Ennenno Janmalabandham January 3rd: వెన్నెల రాత్రిలో ఊసులాడుకున్న రెండు మనసులు- భార్య స్థానం కోసం ఆశపడిన వేద
వేద, యష్ వాళ్ళ అమ్మమ్మ ఊరు రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్, వేద ఒకరి గురించి మరొకరు చిలిపి ఫిర్యాదులు చేసుకుంటూ లెటర్ బాక్స్ లో వేసుకుంటారు. పడుకునే ముందు బాడీ స్ప్రే చేసుకోవద్దని దాని వాసన చాలా ఘాటుగా ఉంటుందని స్ప్రే చేసుకోవద్దని లెటర్ రాస్తుంది. అది చదివి యష్ గదిలోకి వచ్చిన తర్వాత స్ప్రే బాటిల్ తీసి చెత్త బుట్టలో వేస్తాడు. ఇక వేదలో తనకి నచ్చని విషయం గురించి యష్ కూడా లెటర్ రాసి పెడతాడు. బెడ్ రూమ్ లోకి రాగానే కాలి పట్టీలు, చేతి గాజులు తియ్యకు అని లెటర్ రాసి ఫిర్యాదుల బాక్స్ లో వేస్తాడు. అది చదువుతూ వేద కొంచెం అతి చేస్తుంది. చేతి గాజులు వేసుకుని, కాలికి పట్టీలు పెట్టుకుంటే నువ్వు గజ్జల గుర్రం లాగా ఉంటావ్ అని యష్ అనేసరికి వేద చిందులు తొక్కుతుంది.
అప్పుడే ముత్యాలు వచ్చి వేద వాళ్ళ కోసం ఆరు బయట పడక ఏర్పాటు చేసినట్లు చెప్తుంది. మొదట సంతోషించినా తర్వాత మాత్రం అమ్మో వద్దు మాకు బెడ్ రూమ్ లో కంఫర్ట్ గా ఉందని అంటుంది. కానీ ముత్యాలు మాత్రం పట్నంలో ఉండే వాళ్ళు మీరు ఆరుబయట పడుకోరు కదా అందుకని పడక బయట వేశారు, ఈరోజు మీకు వెన్నెల రాత్రి అని అనేసరికి ఇద్దరూ సిగ్గు పడుతూ ఉంటారు. యష్ బయట మంచం మీద పడుకుని అనుభవించు రాజా.. అని సాంగ్ వేసుకుంటాడు. ఆరుబయట పడుకుంటే ఎంత బాగుందో అని సంబరపడతాడు. అప్పుడే వేద శోభనం పెళ్లి కూతురులాగా రెడీ పాల గ్లాసు పట్టుకుని బయటకి వస్తుంది. తన అందాన్ని చూసి యష్ మైమర్చిపోతాడు.
Also Read: గుడిలో ప్రసాదం అడుక్కున్న పరంధామయ్య- లాస్య మీదకి ఒంటి కాలిమీద దూకిన అంకిత
ఈ కొత్త అవతారం ఏంటి అని యష్ అడుగుతాడు. అమ్మమ్మ వద్దంటున్నా రెడీ చేసిందని చెప్తూ సిగ్గు పడుతూ బాగుందా అని అడుగుతుంది. బాపుగారి బొమ్మలా ఉన్నావ్ అని తెగ పొగిడేస్తాడు. భూమి మీద దేవుడి అద్భుత సృష్టి ఆడవాళ్ళు అని కాంప్లిమెంట్ ఇస్తాడు. వేద పాల గ్లాసు ఇచ్చి తాగమని అంటుంది. కొంచెం తాగిన తర్వాత యష్ వాటిని వేదకి కూడా తాగమని ఇస్తాడు. ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే బాగుండు అని యష్ అంటాడు. మంచం ఒకటే ఉంది కదా ఇద్దరం ఎలా పడుకుంటామని యష్ అంటాడు. తప్పదు ఇద్దరం ఇదే మంచం మీద పడుకోవాలని అంటుంది. ఈ టైమ్ లో ఖుషి ఉంటే ఎంత బాగుండేది తనకి చాలా సేఫ్టీ గా ఉండేదని వేద అంటుంది.
ఇద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు. యష్ నిద్రపోకుండా వేదని కదిలిస్తూనే ఉంటాడు. మనం ఇప్పుడు చీకట్లో ఉన్నట్టా వెలుతురులో ఉన్నట్టా అని అని క్వశ్చన్ వేస్తాడు. వెన్నెల్లో ఉన్నామని అంటుంది. తనకి నిద్ర రావడం లేదని ఏదైనా కబుర్లు చెప్పమని యష్ నస పెడుతూ ఉంటాడు. ఈ టైమ్ లో ఎం కబుర్లు అని ఇద్దరి మధ్య కాసేపు కళ్ళతో రొమాన్స్ చేసుకుంటారు. వేద యష్ తో కలిసి గడిపిన క్షణాలు అన్ని గుర్తు చేసుకుని మురిసిపోతుంది. ‘నాకు నువ్వు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావ్, నువ్వు సంతోషంగా ఉన్నావా ‘అని వేదని అడుగుతాడు. చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. ‘మ్యారేడ్ లైఫ్ లో నాతో హ్యపీగా ఉన్నావా’ అని అడుగుతాడు.
Also Read: చారుశీల దగ్గర మాట తీసుకున్న దీప- ఇంద్రుడుని క్షమించమని అడిగిన హిమ
శ్రీవారు నాకిప్పుడు తల్లి స్థానం మాత్రమే కాదు భార్య స్థానం కూడా కావాలి. భర్తగా మీ ప్రేమ కూడా కావాలి అని వేద లెటర్ రాసి ఫిర్యాదుల బాక్స్ లో వేస్తుంది. అది చూసి యష్ వేద దగ్గరకి వస్తాడు. నీ ఫిలింగ్స్ నాకు తెలుసు వేద ఇదే కదా నువ్వు నా నుంచి ఆశిస్తుంది అని అంటాడు. అయితే ఆ లెటర్ చదవలేదని యష్ మాటల్లోనే అర్థం అయిపోతుంది.