(Source: ECI/ABP News/ABP Majha)
Gruhalakshmi January 2nd: గుడిలో ప్రసాదం అడుక్కున్న పరంధామయ్య- లాస్య మీదకి ఒంటి కాలిమీద దూకిన అంకిత
లాస్య నిజస్వరూపం బయటపడటంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
హాస్పిటల్ నుంచి శ్రుతిని ఇంటికి తీసుకుని వస్తారు. ఇంట్లో పెద్దోడిని నేను ఉన్నా కదా నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లారని నందు అందరినీ అడుగుతాడు. చెప్తే నువ్వు పంపిస్తావా అని పరంధామయ్య అడుగుతాడు. వెళ్ళకుండా తాళం వేసే వాడినని నందు అనేసరికి అందుకే చెప్పలేదని పరంధామయ్య అంటాడు.
పరంధామయ్య: ఈ ఇంట్లో ఎవరు చిన్న పిల్లలు లేరు ఎవరి ఇష్టాలు వారివి.
లాస్య: నందు మాట వినాలని చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి?
పరంధామయ్య: నందు నాన్న కాబట్టి మాట వినాలని అంటారు మరి నా ఇష్టం లేకుండా లాస్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని నేను అడగను. ఎందుకంటే నీ జీవితం నీది.
నందు: తులసి ఇంటికి వీళ్ళు వెళ్ళడం ఇలా జరిగింది. గతంలో అంకితకి కూడా అబార్షన్ అవడానికి తులసినే కారణం. తులసి ఇలాగే ఇన్వాల్వ్ అయితే నా ఇంటికి వారసుడి లేకుండా పోతాడు.
అంకిత: అందులో తులసి ఆంటీ తప్పు లేదు తప్పు మా అమ్మది.
లాస్య: మరి ఇంత ప్రేమ ఉండకూడదు, తులసి మీ అమ్మతో సరిగా లేకపోవడం వల్ల అలా జరిగింది.
ప్రేమ్: మేం అందరం ఇక్కడ ఉండటానికి కారణం అమ్మ, తను చెప్పడం వల్లే ఇక్కడ ఉంటున్నాం.
దివ్య: అవును డాడ్ అమ్మ చెప్పడం వల్లే ఇక్కడ ఉంటున్నాం. మామ్ కావాలా, డాడ్ కావాలా అని తేల్చుకునే పరిస్థితి తీసుకురావద్దు
Also Read: నందు దుమ్ముదులిపిన తులసి- చిక్కుల్లో పడబోతున్న సామ్రాట్?
నందు: తులసితో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కానీ నన్ను, లాస్యని నిర్లక్ష్యం చెయ్యొద్దు. తులసి కేవలం మన చుట్టం మాత్రమే. మనం అంతా ఒక కుటుంబంలాగా కలిసి ఉందాం. తనకి గౌరవం ఇద్దాం. తులసితో ఇంటి సమస్యలు షేర్ చేసుకోవద్దు. ఏ విషయం ఉన్నా నాతో షేర్ చేసుకోండి, మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు.
తులసి ఆఫీసులో సామ్రాట్ మీటింగ్ కి సంబంధించి పనులు చూసుకుంటూ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ చదవటం రాకపోవడం వల్ల దివ్య హెల్ప్ తీసుకోవాలని తనకి కాల్ చేస్తుంది. ఆ ఇంగ్లీష్ ఎలా చదవాలో దివ్య చెప్తుంది. పరంధామయ్యకి షుగర్ లెవల్స్ పడిపోవడంతో కళ్ళు తిరుగుతున్నాయ్, చెమటలు పడుతున్నాయని అనసూయని నిద్రలేపుతాడు. దీంతో కంగారుగా పంచదార తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్తుంది. అన్నింటికీ తాళం వేసి ఉండేసరికి లాస్యని దగ్గరకి వెళ్తుంది. ఆ తాళం ఎక్కడ పెట్టానో గుర్తు లేదు ఏదో ఒక విధంగా మీరే చూసుకోండి అని వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. అప్పుడే అంకిత నిద్ర లేచి బయటకి వస్తుంది. అనసూయ కంగారుగా కిందకి వస్తుంది. ఏమైందని అడుగుతుంది.
లాస్యని తాళాలు అడిగితే లేవని మొహం మీద తలుపు వేసిందని చెప్తుంది. దీంతో శ్రుతి దగ్గరకి వెళ్ళి గ్లూకోజ్ తీసుకుని వెంటనే దాన్ని నీళ్ళలో కలిపి పరంధామయ్యకి తాగిస్తుంది. అవి తాగిన తర్వాట కాస్త రిలాక్స్ అవుతాడు. సామ్రాట్ దగ్గరకి బెనర్జీ వస్తాడు. మీటింగ్ కి సంబంధించి ఫైల్స్ అన్నీ తులసి దగ్గరే ఉన్నాయని సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు. తులసి ఇంకా రాకపోయే సరికి కంగారు పడతాడు. తులసి మాత్రం రోడ్డు మీద ఎవరో ఒక వ్యక్తిని కలవడానికి వస్తుంది. బెనర్జీ గురించి ఆయన్ని అడిగి తెలుసుకుంటుంది. ఆయన బెనర్జీ గురించి ఏదో చెప్తాడు అదంతా మ్యూట్ లో ఉంటుంది. అది విని తులసి షాక్ అవుతుంది. బెనర్జీ ఒక ఫ్రాడ్ అని పొరపాటున కూడా అతన్ని కంపెనీలోకి ఎంటర్ చేయవద్దని చెప్తాడు.
Also Read: జగతి ప్లాన్ వినేసిన దేవయాని- రాజీవ్ తో వసు పెళ్ళిని రిషి అడ్డుకుంటాడా?
అంకిత కిచెన్ లో పని చేసుకుంటూ ఉండగా లాస్య వచ్చి కాఫీ అడుగుతుంది. కానీ అంకిత మాత్రం పట్టించుకోకుండా అన్ని పనులు చేయడానికి మాట్లాడటానికి కూడా రిస్ట్రీక్షన్ పెట్టుకున్నా అని వెటకారంగా మాట్లాడుతుంది. ఎప్పుడు అదుపులో ఉండాలో ఎప్పుడు ఎదురుతిరగాలో కూడా తులసి ఆంటీ నేర్పించిందని అంకిత వార్నింగ్ ఇస్తుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. బెనర్జీ సామ్రాట్ ని అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే వెళ్లిపోతాను అని ఒత్తిడి చేస్తాడు. సామ్రాట్ సైన్ చేసే టైమ్ కి తులసి ఎంట్రీ ఇచ్చి ఆపుతుంది. బెనర్జీ ప్రపోజ్ చేసిన చోట ఏ స్కూల్ కట్టడానికి అనుమతి లేదని చెప్పేసరికి షాక్ అవుతాడు. దీంతో బెనర్జీ తులసిని తక్కువ చేసి మాట్లాడతాడు. తులసి మాట విని సామ్రాట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాడు.
తరువాయి భాగంలో..
అనసూయ, పరంధామయ్య గుడికి వస్తారు. అదే గుడికి తులసి, సామ్రాట్ కూడా వస్తారు. అక్కడ ప్రసాదం పంచుతుంటే పరంధామయ్య ఇంకొక కప్పు ఇవ్వమని అడిగేసరికి అతను అవమానకరంగా మాట్లాడతాడు. అదంతా తులసి చూస్తున్నట్టు చూపించారు. కోడలికి మనం భారం అయ్యాము మనం బతకడం అవసరమా అని చాలా బాధగా మాట్లాడుకోవడం తులసి వింటుంది.