ఫర్ ది నెక్స్ట్ సెంచరీ'గా భావిస్తున్నారు.





















